మూత్రం నియంత్రణలేమి
మూత్రం ఆపుకొనలేని (UI) శరీర పరిస్థితి. దీనిని అనైచ్ఛిక మూత్రవిసర్జన అని కూడా అంటారు, దీని వలన మూత్రం నియంత్రణ లేకుండా కారుతుంటుంది . ఇది ఒక వ్యాధి కాదు కానీ ఒక లక్షణం . దీనిని యూరినరీ ఇంకాంటినెన్స్ అని తరచుగా చెపుతారు. రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు చిన్న పిల్లలో సంభవించే అసంకల్పిత మూత్ర విసర్జనని ఎన్యూరెసిస్ (బెడ్ వెట్టింగ్) అని పిలుస్తారు.[1] పెద్ద వాళ్లలో ఇది జీవన నాణ్యతమీద ప్రభావం ప్రతికూలం గా ఉంటుంది. దీనివలన ఏర్పడే సంక్లిష్టతలలో మూత్ర నాళాల అంటువ్యాధులు, ఒత్తిడి వలన పూత, పుండ్లు, నిరాశ ఇంకా మందుల నుండి దుష్ప్రభావాలు వంటివి ఉండవచ్చు.[2]
మూత్ర నియంత్రణ లేమి | |
---|---|
ఇతర పేర్లు | అనైచ్ఛిక మూత్రవిసర్జన |
వీడియోతో వివరణ | |
ప్రత్యేకత | యూరాలజీ, గైనకాలజీ |
సంక్లిష్టతలు | మూత్ర నాళాల అంటువ్యాధులు, ఒత్తిడి వలన పూత, పుండ్లు, నిరాశ ఇంకా మందుల నుండి దుష్ప్రభావాలు |
సాధారణ ప్రారంభం | చిన్న పిల్లలలో, వృద్ధులలో, ఇతర వ్యాధులలో |
ప్రమాద కారకములు | మూత్ర నాళాల అంటువ్యాధులు, ఒత్తిడి వలన పూత, పుండ్లు, నిరాశ ఇంకా మందుల నుండి దుష్ప్రభావాలు |
చికిత్స | కటి కండరాల శిక్షణ, మూత్రాశయం శిక్షణ, బరువు తగ్గడం, ధూమపానం ఆపడం, విద్యుత్ ప్రేరణ, మందులు, శస్త్రచికిత్స ఉండవచ్చు. |
తరుచుదనము | స్త్రీలలో సాధారణం |
ఈ లక్షణాలకి కారణాలలో గర్భం ధరించడం, ప్రసవం సమయం, రుతువిరతి (మెనోపాజ్), అధిక బరువు, మలబద్ధకం, కటి శస్త్రచికిత్స, మూత్ర నాళాల అంటువ్యాధులు, కొన్ని రకాల మందులు కూడా ఉన్నాయి.[1] ఐదు ప్రధాన రకాల అసంయములు (నియంత్రణ లేని పరిస్థితులు) ఉన్నాయి
- ఒత్తిడి: అసంయమ కారణంగా మూత్రాశయం సరిగా మూయబడలేక పోవడము వలన ఈ పరిస్థితి ఉంటుంది.
- ఒత్తిడి అసంయమముతో కూడి అతిగా స్పందించే మూత్రాశయం
- మూత్రనాళ స్పింక్టర్ కండరం పని చేయక పోవడం (అంతర్గత స్పింక్టర్ లోపం) లేదా మూత్రాశయ నాళం అతి కదలికలు
- మిశ్రమ అసంయమము
- మూత్రాశయ సంకోచం లేదా అడ్డంకి కారణంగా మూత్రం పైకి కారే అసంయములు.[2]
చికిత్స లక్షణాలు ఏ రకం అనే మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో కటి కండరాలకు శిక్షణ, మూత్రాశయం శిక్షణ, బరువు తగ్గడం, ధూమపానం ఆపడం, విద్యుత్ ప్రేరణ, మందులు, శస్త్రచికిత్స ఉండవచ్చు.[1] [3] సాధారణంగా ఒత్తిడి వలన మూత్రం ఆపుకొనలేని పరిస్థితిలో బిహేవియరల్ చికిత్స మందుల కంటే మెరుగ్గా పనిచేస్తుంది. మందుల వలన ప్రయోజనం తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక చికిత్స అనేది అస్పష్టం. ఫలితాలు మారుతూ ఉంటాయి.[2]
వృద్ధులలో మూత్రం ఆపుకొనలేని ఈ లక్షణం సాధారణం గా ఉంటుంది.[4] అయితే, ఇది చాలా మంది బయటకు చెప్పరు.[2] పురుషులతో పోలిస్తే మహిళలు రెండు రెట్లు ఎక్కువగా ప్రభావితమవుతారు .[1] 65 ఏళ్లు పైబడిన మహిళల్లో 40% కంటే ఎక్కువ మంది ప్రభావితమయ్యారు.[1]
సూచనలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Urinary incontinence". womenshealth.gov (in ఇంగ్లీష్). 8 March 2017. Archived from the original on 27 May 2017. Retrieved 28 October 2020.
- ↑ 2.0 2.1 2.2 2.3 (January 2020). "Urinary Incontinence".
- ↑ Shamliyan T, Wyman J, Kane RL (April 2012). "Nonsurgical Treatments for Urinary Incontinence in Adult Women: Diagnosis and Comparative Effectiveness". Comparative Effectiveness Reviews. AHRQ Comparative Effectiveness Reviews. Agency for Healthcare Research and Quality (US). PMID 22624162.
- ↑ "Urinary Incontinence in Older Adults". National Institute on Aging. Archived from the original on 14 April 2020. Retrieved 18 March 2018.