వెస్టిండీస్ క్రికెట్ జట్టు
వెస్టిండీస్ పురుషుల క్రికెట్ జట్టు కరీబియన్ ప్రాంతంలో ప్రధానంగా ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు, భూభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పురుషుల క్రికెట్ జట్టు. దీన్ని క్రికెట్ వెస్టిండీస్ నిర్వహిస్తుంది. ఈ జట్టును ది విండీస్ అని కూడా అంటారు.[10] ఈ మిశ్రమ జట్టులోని ఆటగాళ్లను పదిహేను కరేబియన్ దేశ-రాజ్యాలు, భూభాగాల నుండి ఎంపిక చేస్తారు. 2022 నవంబరు 26 నాటికి, వెస్టిండీస్ క్రికెట్ జట్టు అధికారిక ICC ర్యాంకింగ్స్‌లో టెస్ట్‌లలో ఎనిమిదో స్థానంలోను, వన్‌డేలలో పది, T20I లలో ఏడవ స్థానంలోనూ ఉంది.[11]
మారుపేరు | విండీస్ | ||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అసోసియేషన్ | క్రికెట్ వెస్టిండీస్ | ||||||||||||
వ్యక్తిగత సమాచారం | |||||||||||||
టెస్టు కెప్టెన్ | క్రేగ్ బ్రాత్‌వైట్ | ||||||||||||
ఒన్ డే కెప్టెన్ | షాయ్ హోప్ | ||||||||||||
Tట్వంటీ I కెప్టెన్ | రోవ్‌మన్ పొవెల్ | ||||||||||||
కోచ్ | ఆండ్రె కోలీ (టెస్టులు) దారెన్ సమీ (పరిమిత ఓవర్లు)[1] | ||||||||||||
చరిత్ర | |||||||||||||
టెస్టు హోదా పొందినది | 1928 | ||||||||||||
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | |||||||||||||
ICC హోదా | Full Member (1926) | ||||||||||||
ICC ప్రాంతం | ఐసిసి అమెరికాస్ | ||||||||||||
| |||||||||||||
టెస్టులు | |||||||||||||
మొదటి టెస్టు | v. ఇంగ్లాండు లార్డ్స్, లండన్; 1928 జూన్ 23-26 | ||||||||||||
చివరి టెస్టు | v. భారతదేశం క్వీన్స్‌పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్; 2023 జూలై 20-24 | ||||||||||||
| |||||||||||||
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో పోటీ | 2 (first in 2019–2021 ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | 8వ స్థానం (2019–2021 ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్, 2021–2023 ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్) | ||||||||||||
వన్‌డేలు | |||||||||||||
తొలి వన్‌డే | v. ఇంగ్లాండు హెండింగ్లే క్రికెట్ గ్రౌండ్, లీడ్స్; 1973 సెప్టెంబరు 5 | ||||||||||||
చివరి వన్‌డే | v. భారతదేశం at బ్రయన్ లారా క్రికెట్ అకాడమీ, శాన్ ఫెర్నాండో; 2023 ఆగస్టు 1 | ||||||||||||
| |||||||||||||
పాల్గొన్న ప్రపంచ కప్‌లు | 12 (first in 1975) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్లు (1975, 1979) | ||||||||||||
ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ | 2 (first in 2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | రన్నరప్ (2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్) | ||||||||||||
ట్వంటీ20లు | |||||||||||||
తొలి టి20ఐ | v. న్యూజీలాండ్ ఈడెన్ పార్క్, ఆక్లండ్; 2006 ఫిబ్రవరి 16 | ||||||||||||
చివరి టి20ఐ | v. భారతదేశం సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్, లాడర్‌హిల్; 2023 ఆగస్టు 13 | ||||||||||||
| |||||||||||||
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ | 8 (first in 2007 ఐసిసి ప్రపంచ ట్వంటీ20) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్లు (2012 ఐసిసి ప్రపంచ ట్వంటీ20, 2016 ఐసిసి ప్రపంచ ట్వంటీ20) | ||||||||||||
| |||||||||||||
As of 2023 ఆగస్టు 12 |
1970ల చివరి నుండి 1990ల ప్రారంభం వరకు, వెస్టిండీస్ జట్టు టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్ రెండింటిలోనూ ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠంగా ఉండేది. వెస్టిండీస్ నుండి ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లుగా పరిగణించబడుతున్న అనేక మంది క్రికెటర్లు వచ్చారు. వీరిలో గార్ఫీల్డ్ సోబర్స్, లాన్స్ గిబ్స్, జార్జ్ హెడ్లీ, బ్రియాన్ లారా, వివియన్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్, మాల్కం మార్షల్, ఆల్విన్ కల్లిచరణ్, ఆండీ రాబర్ట్స్, రోహన్ కన్హై, ఫ్రాంక్ వోరెల్, గోర్డాన్ గ్రీనిడ్జ్, క్లైడ్ వాల్కాట్, ఎవర్టన్ వీక్స్, కర్ట్లీ ఆంబ్రోస్, డెస్మండ్ హేన్స్, మైఖేల్ హోల్డింగ్, కోర్ట్నీ వాల్ష్, శివనారాయణ్ చందర్‌పాల్, జోయెల్ గార్నర్, వెస్ హాల్ మొదలైనవారు ఉన్నారు. వీళ్ళందరికీ ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించింది.[12][13]
వెస్టిండీస్ ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్‌ను రెండుసార్లు (1975, 1979, ప్రుడెన్షియల్ కప్), ఐసిసి టి 20 ప్రపంచ కప్‌ను రెండుసార్లు (2012,2016, వరల్డ్ ట్వంటీ 20గా మార్చినప్పుడు), ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని ఒకసారి (2004), ICC అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ ఒకసారి (2016),,క్రికెట్ ప్రపంచ కప్ (1983), అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ (2004), ICC ఛాంపియన్స్ ట్రోఫీ (2006)లో కూడా రన్నరప్‌గా నిలిచింది. వెస్టిండీస్ వరుసగా మూడు ప్రపంచ కప్ ఫైనల్స్‌లో (1975, 1979,1983) ఆడింది. వెంటవెంటనే ప్రపంచ కప్‌లను గెలుచుకున్న మొదటి జట్టు (1975, 1979). ఈ రెండు రికార్డులను ఆస్ట్రేలియా అధిగమించింది. ఆస్ట్రేలియా వరుసగా 4 ప్రపంచ కప్ ఫైనల్స్‌లో (1996, 1999, 2003, 2007) ఆడి, మూడింటిని (1999, 2003, 2007) గెలుచుకుంది.
