అనిసెట్టి సుబ్బారావు

పేరు: అనిసెట్టి సుబ్బారావు(1922-1979)
జన్మ స్థలం: నరసరావుపేట
తల్లిదండ్రులు: కోటిలింగం,ఆదిలక్ష్మమ్మ
birth_name = సుబ్బారావు

| birth_date = 23,అక్టోబరు,1922 | education =బి.ఏ,బి.ఎల్ | death date =27,డిసెంబరు,1979 [1] [2](1949 డిసెంబరు), శాంతి[3] (1951), మా ఊరు (1954) చెప్పుకోదగినవి. సుబ్బారావు కొన్నాళ్ళు ప్రజాశక్తి, అభ్యుదయ పత్రికలకు సంపాదకునిగా పనిచేశాడు. 1942లో, 1944లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకెళ్ళాడు. కమ్యూనిజం వైపు ఆకర్షితుడై తన నాటకాల ద్వారా ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశాడు.

సినీరంగ ప్రస్థానం మార్చు

1955లో రచయితగా తెలుగు సినీరంగంలో అడుగుపెట్టాడు. సుబ్బారావు, మహాకవి శ్రీశ్రీకి బాగా సన్నిహితుడు. సుబ్బారావు మరణించిన తర్వాత మద్రాసులోని సంతాప సభలో శ్రీశ్రీ 'నాకు అనిశెట్టి, ఆరుద్ర అ-ఆ’ లాంటివారు. అ-పోయింది. ఆ- మిగిలింది’ అని చెప్పి క్లుప్తంగా తమ అనుబంధాన్ని తెలిపి ముగించాడు.

అనిసెట్టి పుట్టింది ఆగర్భ శ్రీమంతుల ఇంట్లోనే గాని అతడు తన చుట్టూ వున్న ఆగర్భ దరిద్రుల ఆర్తనాదాలనే విన్నాడు. తండ్రి కోటి లింగం కోటికి పడగెత్తగల శ్రీమంతులు. నరసరావుపేటలోనూ, చిలకలూరిపేటలోనూ ఆయిల్‌ మిల్లులు, ఇరవై లారీలు ఉండేవి. తండ్రికి మిల్లులోని పనివాళ్ళు ఒకసారి సమ్మె చేస్తే అనిసెట్టి ఆ కార్మికుల పక్షమే వహించి తండ్రికి కోపం తెప్పించాడు. 1941 నాటికి గుంటూరు హిందూ కళాశాలలో బి.ఎ. పట్టా పుచ్చుకొన్న అనిసెట్టిని అతని తండ్రి 'లా' చదవడానికి మద్రాసు పంపించాడు.

సినిమాలు మార్చు

మూలాలు మార్చు

  1. సంచలనం సృష్టించిన గాలిమేడలు, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 16 అక్టోబరు 2017, పుట.10
  2. "సంచలనం సృష్టించిన గాలిమేడలు". lit.andhrajyothy.com. Retrieved 2021-10-08.
  3. తొలి తెలుగు మూక నాటిక 'శాంతి', (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 28 ఆగస్టు 2017, పుట.14

యితర లింకులు మార్చు