వాసు ఇంటూరి

నటుడు, దర్శకుడు

వాసు ఇంటూరి ఒక టీవీ, సినీ నటుడు, దర్శకుడు.[1] అమృతం సీరియల్లో సర్వం పాత్రతో ప్రేక్షకులకు సుపరిచితుడు. గంగతో రాంబాబు అనే సీరియల్ కు కూడా దర్శకత్వం వహించాడు. అమృతం చందమామలో అనే సినిమాకు దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజుతో కలిసి స్క్రిప్టు రచించాడు.[2]

వాసు ఇంటూరి
జననం
వాసు ఇంటూరి
విద్యబీఎస్సీ

జీవితం సవరించు

వాసు స్వస్థలం బాపట్ల. తండ్రి వీఆర్వోగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. వాసు బాపట్లలో ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల నుంచి బీఎస్సీ పట్టా పొందాడు. ఎంసీయే చదవడం కోసం హైదరాబాదుకు వచ్చాడు కానీ సినిమా రంగం మీద ఆసక్తితో మధ్యలోనే వదిలేశాడు.

కెరీర్ సవరించు

సుమారు ఆరు సంవత్సరాల పాటు సహాయ దర్శకుడిగా, స్క్రిప్టు రచయితగా పనిచేశాడు. గుణ్ణం గంగరాజు నిర్మించిన అమృతం కార్యక్రమంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 313 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఆ సీరియల్ కు సహాయ దర్శకుడిగా, దర్శకుడిగా, స్క్రిప్టు రచయితగా పనిచేశాడు.[1] అందులో సర్వేశ్వరన్ అలియాస్ సర్వం అనే అమాయకుడైన పనివాడి పాత్రలో కూడా నటించాడు. వాసు నటించిన ఇతర సీరియళ్ళు మై నేం ఈస్ మంగతాయారు, నాన్న (జెమిని టివి), శ్రీకృష్ణావతారాలు, గంగతో రాంబాబు, ఎదురీత మొదలైనవి.

నటించిన సినిమాలు సవరించు

సీరియళ్ళు సవరించు

మూలాలు సవరించు

  1. 1.0 1.1 "తెలుగు సినీ నటుడు వాసు ఇంటూరి". nettv4u.com. Retrieved 23 September 2016.
  2. సాక్షి విలేఖరి. "మాది 'ఏ' సర్టిఫికెట్ సినిమా :గుణ్ణం గంగరాజు". sakshi.com. జగతి పబ్లికేషన్స్. Retrieved 23 September 2016.

బయటి లింకులు సవరించు