సభ్యులుగా ఉన్న దేశాలు, డిపెండెన్సీలు
మార్చు- సార్వభౌమ రాష్ట్రాలు
- Kingdom of the Netherlands కు చెందిన భూభాగం
- Sint Maarten ఎల్
- United Kingdom కు చెందిన విదేశీ భూభాగాలు
- Anguilla ఎల్
- British Virgin Islands ఎల్
- Montserrat ఎల్
- United States కు చెందిన భూభాగం
- Legends
- L = Affiliate of the Leeward Islands Cricket Association
- W = Affiliate of the Windward Islands Cricket Board of Control
క్రికెట్ వెస్టిండీస్‌లో అనుబంధ సంస్థలు
మార్చుజట్టు గవర్నింగ్ బాడీ అయిన క్రికెట్ వెస్టిండీస్లో బార్బడోస్, గయానా, జమైకా, లీవార్డ్ దీవులు, ట్రినిడాడ్ అండ్ టొబాగో, విండ్‌వార్డ్ దీవులకు చెందిన ఆరు క్రికెట్ సంఘాలు సభ్యులు. లీవార్డ్ ఐలాండ్స్ క్రికెట్ అసోసియేషన్‌లో రెండు సార్వభౌమ దేశాలకు చెందిన మూడు క్రికెట్ సంఘాలు సభ్యులుగా ఉన్నాయి (ఆంటిగ్వా అండ్ బార్బుడా నుండి ఒకటి, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ నుండి రెండు), మూడు బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీలు (అంగ్విల్లా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, మోంట్‌సెరాట్), ఒక US భూభాగం (US వర్జిన్ దీవులు), ఒక డచ్ రాజ్య భాగం (సింట్ మార్టెన్). విండ్‌వర్డ్ ఐలాండ్స్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌లో నాలుగు సార్వభౌమ దేశాలకు (డొమినికా, గ్రెనడా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్) చెందిన సంఘాలు ఉన్నాయి.
క్రికెట్ వెస్టిండీస్ లోని సభ్య సంఘాలు:
- బార్బడోస్ క్రికెట్ అసోసియేషన్ (BCA)
- గయానా క్రికెట్ బోర్డు (GCB)
- జమైకా క్రికెట్ అసోసియేషన్ (JCA)
- లీవార్డ్ ఐలాండ్స్ క్రికెట్ అసోసియేషన్ (LICA); ఇందులో కింది సంఘాలు సభ్యులు:
- అంగుయిలా క్రికెట్ అసోసియేషన్
- ఆంటిగ్వా అండ్ బార్బుడా క్రికెట్ అసోసియేషన్
- బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ క్రికెట్ అసోసియేషన్
- మోంట్‌సెరాట్ క్రికెట్ అసోసియేషన్
- నెవిస్ క్రికెట్ అసోసియేషన్ (ఒక్క నెవిస్ ద్వీపం కోసం)
- సెయింట్ కిట్స్ క్రికెట్ అసోసియేషన్ (సెయింట్ కిట్స్ ద్వీపం కోసం మాత్రమే)
- సింట్ మార్టెన్ క్రికెట్ అసోసియేషన్
- యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ ఐలాండ్స్ క్రికెట్ అసోసియేషన్
- ట్రినిడాడ్ అండ్ టొబాగో క్రికెట్ బోర్డు (TTCB)
- విండ్‌వర్డ్ ఐలాండ్స్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ (WICBC); ఇందులో కింది సంఘాలు సభ్యులు:
- డొమినికా క్రికెట్ అసోసియేషన్
- గ్రెనడా క్రికెట్ అసోసియేషన్
- సెయింట్ లూసియా క్రికెట్ అసోసియేషన్
- సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ క్రికెట్ అసోసియేషన్
భవిష్యత్తులో సభ్యులు కాగల దేశాలు
మార్చు- బహమాస్
- ఫ్రాన్స్ యొక్క విదేశీ కలెక్టివిటీస్
- సెయింట్ బార్తెలెమీ ఎల్
- సెయింట్ మార్టిన్ ఎల్
- ఫ్రెంచ్ రిపబ్లిక్ యొక్క విదేశీ ప్రాంతాలు
- గ్వాడెలోప్ ఎల్
- మార్టినిక్ W
- నెదర్లాండ్స్ ప్రత్యేక మునిసిపాలిటీలు
- సబా ఎల్
- సింట్ యుస్టాటియస్
- సూచిక
- L = లీవార్డ్ ఐలాండ్స్ క్రికెట్ జట్టులో భాగం, లీవార్డ్ ఐలాండ్స్ క్రికెట్ అసోసియేషనులో సభ్యురాలు
- W = విండ్‌వార్డ్ ఐలాండ్స్ క్రికెట్ జట్టులో భాగం, విండ్‌వార్డ్ ఐలాండ్స్ క్రికెట్ అసోసియేషనులో సభ్యురాలు
చరిత్ర
మార్చువెస్టిండీస్ క్రికెట్ జట్టు చరిత్ర 1890 లలో ప్రారంభమైంది. ఆ ఏడు సందర్శనకు వచ్చిన ఇంగ్లీష్ జట్లతో ఆడేందుకు మొదటి ప్రతినిధి జట్లను ఎంపిక చేశారు. 1926లో WICB అంతర్జాతీయ క్రికెట్ పాలక సంస్థ అయిన ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్‌లో చేరి,[14] తమ మొదటి అధికారిక అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. 1928లో టెస్టు హోదాను మంజూరు చేసింది, తద్వారా నాల్గవ టెస్టు 'నేషన్' అయింది. 1930లలో వారి ప్రారంభ రోజులలో, ఈ పక్షం బ్రిటిష్ కాలనీలకు ప్రాతినిధ్యం వహించింది, అది తరువాత వెస్టిండీస్ ఫెడరేషన్‌తో పాటు బ్రిటిష్ గయానాగా ఏర్పడింది.
రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే ముందు వెస్టిండీస్, చివరిగా 1939లో ఇంగ్లండ్‌తో ఆడింది. 1948 జనవరిలో MCC వెస్టిండీస్‌లో పర్యటించే వరకు విరామం వచ్చింది.[15] యుద్ధం తర్వాత జరిగిన ఆ మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లలో గెర్రీ గోమెజ్, జార్జ్ హెడ్లీ, జెఫ్రీ స్టోల్‌మేయర్, ఫోఫీ విలియమ్స్ మాత్రమే ఇంతకుముందు టెస్టు క్రికెట్ ఆడిన అనుభవజ్ఞులు.[16] 1948లో, లెగ్ స్పిన్నర్ విల్ఫ్రెడ్ ఫెర్గూసన్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 11/229తో ఒక టెస్టులో పది వికెట్లు తీసిన మొదటి వెస్టిండీస్ బౌలర్‌గా నిలిచాడు;[17] అదే సంవత్సరం, హైన్స్ జాన్సన్ అదే ప్రత్యర్థులపై 10/96తో ఆ ఘనతను సాధించిన మొదటి వెస్టిండీస్ ఫాస్టు బౌలరయ్యాడు.[18]
1950 జూన్ 29న లార్డ్స్‌లో వెస్టిండీస్ తొలిసారిగా ఇంగ్లండ్‌ను ఓడించింది. రామధిన్, ఆల్ఫ్ వాలెంటైన్‌లు ఆ విజయానికి మూలకారకులు. అది ప్రేరణగా లార్డ్ బిగినర్, కాలిప్సో సంగీతాన్ని సృజించాడు. తర్వాత 1950 ఆగస్టు 16 న, వారు ఓవల్‌లో గెలిచి, 3-1 తో సిరీస్ విజయాన్ని పూర్తి చేశారు. టెస్టు టీమ్‌గా ప్రారంభ రోజుల్లో కొంతమంది గొప్ప ఆటగాళ్ళు ఉన్నప్పటికీ, 1960ల వరకూ, జట్టు తెల్లజాతి ఆధిపత్యం నుండి నల్లజాతి ఆధిపత్యానికి మారే వరకు, ఫ్రాంక్ వోరెల్, గ్యారీ సోబర్స్‌ల కెప్టెన్సీలు వచ్చేవరకూ, జట్టుకు విజయాలు చెదురుమదురుగానే వచ్చాయి.
