దేవేంద్ర ఫడ్నవిస్

మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి

దేవేంద్ర గంగాధరరావు ఫడ్నవిస్ (జననం:1970 జూలై 22) ఒక భారతీయ రాజకీయ నాయకుడు.[1][2] అతను నాగపూర్‌లో జన్మించాడు. 2024 డిసెంబరు 5 నుండి మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నాడు. అతను గతంలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్ పవార్‌తో పాటు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. గతంలో 2014 అక్టోబరు 31 నుండి 2019 నవంబరు 12 వరకు, 2019 నవంబరు 23 నుండి 2019 నవంబరు 28 మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[3]

దేవేంద్ర ఫడ్నవిస్
2022లో ఫడ్నవీస్
18వ మహారాష్ట్ర ముఖ్యమంత్రి
నియామకం
Assumed office
2024 డిసెంబరు 5
గవర్నర్సీ.పీ. రాధాకృష్ణన్
Deputy
అంతకు ముందు వారుఏక్‌నాథ్ షిండే
In office
2019 నవంబరు 23 – 2019 నవంబరు 28
గవర్నర్భగత్ సింగ్ కొష్యారి
Deputyఅజిత్ పవార్
అంతకు ముందు వారురాష్ట్రపతి పాలన
తరువాత వారుఉద్ధవ్ ఠాక్రే
In office
2014 అక్టోబరు 31 – 2019 నవంబరు 12
గవర్నర్సి.హెచ్.విద్యాసాగర్ రావు
భగత్ సింగ్ కొష్యారి
అంతకు ముందు వారురాష్ట్రపతి పాలన
తరువాత వారురాష్ట్రపతి పాలన
9వ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
In office
2022 జూన్ 30 – 2024 డిసెంబరు 5
ముఖ్యమంత్రిఏక్‌నాథ్ షిండే
అంతకు ముందు వారుఅజిత్ పవార్
తరువాత వారుఏక్‌నాథ్ షిండే
అజిత్ పవార్
22వ ప్రతిపక్ష నాయకుడు
మహారాష్ట్ర శాసనసభ
In office
2019 డిసెంబరు 1 – 2022 జూన్ 29
ముఖ్యమంత్రిఉద్ధవ్ ఠాక్రే
అంతకు ముందు వారువిజయ్ వాడెట్టివార్
తరువాత వారుఅజిత్ పవార్
భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు
In office
2013 ఏప్రిిల్ 11 – 2015 జనవరి 6
అంతకు ముందు వారుసుధీర్ ముంగంటివార్
తరువాత వారురావుసాహెబ్ దన్వే
మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
Assumed office
2009
అంతకు ముందు వారునియోజకవర్గం సృష్టించబడింది
నియోజకవర్గంనాగ్‌పూర్ వెస్ట్
In office
1999–2009
అంతకు ముందు వారువినోద్ గుడాధే పాటిల్
తరువాత వారుసుధాకర్ దేశ్‌ముఖ్
నియోజకవర్గంనాగ్‌పూర్ వెస్ట్
నాగ్‌పూర్ మేయర్
In office
1997 మార్చి 5 – 1999 ఫిబ్రవరి 4
అంతకు ముందు వారుకుండతాయి విజయ్కర్
తరువాత వారుకల్పనా పాండే
నియోజకవర్గంరామ్ నగర్ వార్డ్
వ్యక్తిగత వివరాలు
జననం (1970-07-22) 1970 జూలై 22 (వయసు 54)
నాగ్‌పూర్, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
సంతానం1
నివాసం"సాగర్" బంగ్లా, మలబార్ హిల్, దక్షిణ ముంబై, ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
కళాశాలనాగ్‌పూర్ విశ్వవిద్యాలయం,
ఫ్రీ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్
వృత్తిరాజకీయ నాయకుడు

2019 నుండి 2022 వరకు, అతను మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. అతను 2013 నుండి 2015 వరకు భారతీయ జనతాపార్టీ మహారాష్ట్ర రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు.[4] అతను 44 సంవత్సరాల వయస్సులో ముఖ్యమంత్రి అయ్యాడు. శరద్ పవార్ తర్వాత మహారాష్ట్ర చరిత్రలో రెండవ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.[5]

రాజకీయ నేపథ్యం

మార్చు

విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఫడ్నవిస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో, భారతీయ జనతాపార్టీ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో చురుకుగా పాల్గొన్నారు. 21 ఏళ్ల వయస్సులోనే నాగపూర్ నగరపాలక సంస్థ కార్పోరేటరుగా ఎన్నికై, 1997లో నాగపూర్ మేయర్ పదవి చేపట్టారు. దేశంలో చిన్న వయస్సులోనే మేయర్ అయిన వాళ్లలో ఫడ్నవిస్ ఒకరు.[6]

ఆ తర్వాత 3 సార్లు శాసనసభకు ఎన్నిక కావడమే కాకుండా మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని కూడా నిర్వహించారు. 2014 అక్టోబరు 31న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి పొంది మహారాష్ట్ర తొలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగ అవతరించారు.

పురస్కారాలు

మార్చు
  • కామన్వెల్త్ పార్లమెంటు అసోసియేషన్ ద్వారా 2002-03 సంవత్సరానికి గానూ ఉత్తమ పార్లమెంటు సభ్యుని పురస్కారం.
  • జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో ఉత్తమ ఉపన్యాసకుడిగా పురస్కారం.
  • రోటరీ క్లబ్ మోస్ట్ ఛాలెంజింగ్ యూత్ ప్రాంతీయ పురస్కారం.
  • ముక్త్‌చంద్, పూనా, ద్వారా ప్రధానం చేయబడిన ప్రమోద్ మహాజన్ ఉత్తమ పార్లమెంటు సభ్యుని పురస్కారము.
  • నాసిక్ లోని పృణవద్ పరివార్ ద్వారా ప్రధానం చేయబడిన రాజ్‌యోగి నేతా పురస్కారం.
  • హిందూ న్యాయచట్టం లోని ప్రావీణ్యతకు గానూ ప్రధానం చేయబడిన బోస్ బహుమతి.

మూలాలు

మార్చు
  1. Khan, Md Zakariya (4 December 2024). "Devendra Fadnavis' name on oath ceremony invitation card surprises public". Business Standard. Retrieved 4 December 2024.
  2. "Breaking decades-old tradition, Devendra Fadnavis pays tribute to mother, ahead of his swearing-in as Maharashtra CM". The Economic Times. 4 December 2024. ISSN 0013-0389. Retrieved 4 December 2024.
  3. Eenadu (24 November 2024). "విధేయుడు.. వినమ్రుడు.. కార్పొరేటర్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగి." Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. "Devendra Fadnavis sworn is the 27th Chief Minister of Maharashtra". Daily News and Analysis. Diligent Media Corporation Ltd. 31 October 2014. Archived from the original on 31 October 2014. Retrieved 31 October 2014.
  5. Eenadu (5 December 2024). "ఫడణవీస్‌ అనే నేను.. కొలువుదీరిన 'మహా' ప్రభుత్వం". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
  6. ఈనాడు దినపత్రిక, తేది 29-10-2014

బయటి లంకెలు

మార్చు