అనిసెట్టి శ్రీధర్

అనిసెట్టి శ్రీధర్ తెలుగు కథా రచయిత.[1] అతని తండ్రి అనిసెట్టి అప్పారావు కూడా రచయిత. అతని పెదనాన్న అనిసెట్టి సుబ్బారావు స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా రచయిత, ప్రగతిశీల కవి, నాటక కర్త. [2]

జీవిత విశేషాలు

మార్చు

అనిసెట్టి శ్రీధర్‌ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసరావుపేట. అతను బి.ఎస్సీ చేశాడు. 1990 నుంచీ కథలు రాస్తున్నాడు. ఇప్పటి వరకూ 32 కథలు రాశాడు. పలు కథలు ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 15 కథలతో 2008లో తీసుకొచ్చిన ‘కొత్త బంగారులోకం’ కథా సంపుటిని కారా మాస్టారు ఆవిష్కరించారు. 2011లో ‘నివేదన’ కవితా సంపుటిని తీసుకొచ్చాడు. పలు ప్రముఖ పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో ‘పాతసామాను’, ‘మద్దతు’, ‘జనజీవన స్రవంతి’, ‘శాహా వర్సెస్‌ మాహా’ కథలకు బహుమతులు అందుకున్నాడు. ‘కొత్తబంగారు లోకం’ కథకు సి.పి.బ్రౌన్‌ అకాడమీ నుంచి బహుమతి దక్కించుకున్నాడు. 1993లో వచ్చిన ఇరవై ఉత్తమ కథల్లో ఒకటిగా ఈయన రాసిన ‘నెత్తురు కూడు’ కథ ఎంపికైంది.[3]

మూలాలు

మార్చు
  1. "అనిసెట్టి శ్రీధర్ - కథానిలయం". kathanilayam.com. Retrieved 2024-11-05.
  2. ""కొత్త బంగారు లోకం" – పరిచయం, అభిప్రాయం, సమీక్ష – పుస్తకం.నెట్". pustakam.net. Retrieved 2024-11-05.
  3. telugu, NT News (2022-06-19). "విష వలయం". www.ntnews.com. Retrieved 2024-11-05.

బాహ్య లంకెలు

మార్చు