1970ల చివరి నాటికి, క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్టిండీస్ అనధికారిక ప్రపంచ ఛాంపియన్‌లుగా గుర్తింపు పొందింది. ఈ ఖ్యాతిని 1980ల వరకు నిలుపుకుంది.[19] ఈ కాలంలో వెస్టిండీస్, ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ల తోడ్పాటుతో కూడిన నలుగురు-బౌలర్ల ఫాస్టు బౌలింగ్ దాడికి ప్రసిద్ధి చెందింది. 1976లో, ఫాస్టు బౌలర్ మైఖేల్ హోల్డింగ్ ఇంగ్లండ్‌తో జరిగిన ఓవల్‌టెస్ట్‌లో 14/149 వికెట్లు తీశాడు. ఇది ఇప్పటికీ వెస్టిండీస్ బౌలరు ఒక టెస్ట్‌లో సాధించిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.[20][21] జట్టు 1984 లో వరుసగా 11 టెస్టు విజయాల రికార్డును నెలకొల్పింది. ఇంగ్లాండ్‌పై రెండు సార్లు 5–0 తో "బ్లాక్‌వాష్" చేసింది.
అయితే, 1990లు, 2000లలో, వెస్టు ఇండియన్ క్రికెట్ క్షీణించింది. వెస్టు ఇండియన్ క్రికెట్ బోర్డు ఆటను ఔత్సాహిక కాలక్షేపం నుండి వృత్తిపరమైన క్రీడగా మలచడంలో వైఫల్యం చెందడం, వెస్టిండీస్ లోని దేశాల్లో ఆర్థిక క్షీణతతో జట్టు తన గత వైభవాన్ని నిలుపుకోవడానికి పోరాడుతోంది. 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం, 2006 ఛాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్ ప్రదర్శన కొంత ఆశాజనకంగా మిగిలిపోయింది. అయితే ట్వంటీ 20 క్రికెట్ ప్రారంభం తర్వాతనే వెస్టిండీస్ క్రికెట్ ప్రముఖులలో, క్రికెట్ అభిమానులలో తిరిగి అభిమానం పొందడం మొదలైంది. క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, మార్లోన్ శామ్యూల్స్, లెండిల్ సిమన్స్, DJ బ్రావో, ఆండ్రీ రస్సెల్, కార్లోస్ బ్రాత్‌వైట్ మొదలైనవారు తమ పవర్ హిట్టింగ్‌తో గేమ్‌లను కైవసం చేసుకోగల ఆటగాళ్ళు తయారయ్యారు. 2012 ప్రపంచ ట్వంటీ 20 లో ఆస్ట్రేలియాను, ఆపై ఆతిథ్య శ్రీలంకను ఓడించి, 1979 ప్రపంచ కప్ తరువాత తమ మొదటి ICC ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. ఇంగ్లాండ్‌ను ఓడించి 2016 ప్రపంచ ట్వంటీ 20ని గెలుచుకున్నారు. తద్వారా ప్రపంచ ట్వంటీ 20ని రెండుసార్లు గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది. దీనికి బోనసుగా, పురుషుల, మహిళల వరల్డ్ ట్వంటీ 20 రెండింటినీ ఒకే రోజు గెలుచుకున్న మొదటి జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. వెస్టిండీస్ మహిళల జట్టు, మూడుసార్లు ఛాంపియనైన ఆస్ట్రేలియాను ఓడించి తమ మొదటి ICC ప్రపంచ టైటిల్‌ను గెలుచుకుంది.
వేదికలు
మార్చుకింది పదకొండు స్టేడియాల్లో కనీసం ఒక టెస్టు మ్యాచ్ ఆడారు.[22] బ్రాకెట్లలో 2021 ఏప్రిల్ 2 నాటికి వేదికలో ఆడిన టెస్ట్‌ల సంఖ్య, వన్డే ఇంటర్నేషనల్‌లు, ట్వంటీ20 ఇంటర్నేషనల్‌ల సంఖ్య ఉంటుంది:
- క్వీన్స్ పార్క్ ఓవల్ – పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ (62/73/6): క్వీన్స్ పార్క్ ఓవల్ కరేబియన్‌లోని ఇతర మైదానాల కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. 1930 లో ఇక్కడ మొదటి టెస్టు జరిగింది. ఈ మైదానాన్ని క్రికెట్ ప్రపంచంలో అత్యంత సుందరమైన వేదికలలో ఒకటిగా పరిగణిస్తారు. ట్రినిడాడ్ దేశపు ఉత్తర కనుమల దృశ్యం దీనికి నేపథ్యంగా కనిపిస్తుంది. దీనికి 18,000 పైచిలుకు సామర్థ్యం ఉంది.
- కెన్సింగ్టన్ ఓవల్ – బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్ (55/46/23): కెన్సింగ్టన్ ఓవల్ 1930లో ఈ ప్రాంతపు మొదటి టెస్టు మ్యాచ్ జరిగింది. ఇది వెస్టిండీస్ క్రికెట్‌కు 'మక్కా'గా గుర్తింపు పొందింది. 2007 ప్రపంచ కప్ కోసం దీని సామర్థ్యాన్ని 15,000 నుండి 28,000కి పెంచారు. ప్రపంచ కప్ తర్వాత దాన్ని ప్రస్తుత సామర్థ్యం 11,000 కి తగ్గించారు. ఇది రెండు ICC ప్రపంచ ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది - 2007 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా శ్రీలంకపై గెలవగా, 2010 వరల్డ్ ట్వంటీ20 ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ గెలిచింది.
- బౌర్డా – జార్జ్‌టౌన్, గయానా (30/11/0): బౌర్డా 1930లో తొలిసారిగా టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇది దక్షిణ అమెరికాలోని ఏకైక టెస్టు గ్రౌండ్ (ప్రావిడెన్స్ ఉపయోగించే వరకు). సముద్ర మట్టానికి దిగువన ఉన్నది కూడా ఇదొక్కటే. పిచ్‌పైకి వరదలు రాకుండా నిరోధించడానికి, దీనికి ఒక కందకం కూడా ఉంది. దీని సామర్థ్యం సుమారు 22,000. 1999 ఏప్రిల్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన వన్ డే ఇంటర్నేషనల్‌లో పిచ్‌ను ప్రేక్షకులు ఆక్రమించుకున్న సంఘటనకు ఇది గుర్తుండిపోతుంది. ఆస్ట్రేలియాకు టై చెయ్యాలంటే చివరి బంతికి 3 పరుగులు, గెలవడానికి 4 పరుగులు అవసరం. పిచ్ ఆక్రమణ, బెయిళ్ళ దొంగిలింత ఫలితంగా మ్యాచ్ టై అయినట్లు పరిగణించారు.[23]
- సబీనా పార్క్ - కింగ్‌స్టన్, జమైకా (54/41/6): సబీనా పార్క్ మొదటిసారిగా 1930లో టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. కాఫీకి ప్రసిద్ధి చెందిన బ్లూ మౌంటైన్‌లు దీనికి నేపథ్యంగా ఉన్నాయి. సబీనా పార్క్ లోనే గ్యారీ సోబర్స్ ప్రపంచ రికార్డు 365 నాటౌట్ సాధించాడు. 1998లో, పిచ్ చాలా ప్రమాదకరంగా ఉన్నందున ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు తొలి రోజునే రద్దు చేసారు. దీని సామర్థ్యం 15,000.
