అన్నపూర్ణ ఫొటో స్టూడియో
అన్నపూర్ణ ఫొటో స్టూడియో 2023లో విడుదలైన తెలుగు సినిమా. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమాకు చెందు ముద్దు దర్శకత్వం వహించాడు. చైతన్య రావు, లావణ్య, ఉత్తరా రెడ్డి, మిహిరా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 21న విడుదలై[1][2], ఆగస్టు 15వ తేదీ నుండి ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4]
అన్నపూర్ణ ఫొటో స్టూడియో | |
---|---|
దర్శకత్వం | చెందు ముద్దు |
రచన | చెందు ముద్దు |
నిర్మాత | యాష్ రంగినేని |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | పంకజ్ తొట్టాడా |
కూర్పు | డి. వెంకట ప్రభు |
సంగీతం | ప్రిన్స్ హెన్రీ |
నిర్మాణ సంస్థ | బిగ్ బెన్ సినిమాస్ |
విడుదల తేదీ | 21 జూలై 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- చైతన్య రావు
- లావణ్య
- ఉత్తరా రెడ్డి
- వాసు ఇంటూరి
- మిహిరా
- వైవా రాఘవ
- ఆదిత్య
- యశ్ రంగినేని
- లలిత్ ఆదిత్య
- కృష్ణ మోహన్
- రమణ
పాటల జాబితా
మార్చు- రంగమ్మ , రచన: శ్రీనివాస మౌళి, గానం.ఎస్.పి.చరణ్
- వెన్నెల్లో ఆడపిల్ల , రచన: శ్రీనివాస మౌళి, గానం. ఎస్ పి చరణ్, రచిత రాయప్రోలు
- సయ్యాట విధి సయ్యాట , రచన: శ్రీనివాస మౌళి గానం.సాయిశరణ్
- ఓ ముద్దుగుమ్మ , రచన:శ్రేష్ఠ , గానం.ప్రిన్స్ హెన్రీ , లీప్సిక , రితేష్ జీ రావు.
కథ
మార్చు1980 దశకంలో గోదావరి పక్కనున్న కపిలేశ్వరపురం గ్రామంలో చంటి (చైతన్య రావ్) తన స్నేహితుడితో కలసి తల్లి పేరు మీద ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ నడుపుతుంటాడు. జోతిష్యుడైన తన తండ్రికి చుట్టు పక్కల మంచి పేరు. చంటికి వయసు మీద పడుతున్నా పెళ్లి కాదు. చెల్లెలు చదువుతున్న కాలేజీలోనే చదివే గౌతమి (లావణ్య)తో ప్రేమలో పడతాడు. వీళ్ల ప్రేమకథకు కంచికి చేరినట్టే అనుకునేలోపే విషయం చంటి తండ్రికి తెలుస్తుంది. జాతకం ప్రకారం చంటి ప్రాణానికి ప్రమాదం ఉందని గౌతమికి చెప్తాడు. ఈ క్రమంలో చంటి ఓ హత్య కేసులో నిందుతుడిగా ఎలా మారాడు? చివరకు చంటి, గౌతమిల ప్రేమకథ ఎలా ముగిసింది? అనేది మిగతా సినిమా కథ.[5]
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: బిగ్ బెన్ సినిమాస్
- నిర్మాత: యష్ రంగినేని
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చెందు ముద్దు
- సంగీతం: ప్రిన్స్ హెన్రీ
- సినిమాటోగ్రఫీ: పంకజ్ తొట్టాడా
- ఎడిటర్ : డి. వెంకట ప్రభు
మూలాలు
మార్చు- ↑ Sakshi (9 March 2022). "'30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య హీరోగా ఇంట్రెస్టింగ్ మూవీ." Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ Namasthe Telangana (16 March 2023). "ఫొటో స్టూడియోలో ఏం జరిగింది?". Archived from the original on 16 March 2023. Retrieved 16 March 2023.
- ↑ Hindustantimes Telugu (5 August 2023). "'అన్నపూర్ణ ఫొటోస్టూడియో' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
- ↑ Eenadu (4 August 2023). "'ఈటీవీ విన్'లోకి 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
- ↑ Sakshi (20 July 2023). "'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' మూవీ రివ్యూ". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.