అనిల్ రమేష్ డావే

భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి,

అనిల్ రమేష్ డావే (జ. 19 నవంబరు 1951) భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్-చైర్మన్.[1] 2007-2010 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, బొంబాయి హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[2][3]

జస్టిస్
అనిల్ రమేష్ డావే
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి,
In office
30 ఏప్రిల్ 2010 – 18 నవంబరు 2016
Appointed byప్రతిభా పాటిల్
బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
In office
11 ఫిబ్రవరి 2010 – 29 ఏప్రిల్ 2010
Appointed byప్రతిభా పాటిల్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
In office
7 నవంబరు 2008 – 10 ఫిబ్రవరి 2010
Appointed byప్రతిభా పాటిల్
గుజరాత్ హైకోర్టు జడ్జి
In office
18 సెప్టెంబరు 1995 – 6 జనవరి 2008
వ్యక్తిగత వివరాలు
జననం (1951-11-19) 1951 నవంబరు 19 (వయసు 73)
గాంగ్‌టక్, సిక్కిం, భారతదేశం
పౌరసత్వంభారతీయుడు
జీవిత భాగస్వామిమీనా అనిల్ డావే
సంతానంపెద్ద కుమారుడు నచికెత్ డావే న్యాయవాది, చిన్న కుమారుడు అలే డావే లా గ్రాడ్యుయేట్
చదువుబికాం, ఎల్ఎల్.ఎం., సిఏ

అనిల్ రమేష్ డావే 1951, నవంబరు 19న సిక్కిం రాష్ట్రంలోని గాంగ్‌టక్ లో జన్మించాడు.

వృత్తిజీవితం

మార్చు

1976, జూలై 25న న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. గుజరాత్ ప్రభుత్వానికి సొలిసిటర్‌గా, గుజరాత్ హైకోర్టు అదనపు ప్రభుత్వ ప్లీడర్‌గా, సర్ ఎల్ఎ షా లా కాలేజీలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా పనిచేశాడు.

1995 సెప్టెంబరు 18న గుజరాత్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమించబడి, 1997 జూన్ 18న శాశ్వత న్యాయమూర్తిగా చేయబడ్డాడు. 2008, జనవరి 7న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యాడు.[4] హైదరాబాదులోని హైకోర్టు న్యాయవ్యవస్థ ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉన్నకాలంలో కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ఐసిఎడిఆర్) కు పోషకుడిగా, సలహాదారుడిగా హైదరాబాదులోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ గా ఉన్నాడు.[5]

2010, ఫిబ్రవరి 11న అతను బొంబాయి హైకోర్టుకు బదిలీ చేయబడ్డాడు. ఆ తరువాత 2010, ఏప్రిల్ 30న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవిని చేపట్టాడు.[6] 2016, నవంబరు 19న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు.[1]

మూలాలు

మార్చు
  1. "A R Dave sworn-in as new CJ of Bombay HC". Hindustan Times (in ఇంగ్లీష్). 2010-02-11. Retrieved 2021-06-15.
  2. Judge Profile - Supreme Court of India
  3. "ARDJ". tshc.gov.in. Retrieved 2021-06-15.
  4. "Anil Ramesh Dave". www.thehinduimages.com. Archived from the original on 2021-06-16. Retrieved 2021-06-15.
  5. "14th All India Meet of the State Legal Services Authorities". nalsa.gov.in (in ఇంగ్లీష్). 2019-01-07. Retrieved 2021-06-15.
  6. Judge Profile - Supreme Court of India