- ఆంటిగ్వా రిక్రియేషన్ గ్రౌండ్ – సెయింట్ జాన్స్, ఆంటిగ్వా (22/11/0): ఆంటిగ్వా రిక్రియేషన్ గ్రౌండ్ మొదటిసారిగా 1981లో టెస్ట్‌ను నిర్వహించింది. ఈ మైదానంలో మూడు టెస్టు ట్రిపుల్ సెంచరీలు నమోదయ్యాయి: 2005లో క్రిస్ గేల్ 317, 1994లో బ్రియాన్ లారా 375 పరుగులు, 2004లో బ్రియాన్ లారా 400 నాటౌట్ ప్రపంచ రికార్డు స్కోర్లు. రాజధాని నగరం వెలుపల 3 మైళ్ల దూరంలో నిర్మించబడుతోన్న కొత్త క్రికెట్ స్టేడియం కోసం, 2006 జూన్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగే మైదానాల జాబితా నుండి ఈ చారిత్రిక స్టేడియాన్ని తొలగించారు. అయితే, 2009 ఫిబ్రవరిలో కొత్త నార్త్ సౌండ్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య టెస్టు మ్యాచ్ రద్దైన తర్వాత, మళ్ళీ ARGకి టెస్టు క్రికెట్ తిరిగి వచ్చింది.
- అర్నోస్ వేల్ - అర్నోస్ వేల్, కింగ్‌స్‌టౌన్, సెయింట్ విన్సెంట్ (3/23/2): ది ఆర్నోస్ వేల్ గ్రౌండ్ (ప్లేయింగ్ ఫీల్డ్స్) మొదటిసారిగా 1997లో ఒక టెస్టును నిర్వహించింది.
- నేషనల్ క్రికెట్ స్టేడియం – సెయింట్ జార్జ్, గ్రెనడా (4/25/6): గ్రెనడాలోని క్వీన్స్ పార్క్ మొదటిసారిగా 2002లో ఒక టెస్టును నిర్వహించింది.
- డారెన్ స్యామీ నేషనల్ క్రికెట్ స్టేడియం – గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా (10/26/17): ఒరిజినల్‌గా దీని పేరు బ్యూసెజోర్ క్రికెట్ గ్రౌండ్. ఇక్కడ 2003లో తొలి టెస్టు జరిగింది. దీని సామర్థ్యం 12,000. కరీబియన్‌లో డే-నైట్ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన మొదటి స్టేడియం ఇది. వెస్టిండీస్, జింబాబ్వే మధ్య ఆ మ్యాచ్ జరిగింది. 8 ఏళ్ల విరామం తర్వాత టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన సందర్భంగా న్యూజిలాండ్ 2014లో ఒక టెస్టు ఆడాల్సి ఉంది. 2016 వరల్డ్ ట్వంటీ 20లో వెస్టిండీస్ విజయం తర్వాత, సెయింట్ లూసియాన్ ప్రభుత్వం ఈ వేదికకు కెప్టెన్ సామీ పేరు పెట్టింది. మరొక సెయింట్ లూసియన్ ఆటగాడు, జాన్సన్ చార్లెస్, 2012, 2016 ఛాంపియన్‌షిప్ స్క్వాడ్‌లలో భాగమైన తర్వాత అతని గౌరవార్థం ఒక స్టాండ్‌కు అతని పేరు పెట్టారు.
- వార్నర్ పార్క్ స్టేడియం – బాస్సెటెర్రే, సెయింట్ కిట్స్ (3/18/10): వార్నర్ పార్క్ స్పోర్టింగ్ కాంప్లెక్స్‌లో 2006 మే 23 న మొదటి వన్డే ఇంటర్నేషనల్, 2006 జూన్ 22 న మొదటి టెస్టు మ్యాచ్ జరిగాయి. స్టేడియం సామర్థ్యం 8,000.
- ప్రొవిడెన్స్ స్టేడియం – జార్జ్‌టౌన్, గయానా (2/24/10): ప్రొవిడెన్స్ స్టేడియం 2007 క్రికెట్ ప్రపంచ కప్ కోసం నిర్మించారు. 2007 మార్చి 28 న మొదటి వన్డే ఇంటర్నేషనల్, 2008 మార్చి 22 న మొదటి టెస్టు మ్యాచ్ జరిగాయి. ఈ స్టేడియం సామర్థ్యం 15,000. బౌర్డాకు బదులుగా ఇది టెస్టు క్రికెట్‌కు ఆతిథ్యం ఇస్తుంది.
- సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం – నార్త్ సౌండ్, ఆంటిగ్వా (12/20/4): సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియం 2007 క్రికెట్ ప్రపంచ కప్ కోసం నిర్మించారు. 2007 మార్చి 27 న మొదటి వన్డే ఇంటర్నేషనల్, 2008 మే 30 న మొదటి టెస్టు మ్యాచ్ జరిగాయి. స్టేడియం సామర్థ్యం 10,000. ఆంటిగ్వా రిక్రియేషన్ గ్రౌండ్‌కు బదులుగా టెస్టు క్రికెట్‌ను ఇక్కడ నిర్వహిస్తారు.
- విండ్సర్ పార్క్ స్టేడియం – రోసో, డొమినికా (6/4/4): విండ్సర్ పార్క్ వెస్టు ఇండియన్ టీమ్‌కు మరో సొంత వేదిక. దీని నిర్మాణం 2005లో ప్రారంభమైంది. 2007 అక్టోబరులో ప్రారంభించారు. చివరికి 2007 క్రికెట్ ప్రపంచ కప్‌కు వేదికగా వాడుకునేందుకు ఇది అందిరాలేదు. ఇది ఫస్ట్-క్లాస్ క్రికెట్‌కు ఆతిథ్యం ఇస్తుంది. 2011 జూలై 6 న భారత జట్టుతో జరిగిన మొదటి టెస్టును నిర్వహించగా, 2009 జూలై 26 న మొదటి వన్డే ఇంటర్నేషనల్‌ను నిర్వహించింది. ఇందులో 12,000 సీటింగ్ కెపాసిటీ ఉంది.
