అనిల్ దేశ్‌ముఖ్
అనిల్ వసంతరావు దేశ్‌ముఖ్ (జననం 9 మే 1950) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికై, 30 డిసెంబర్ 2019 నుండి 5 ఏప్రిల్ 2021 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]
అనిల్ దేశ్‌ముఖ్ | |||
| |||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – 5 ఏప్రిల్ 2021 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
ముందు | దేవేంద్ర ఫడ్నవిస్ | ||
తరువాత | దిలీప్ వాల్సే పాటిల్ | ||
ఎమ్మెల్యే
కటోల్ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 24 అక్టోబర్ 2019 | |||
ముందు | ఆశిష్ దేశముఖ్ | ||
తరువాత | చరణ్‌సింగ్ ఠాకూర్ | ||
పదవీ కాలం మార్చి 1995 – అక్టోబర్ 2014 (నాలుగు సార్లు) | |||
ముందు | సునీల్ షిండే | ||
తరువాత | ఆశిష్ దేశ్‌ముఖ్ | ||
ఆహార & పౌర సరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం అక్టోబర్ 2009 – అక్టోబర్ 2014 | |||
తరువాత | శంభాజీ పాటిల్ నీలాంగేకర్ | ||
పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం అక్టోబర్ 2004 – అక్టోబర్ 2009 | |||
పాఠశాల విద్య, సమాచార & పౌర సంభందాలు, క్రీడా & యువజన సర్వీసుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం అక్టోబర్ 1999 – అక్టోబర్ 2004 | |||
విద్య, సాంస్కృతిక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం మార్చి 1995 – అక్టోబర్ 1999 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కటోల్, మహారాష్ట్ర, భారతదేశం | 1950 మే 9||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
నివాసం | నాగపూర్ |
జననం, విద్యాభాస్యం
మార్చుఅనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర రాష్ట్రం, నాగ్‌పూర్ జిల్లాలోని కటోల్ సమీపంలోని వాడ్ విహిరా గ్రామంలో జన్మించాడు. ఆయన కటోల్ లో ఉన్నత విద్య పూర్తి చేసి ఆ తరువాత నాగ్‌పూర్‌లోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, డాక్టర్ పంజాబ్రావ్ దేశ్‌ముఖ్ కృషి విద్యాపీఠ్ లో అగ్రికల్చర్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేశాడు.[2]
రాజకీయ జీవితం
మార్చుఅనిల్ దేశ్‌ముఖ్నా నాగ్‌పూర్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా తన రాజకీయ జీవితం ప్రారంభించి 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కటోల్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1995లో బీజేపీ - శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో విద్య & సంస్కృతి శాఖ మంత్రిగా పని చేసి 1999లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అనిల్ 1999లో మహారాష్ట్రలో ఎన్సీపీ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో పాఠశాల విద్య, సమాచార & ప్రజా సంబంధాలు, క్రీడలు & యువజన సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.
ఇన్‌ఛార్జ్ మంత్రి
మార్చు- ఎక్సైజ్, ఫుడ్ & డ్రగ్స్ (2001 నుండి మార్చి 2004)
- పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్‌టేకింగ్స్) (2004 నుండి 2008)
- ఆహారం, పౌర సరఫరాలు & వినియోగదారుల రక్షణ (2009 -2014)
మూలాలు
మార్చు- ↑ HMTV (5 January 2020). "మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు". Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2009-11-22. Retrieved 2010-09-05.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)