అనురా రణసింఘే
అనురా నందన రణసింగ్ (1956, అక్టోబరు 13 - 1998, నవంబరు 9) శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు. అంతర్జాతీయ స్థాయిలో 11 సార్లు శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | కలుతర, శ్రీలంక | 1956 అక్టోబరు 13|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1998 నవంబరు 9 కొలంబో, శ్రీలంక | (వయసు 42)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 13) | 1982 మార్చి 14 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1982 సెప్టెంబరు 17 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 8) | 1975 జూన్ 7 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1982 సెప్టెంబరు 15 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2016 సెప్టెంబరు 22 |
జననం, విద్య
మార్చుఅనురా నందన రణసింగ్ 1956, అక్టోబరు 13న శ్రీలంకలోని కలుతరలో జన్మించాడు. 1974-75 క్రికెట్ సీజన్‌లో కొలంబోలోని నలంద కళాశాల తరపున క్రికెట్ ఆడినప్పుడు ఉత్తమ స్కూల్‌బాయ్ క్రికెటర్ అవార్డును గెలుచుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్
మార్చు1975లో 18 ఏళ్ళ వయసులో ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రారంభ టోర్నమెంట్‌లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించి ప్రపంచ కప్‌లో ఆడిన మొదటి పాఠశాల విద్యార్థిగా రణసింగ్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక తరపున 1975 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లతో జరిగిన మూడు మ్యాచ్‌లలో ఆడాడు. ఈ మూడు ఇన్నింగ్స్‌లలో మొత్తం 19 పరుగులు చేశాడు, పది ఓవర్లు వేసి 65 పరుగులు ఇచ్చాడు.[1]
భుజం గాయం కారణంగా అతను 1979 ప్రపంచ కప్‌కు ఎంపికవలేదు. ఇంగ్లాండ్ శ్రీలంకతో ఆడిన ప్రారంభ టెస్ట్ మ్యాచ్‌లో అతను 12 మందిలో పేరు పొందాడు, అయితే ఆట ప్రారంభమైన ఉదయం లలిత్ కలుపెరుమకు అనుకూలంగా వదిలివేయబడ్డాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు వన్డేలలో ఆడాడు. మొదటి వన్డేలో వేగంగా 51 పరుగులు చేశాడు. అయితే ఇంగ్లాండ్ స్కోరును ఛేదించడానికి శ్రీలంక రన్ రేట్‌ను పెంచాల్సిన అవసరం ఉన్నందున జియోఫ్ కుక్ క్యాచ్‌కి చిక్కాడు. శ్రీలంక విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచింది. రెండవదానిలో డకౌట్ అయ్యాడు, శ్రీలంక మూడు పరుగుల తేడాతో గెలిచింది. ఇందులో తొమ్మిది ఓవర్లలో 37 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
నిషేధం
మార్చు1982-83లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళాలని నిర్ణయించుకోవడం ద్వారా రణసింగ్, అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుండి 25 ఏళ్ళ నిషేధాన్ని పొందాడు. 1990లో నిషేధం ఎత్తివేయబడిన తరువాత మళ్ళీ క్రికెట్ లోకి వచ్చాడు. కానీ తర్వాత రిటైర్ అయ్యాడు.
మరణం
మార్చురణసింగ్ తన 42 సంవత్సరాల వయసులో గుండెపోటుతో 1998, నవంబరు 9న కొలంబోలో మరణించాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "Anura Ranasinghe dies in his sleep". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
- ↑ Alter, J. (5 September 2009). "The one that got away". Cricinfo.com. Retrieved 2023-08-21.