టోర్నమెంటు చరిత్ర
మార్చుICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్
మార్చుICC ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ రికార్డు | ||||||||||||||||||
సంవత్సరం | లీగ్ వేదిక | ఫైనల్ హోస్ట్ | చివరి | తుది స్థానం | ||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Pos | మ్యాచ్‌లు | Ded | PC | Pts | PCT | |||||||||||||
P | W | L | D | T | ||||||||||||||
2019–21[24] | 8/9 | 13 | 3 | 8 | 2 | 0 | 6 | 720 | 194 | 26.9 | రోజ్ బౌల్, ఇంగ్లాండ్ | అర్హత పొందలేదు | 8వ | |||||
2021–23[25] | 8/9 | 13 | 4 | 7 | 2 | 0 | 2 | 156 | 54 | 34.6 | ది ఓవల్, ఇంగ్లాండ్ | అర్హత పొందలేదు | 8వ |
క్రికెట్ ప్రపంచ కప్
మార్చుప్రపంచకప్ రికార్డు | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
హోస్ట్‌లు, సంవత్సరం | రౌండు | స్థానం | గ్రూ.పా | గె | ఓ | టి | NR | ||
1975 | ఛాంపియన్స్ | 1/8 | 5 | 5 | 0 | 0 | 0 | ||
1979 | 5 | 4 | 0 | 0 | 1 | ||||
1983 | రన్నర్స్-అప్ | 2/8 | 8 | 6 | 2 | 0 | 0 | ||
1987 | రౌండ్ 1 | 5/8 | 6 | 3 | 3 | 0 | 0 | ||
1992 | 6/9 | 8 | 4 | 4 | 0 | 0 | |||
1996 | సెమీ ఫైనల్స్ | 4/12 | 7 | 3 | 4 | 0 | 0 | ||
1999 | రౌండ్ 1 | 7/12 | 5 | 3 | 2 | 0 | 0 | ||
2003 | 7/14 | 6 | 3 | 2 | 0 | 1 | |||
2007 | సూపర్ 8 | 6/16 | 10 | 5 | 5 | 0 | 0 | ||
మూస:Country data BGD2011 | క్వార్టర్ ఫైనల్స్ | 8/14 | 7 | 3 | 4 | 0 | 0 | ||
2015 | 8/14 | 7 | 3 | 4 | 0 | 0 | |||
2019 | గ్రూప్ స్టేజ్ | 9/10 | 9 | 2 | 6 | 0 | 1 | ||
2023 | అర్హత సాధించలేదు | ||||||||
మొత్తం | 12/13 | 2 శీర్షికలు | 80 | 43 | 35 | 0 | 2 |
- 1979-2014: ఆడాల్సిన అవసరం లేదు (వన్‌డే ర్యాంకింగ్స్‌లో టాప్ 8, ICC పూర్తి సభ్యుడు)
- 2018 : రన్నరప్ (ICC క్రికెట్ ప్రపంచ కప్ 2019కి అర్హత పొందింది)
- 2023 : సూపర్ సిక్స్ (5వ స్థానం)
ICC T20 ప్రపంచ కప్
మార్చుటీ20 ప్రపంచకప్‌లో రికార్డు | |||||||
---|---|---|---|---|---|---|---|
ఆతిథ్య దేశం, సంవత్సరం | రౌండు | స్థానం | గ్రూ.పా | గె | ఓ | టి | NR |
2007 | గ్రూప్ స్టేజ్ | 11/12 | 2 | 0 | 2 | 0 | 0 |
2009 | సెమీ ఫైనల్స్ | 4/12 | 6 | 3 | 3 | 0 | 0 |
2010 | సూపర్ 8 | 6/12 | 5 | 3 | 2 | 0 | 0 |
2012 | ఛాంపియన్స్ | 1/12 | 7 | 3 | 2 | 1 | 1 |
2014 | సెమీ ఫైనల్స్ | 3/16 | 5 | 3 | 2 | 0 | 0 |
2016 | ఛాంపియన్స్ | 1/16 | 6 | 5 | 1 | 0 | 0 |
2021 | సూపర్ 12 లు | 9/16 | 5 | 1 | 4 | 0 | 0 |
2022 | సమూహ దశ | 15/16 | 3 | 1 | 2 | 0 | 0 |
2024 | అర్హత సాధించారు | ||||||
మొత్తం | 8/8 | 2 శీర్షికలు | 39 | 19 | 18 | 1 | 1 |
ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
ఆతిథ్య దేశం, సంవత్సరం | రౌండు | స్థానం | గ్రూ.పా | గె | ఓ | టి | NR | |
1998 | రన్నర్స్-అప్ | 2/9 | 3 | 2 | 1 | 0 | 0 | |
2000 | రౌండ్ 1 | 11/11 | 1 | 0 | 1 | 0 | 0 | |
2002 | 7/12 | 2 | 1 | 1 | 0 | 0 | ||
2004 | ఛాంపియన్స్ | 1/12 | 4 | 4 | 0 | 0 | 0 | |
2006 | రన్నర్స్-అప్ | 2/10 | 5 | 3 | 1 | 0 | 0 | |
2009 | రౌండ్ 1 | 8/8 | 3 | 0 | 3 | 0 | 0 | |
2013 | 7/8 | 3 | 1 | 1 | 1 | 0 | ||
2017 | అర్హత సాధించలేదు | |||||||
మొత్తం | 7/8 | 1 శీర్షిక | 20 | 10 | 8 | 1 | 0 |
- ప్రపంచ కప్ :
- T20 ప్రపంచ కప్ :
- ఛాంపియన్స్ (2): 2012, 2016
- ఛాంపియన్స్ ట్రోఫీ :
- ఛాంపియన్స్ (1): 2004
- రన్నర్స్-అప్ (2): 1998, 2006
- ఇన్నింగ్స్ మొత్తం 700 కంటే ఎక్కువ
జట్టు తరఫున: 1957–58లో కింగ్‌స్టన్‌లో పాకిస్థాన్‌పై 3 వికెట్లకు 790 డిక్లేర్డ్; 2003–04లో సెయింట్ జాన్స్‌లో ఇంగ్లండ్‌పై 5 వికెట్లకు 751 డిక్లేర్డ్; 2004–05లో సెయింట్ జాన్స్‌లో దక్షిణాఫ్రికాపై 747 ఆలౌట్; 2008-2009లో బ్రిడ్జ్‌టౌన్‌లో ఇంగ్లండ్‌పై 9 వికెట్లకు 749 డిక్లేర్ చేసింది
ప్రత్యర్థి జట్టు: 1929–30లో కింగ్‌స్టన్‌లో ఇంగ్లండ్ 849; 1954–55లో కింగ్‌స్టన్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్లకు 758 డిక్లేర్.
- ఇన్నింగ్స్ మొత్తం స్కోరు 60 లోపు
జట్టు తరఫున: 2003–04లో కింగ్‌స్టన్‌లో ఇంగ్లండ్‌పై 47; 1998–99లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఆస్ట్రేలియాపై 51; 1986–87లో ఫైసలాబాద్‌లో పాకిస్థాన్‌పై 53; 2000లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై 54; 2017-18లో కరాచీలో పాకిస్థాన్‌పై 60 (60/9 (లొంగిపోయింది))
ప్రత్యర్థి జట్టు: 1993–94లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఇంగ్లండ్ ద్వారా 46; 2008-09లో కింగ్‌స్టన్‌లో ఇంగ్లండ్ చేత 51
- విండీస్ తరఫున ట్రిపుల్ సెంచరీలు
2003–04లో సెయింట్ జాన్స్‌లో ఇంగ్లాండ్‌పై బ్రియాన్ లారా 400 నాటౌట్; 1993–94లో సెయింట్ జాన్స్‌లో ఇంగ్లాండ్‌పై బ్రియాన్ లారా 375; 1957–58లో కింగ్‌స్టన్‌లో పాకిస్తాన్‌పై గ్యారీ సోబర్స్ 365 నాటౌట్; 2010–11లో గాలేలో శ్రీలంకపై క్రిస్ గేల్ 333; 2004–05లో సెయింట్ జాన్స్‌లో దక్షిణాఫ్రికాపై క్రిస్ గేల్ 317; 1973–74లో బ్రిడ్జ్‌టౌన్‌లో ఇంగ్లాండ్‌పై లారెన్స్ రోవ్ చేత 302
- ఒక టెస్టు మ్యాచ్‌లో విండీస్ తరఫున పన్నెండు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్న సందర్భాలు
1976లో ఓవల్‌లో ఇంగ్లండ్‌పై మైఖేల్ హోల్డింగ్ చేసిన 149 పరుగులకు 14; 1994–95లో వెల్లింగ్‌టన్‌లో న్యూజిలాండ్‌పై కోర్ట్నీ వాల్ష్ 55 కి 13; షానన్ గాబ్రియేల్ శ్రీలంకపై 121 పరుగులకు 13 వికెట్లు తీసుకున్నాడు.: 1974లో మద్రాస్‌లో భారత్‌పై ఆండీ రాబర్ట్స్ 121కి 12 వికెట్లు
- హ్యాట్రిక్‌లు
1959లో పాకిస్థాన్‌పై వెస్ హాల్ ; 1961లో ఆస్ట్రేలియాపై లాన్స్ గిబ్స్ ; 1988లో ఆస్ట్రేలియాపై కోర్ట్నీ వాల్ష్ ; 2003లో ఆస్ట్రేలియాపై జెర్మైన్ లాసన్
వన్డే మ్యాచ్‌లు
మార్చు- హ్యాట్రిక్
2006 అక్టోబరు 19 న ముంబైలో ఆస్ట్రేలియాతో జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో జెరోమ్ టేలర్ వన్‌డే హ్యాట్రిక్ ప్రదర్శన చేశాడు [26]
ICC 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో, నెదర్లాండ్స్‌పై ప్రపంచ కప్ హ్యాట్రిక్ సాధించిన ఆరో బౌలర్‌గా కెమర్ రోచ్ నిలిచాడు.
టెస్టు కెప్టెన్లు
మార్చుకింది పురుషులు వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కనీసం ఒక టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఉన్నారు:
వెస్టిండీస్ టెస్టు మ్యాచ్ కెప్టెన్లు | ||
---|---|---|
సంఖ్య | పేరు | కాలం |
1 | కార్ల్ న్యూన్స్ | 1928–1929/30 |
2 | టెడ్డీ హోడ్ | 1929/30 |
3 | నెల్సన్ బెటాన్‌కోర్ట్ | 1929/30 |
4 | మారిస్ ఫెర్నాండెజ్ | 1929/30 |
5 | జాకీ గ్రాంట్ | 1930/31–1934/35 |
6 | రోల్ఫ్ గ్రాంట్ | 1939 |
7 | జార్జ్ హెడ్లీ | 1947/48 |
8 | గెర్రీ గోమెజ్ | 1947/48 |
9 | జాన్ గొడ్దార్డ్ | 1947/48–1951/52, 1957 |
10 | జెఫ్రీ స్టోల్‌మేయర్ | 1951/52–1954/55 |
11 | డెనిస్ అట్కిన్సన్ | 1954/55–1955/56 |
12 | గెర్రీ అలెగ్జాండర్ | 1957/58–1959/60 |
13 | ఫ్రాంక్ వోరెల్ | 1960/61–1963 |
14 | గార్ఫీల్డ్ సోబర్స్ | 1964/65–1971/72 |
15 | రోహన్ కన్హై | 1972/73–1973/74 |
16 | క్లైవ్ లాయిడ్ | 1974/75–1977/78, 1979/80–1984/85 |
17 | ఆల్విన్ కల్లిచరణ్ | 1977/78–1978/79 |
18 | డెరిక్ ముర్రే | 1979/80 |
19 | వివ్ రిచర్డ్స్ | 1980, 1983/84–1991 |
20 | గోర్డాన్ గ్రీనిడ్జ్ | 1987/88 |
21 | డెస్మండ్ హేన్స్ | 1989/90–1990/91 |
22 | రిచీ రిచర్డ్‌సన్ | 1991/92–1995 |
23 | కోర్ట్నీ వాల్ష్ | 1993/94–1997/98 |
24 | బ్రియాన్ లారా | 1996/97–1999/2000, 2002/03–2004, 2006–2007 |
25 | జిమ్మీ ఆడమ్స్ | 1999/2000–2000/01 |
26 | కార్ల్ హూపర్ | 2000/01–2002/03 |
27 | రిడ్లీ జాకబ్స్ | 2002/03 |
28 | శివనారాయణ చంద్రపాల్ | 2004/05–2005/06 |
29 | రాంనరేష్ శర్వాన్ | 2007 |
30 | డారెన్ గంగ | 2007 |
31 | క్రిస్ గేల్ | 2007–2010 |
32 | డ్వేన్ బ్రావో | 2008 |
33 | ఫ్లాయిడ్ రీఫర్ | 2009 (కాంట్రాక్ట్ వివాదం కారణంగా) |
34 | డారెన్ సామీ | 2010–2014 |
35 | దినేష్ రామ్దిన్ | 2014–2015 |
36 | జాసన్ హోల్డర్ | 2015–2021 |
37 | క్రైగ్ బ్రాత్‌వైట్ | 2017, 2021–ప్రస్తుతం |
ప్రస్తుత స్క్వాడ్
మార్చువెస్టిండీస్తో ఒప్పందం కుదుర్చుకున్న, 2022 ఆగస్టు నుండి వెస్టిండీస్ తరపున ఆడిన లేదా ఇటీవలి టెస్ట్, వన్‌డే లేదా T20I జట్టులో పేరు పొందిన ఆటగాళ్ళ జాబితా ఇది. ఇప్పటి వరకీఊ అస్లు ఆడని ఆటగాళ్ళ పేర్లను వాలుగా చూపించాం.
- రూపాలు - వారి మొత్తం వెస్టిండీస్ కెరీర్‌లో కాకుండా, గత సంవత్సరంలో మాత్రమే వెస్టిండీస్ కోసం ఆడిన వివిధ క్రికెట్ రూపాలను సూచిస్తుంది.
పేరు | వయస్సు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు | రూపాలు | చొక్కా సంఖ్య | కెప్టెన్ | చివరి టెస్టు | చివరి వన్‌డే | చివరి T20I |
---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటర్లు | ||||||||||
జెర్మైన్ బ్లాక్‌వుడ్ | 32 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | జమైకా | టెస్టులు | 27 | టెస్టులు (VC) | 2023 | 2022 | — |
క్రైగ్ బ్రాత్‌వైట్ | 31 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | బార్బడాస్ | టెస్టులు | 11 | టెస్టులు (C) | 2023 | 2017 | — |
షమర్ బ్రూక్స్ | 36 | కుడిచేతి వాటం | — | బార్బడాస్ | వన్‌డే | 13 | 2022 | 2023 | 2022 | |
కీసీ కార్తీ | 27 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | లీవార్డ్ ఐలాండ్స్ | వన్‌డే | 96 | — | 2023 | — | |
టాగెనరైన్ చంద్రపాల్ | 28 | ఎడమచేతి వాటం | — | గయానా | టెస్టులు | 30 | 2023 | — | — | |
షిమ్రాన్ హెట్మెయర్ | 27 | ఎడమచేతి వాటం | — | గయానా | వన్‌డే, T20I | 2 | 2019 | 2023 | 2023 | |
బ్రాండన్ కింగ్ | 29 | కుడిచేతి వాటం | — | జమైకా | వన్‌డే, T20I | 53 | — | 2023 | 2023 | |
కిర్క్ మెకెంజీ | 24 | ఎడమచేతి వాటం | — | జమైకా | టెస్టులు | 73 | 2023 | — | — | |
రోవ్మాన్ పావెల్ | 31 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | జమైకా | వన్‌డే, T20I | 52 | T20I (C), వన్‌డే (VC) | — | 2023 | 2023 |
ఆల్ రౌండర్లు | ||||||||||
అలిక్ అథానాజ్ | 25 | ఎడమచేతి వాటం | — | విండ్‌వార్డ్ ఐలాండ్స్ | టెస్టులు, వన్‌డే | - | 2023 | 2023 | — | |
రోస్టన్ చేజ్ | 32 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | బార్బడాస్ | టెస్టులు, వన్‌డే, T20I | 10 | 2023 | 2023 | 2023 | |
రహ్కీమ్ కార్న్‌వాల్ | 31 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | లీవార్డ్ ఐలాండ్స్ | టెస్టులు | 93 | 2023 | — | — | |
కావెం హాడ్జ్ | 31 | కుడిచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ | విండ్‌వార్డ్ ఐలాండ్స్ | వన్‌డే | - | — | 2023 | — | |
జాసన్ హోల్డర్ | 33 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | బార్బడాస్ | టెస్టులు, వన్‌డే, T20I | 98 | 2023 | 2023 | 2023 | |
కైల్ మేయర్స్ | 32 | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం | బార్బడాస్ | టెస్టులు, వన్‌డే, T20I | 71 | T20I (VC) | 2023 | 2023 | 2023 |
కీమో పాల్ | 26 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | గయానా | వన్‌డే | 84 | 2019 | 2023 | 2022 | |
రేమాన్ రీఫర్ | 33 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | బార్బడాస్ | టెస్టులు, వన్‌డే, T20I | 87 | 2023 | 2023 | 2023 | |
రొమారియో షెపర్డ్ | 29 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | గయానా | వన్‌డే, T20I | 16 | — | 2023 | 2023 | |
ఓడియన్ స్మిత్ | 28 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | జమైకా | వన్‌డే, T20I | 58 | — | 2023 | 2023 | |
వికెట్ కీపర్లు | ||||||||||
జాన్సన్ చార్లెస్ | 35 | కుడిచేతి వాటం | Left-arm orthodox | విండ్‌వార్డ్ ఐలాండ్స్ | వన్‌డే, T20I | 25 | — | 2023 | 2023 | |
జాషువా డా సిల్వా | 26 | కుడిచేతి వాటం | — | ట్రినిడాడ్ అండ్ టొబాగో | టెస్టులు | 35 | 2023 | 2021 | — | |
షాయ్ హోప్ | 31 | కుడిచేతి వాటం | — | బార్బడాస్ | వన్‌డే, T20I | 4 | వన్‌డే (C) | 2021 | 2023 | 2023 |
నికోలస్ పూరన్ | 29 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ట్రినిడాడ్ అండ్ టొబాగో | వన్‌డే, T20I | 29 | — | 2023 | 2023 | |
పేస్ బౌలర్లు | ||||||||||
షెల్డన్ కాట్రెల్ | 35 | కుడిచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ మీడియం | జమైకా | T20I | 19 | 2014 | 2021 | 2023 | |
డొమినిక్ డ్రేక్స్ | 26 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | బార్బడాస్ | వన్‌డే | — | 2023 | 2022 | ||
షానన్ గాబ్రియేల్ | 36 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | ట్రినిడాడ్ అండ్ టొబాగో | టెస్టులు | 20 | 2023 | 2019 | 2013 | |
అకీమ్ జోర్డాన్ | 30 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | బార్బడాస్ | వన్‌డే | - | — | 2023 | — | |
అల్జారీ జోసెఫ్ | 27 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | లీవార్డ్ ఐలాండ్స్ | టెస్టులు, వన్‌డే, T20I | 8 | 2023 | 2023 | 2023 | |
ఒబెడ్ మెక్కాయ్ | 27 | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ మీడియం | విండ్‌వార్డ్ ఐలాండ్స్ | T20I | 61 | — | 2018 | 2023 | |
కెమర్ రోచ్ | 36 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | బార్బడాస్ | టెస్టులు | 24 | 2023 | 2022 | 2012 | |
జేడెన్ సీల్స్ | 23 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | ట్రినిడాడ్ అండ్ టొబాగో | వన్‌డే | 33 | 2022 | 2023 | — | |
స్పిన్ బౌలర్లు | ||||||||||
యానిక్ కరియా | 32 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ స్పిన్ | ట్రినిడాడ్ అండ్ టొబాగో | వన్‌డే | 59 | — | 2023 | 2022 | |
అకేల్ హోసేన్ | 31 | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ | ట్రినిడాడ్ అండ్ టొబాగో | వన్‌డే, T20I | 21 | — | 2023 | 2023 | |
గుడాకేష్ మోతీ | 29 | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ | గయానా | టెస్టులు, వన్‌డే | 64 | 2023 | 2023 | 2021 | |
కెవిన్ సింక్లైర్ | 24 | కుడిచేతి వాటం | Right-arm off spin | గయానా | వన్‌డే | 77 | — | 2023 | 2021 | |
జోమెల్ వారికన్ | 32 | కుడిచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ | బార్బడాస్ | టెస్టులు | 65 | 2023 | — | — |
కోచింగ్ సిబ్బంది
మార్చుICC ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్
మార్చుస్థానం | పేరు |
---|---|
టీమ్ మేనేజర్ | రాల్ లూయిస్ |
ప్రధాన కోచ్ | ఆండ్రీ కోలీ |
అసిస్టెంట్ కోచ్‌లు | |
ఫిజియోథెరపిస్ట్ | డెనిస్ బయామ్ |
బలం & కండిషనింగ్ కోచ్ | రోనాల్డ్ రోజర్స్ |
విశ్లేషకుడు | అవేనాష్ సీతారాం |
మీడియా & కంటెంట్ ఆఫీసర్ | డారియో బార్త్లీ |
పరిమిత ఓవర్లు
మార్చుస్థానం | పేరు |
---|---|
టీమ్ మేనేజర్ | రాల్ లూయిస్ |
ప్రధాన కోచ్ | డారెన్ సామీ |
అసిస్టెంట్ కోచ్‌లు |
|
ఫిజియోథెరపిస్ట్ | డెనిస్ భయామ్ |
కండిషనింగ్ కోచ్ | రోనాల్డ్ రోజర్స్ |
విశ్లేషకుడు | అవేనాష్ సీతారాం |
మీడియా & కంటెంట్ ఆఫీసర్ | డారియో బార్త్లీ |
కోచింగ్ చరిత్ర
మార్చు- 1992–1995: రోహన్ కన్హై [27]
- 1995–1996: ఆండీ రాబర్ట్స్ [27]
- 1996–1999: మాల్కం మార్షల్ [27]
- 1999: వివ్ రిచర్డ్స్ (మధ్యంతర) [28]
- 2000–2003: రోజర్ హార్పర్ [29]
- 2003–2004: గస్ లోగీ [30]
- 2004–2007: బెన్నెట్ కింగ్ [31]
- 2007: డేవిడ్ మూర్ (మధ్యంతర)
- 2007–2009: జాన్ డైసన్ [32]
- 2009–2010: డేవిడ్ విలియమ్స్ (మధ్యంతర) [33]
- 2010–2014: ఒట్టిస్ గిబ్సన్ [34]
- 2015–2016: ఫిల్ సిమన్స్ [35]
- 2017–2018: స్టువర్ట్ లా [36]
- 2018: నిక్ పోథాస్ (మధ్యంతర) [37]
- 2019: రిచర్డ్ పైబస్ (మధ్యంతర) [38]
- 2019: ఫ్లాయిడ్ రీఫర్ (మధ్యంతర) [39]
- 2019–2022: ఫిల్ సిమన్స్ [40]
- 2022: ఆండ్రీ కోలీ (మధ్యంతర) [41]
- 2023–ప్రస్తుతం: ఆండ్రీ కోలీ (టెస్ట్), డారెన్ సామీ (పరిమిత ఓవర్లు)
జనాదరణ పొందిన సంస్కృతిలో
మార్చు2010లో విడుదలైన ఫైర్ ఇన్ బాబిలోన్ అనేది బ్రిటిష్ డాక్యుమెంటరీ చిత్రం. ఇందులో ఆర్కైవల్ ఫుటేజ్, పలువురు క్రికెటర్లతో ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఈ చిత్రానికి స్టీవన్ రిలే రచన, దర్శకత్వం వహించాడు. బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డుకు ఇది ఉత్తమ డాక్యుమెంటరీగా నామినేటైంది.
ఈ డాక్యుమెంటరీ 1970లు, 1980లలో వెస్టిండీస్ జట్టు ఆధిపత్యం గురించి. చరిత్రలో 15 సంవత్సరాల పాటు ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోని గొప్ప క్రికెట్ జట్టుగా దీన్ని విస్తృతంగా పరిగణిస్తారు. ఒకప్పుడు వెస్టిండీస్‌పై వలసాధిపత్యం చేసిన ఆ రోజుల్లో నల్లజాతీయులపై చూపెట్టిన జాత్యహంకార ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ ఎలా విజయం సాధించిందో ఈ డాక్యుమెంటరీ చూపిస్తుంది.[42][43]
క్రికెటర్లు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Saint Kitts and Nevis are separately represented in the Leeward Islands Cricket Association.
- ↑ "Daren Sammy appointed West Indies white-ball coach; Andre Coley to take charge of Test team". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-05-12.
- ↑ "West Indies secure no 1 T20 rankings". cricket.com.au. 11 January 2016. Retrieved 12 July 2020.
- ↑ "ICC Rankings". International Cricket Council.
- ↑ "Test matches - Team records". ESPNcricinfo.
- ↑ "Test matches - 2023 Team records". ESPNcricinfo.
- ↑ "ODI matches - Team records". ESPNcricinfo.
- ↑ "ODI matches - 2023 Team records". ESPNcricinfo.
- ↑ "T20I matches - Team records". ESPNcricinfo.
- ↑ "T20I matches - 2023 Team records". ESPNcricinfo.
- ↑ "West Indies Cricket team officially renamed to 'Windies'". Indian Express. 2 June 2017. Retrieved 12 July 2020.
- ↑ "ICC rankings – ICC Test, ODI and Twenty20 rankings – ESPN Cricinfo". ESPNcricinfo. Archived from the original on 3 March 2015. Retrieved 2 March 2015.
- ↑ "ICC Hall of Fame". ICC. Archived from the original on 9 February 2009. Retrieved 23 September 2009.
- ↑ "Live Cricket Scores & News International Cricket Council". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 July 2017. Retrieved 6 February 2019.
- ↑ See CricketArchive Archived 24 నవంబరు 2017 at the Wayback Machine, for example, for a reference to when Test status was acquired
- ↑ "Records / West Indies / Test matches / List of match results (by year)". espncricinfo. Archived from the original on 27 April 2015. Retrieved 26 August 2012.
- ↑ "Scorecard, 1st Test: West Indies v England at Bridgetown, Jan 21–26 1948". espncricinfo. Archived from the original on 12 June 2012. Retrieved 26 August 2012.
- ↑ "Records / West Indies / Test matches / Best bowling figures in a match". espncricinfo. Retrieved 25 August 2012.
- ↑ "Jamaica: A century of sport". espncricinfo. 27 July 1999. Archived from the original on 27 April 2015. Retrieved 25 August 2012.
- ↑ Until June 2001 there was no official ranking of Test nations, with the unofficial epithet of "World champions" being decided by acclaim based on recent results.
- ↑ "West Indies in England, 1976". ESPN Cricinfo. Retrieved 16 September 2012.
- ↑ "Records / West Indies / Test matches / Best bowling figures in a match". ESPN Cricinfo. Retrieved 16 September 2012.
- ↑ See Cricinfo Archived 1 జనవరి 2009 at the Wayback Machine for a list of Test match grounds
- ↑ "Bourda First Test". ESPNcricinfo. Archived from the original on 1 February 2017. Retrieved 11 March 2017.
- ↑ "ICC World Test Championship 2019–2021 Table". ESPN Cricinfo. Retrieved 29 August 2021.
- ↑ "World Test Championship 2021-23 Table". ESPNCricinfo. Retrieved June 13, 2023.
- ↑ "Cricinfo – Taylor hat-trick sinks Australia". Archived from the original on 23 December 2007. Retrieved 20 October 2006.
- ↑ 27.0 27.1 27.2 "Gibson must be wary of the pitfalls". Stabroek News. 7 February 2010. Retrieved 6 April 2023.
- ↑ "Sir Viv is coach". ESPNcricinfo. 28 May 1999. Retrieved 6 April 2023.
- ↑ "Roger Harper". ESPNcricinfo. Retrieved 6 April 2023.
- ↑ "Gus Logie confirmed as West Indies coach". ESPNcricinfo. 17 July 2003. Retrieved 6 April 2023.
- ↑ "Australian Bennett King is West Indies coach". The Age. 31 October 2004. Retrieved 6 April 2023.
- ↑ John Dyson named West Indies coach, Cricinfo, Retrieved on 21 October 2007
- ↑ "Williams eyes full-time job". ESPNcricinfo. 30 August 2009. Retrieved 6 April 2023.
- ↑ "Ottis Gibson leaves England to become West Indies head coach". The Guardian. 2 February 2010. Retrieved 6 April 2023.
- ↑ "Simmons named as new Windies coach". Cricket.com.au. 21 March 2015. Retrieved 6 April 2023.
- ↑ "Stuart Law named West Indies coach". espncricinfo.com. espncricinfo.com. 2017-01-27. Retrieved 2017-01-28.
- ↑ "Nic Pothas named interim West Indies head coach". ESPN. 20 November 2018. Retrieved 6 April 2023.
- ↑ "Richard Pybus confirmed as West Indies interim coach in spite of Leewards' protest". ESPNcricinfo. 18 January 2019. Retrieved 6 April 2023.
- ↑ "Windies name Reifer as interim coach ahead of World Cup". Reuters. 12 April 2019. Retrieved 6 April 2023.
- ↑ "Phil Simmons appointed as Windies head coach". icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2019-10-15.
- ↑ "ANDRE COLEY APPOINTED INTERIM HEAD COACH FOR TOURS OF ZIMBABWE AND SOUTH AFRICA". windiescricket.com. Cricket West Indies. 21 December 2022.
- ↑ "BBC Four - Storyville, Fire in Babylon". www.bbc.co.uk. Retrieved 2021-03-23.
- ↑ "Fire in Babylon: revenge of the West Indies". The Telegraph (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 11 January 2022. Retrieved 2021-03-23.