అన్షు జైన్
అన్షుమాన్ జైన్ (1963 జనవరి 7 - 2022 ఆగస్టు 12) భారత సంతతికి చెందిన ప్రముఖ బ్యాంకర్. బ్రిటిష్ వ్యాపార కార్యనిర్వాహకుడు.[2][3] అమెరికన్ ఆర్థిక సేవల సంస్థ కాంటర్ ఫిట్జ్‌గెరాల్డ్ అధ్యక్షుడిగా 2017 నుండి 2022 వరకు ఆయన పనిచేశాడు.[4]
అన్షు జైన్ | |
---|---|
జననం | |
మరణం | 2022 ఆగస్టు 12 | (వయసు 59)
జాతీయత | యునైటెడ్ కింగ్‌డమ్[1] |
విద్యాసంస్థ |
|
బిరుదు |
|
బంధువులు | అజిత్ జైన్ (బెర్క్‌షైర్ హాత్వేకి ఇన్సూరెన్స్ ఆపరేషన్స్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న భారతీయ-అమెరికన్ ఎగ్జిక్యూటివ్) |
జూన్ 2012 నుండి జూలై 2015 వరకు ఆయన జర్మనీకి చెందిన అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ డాయిష్ బ్యాంక్ గ్లోబల్ కో-సీఆఒ, కో-ఛైర్మన్‌గా వ్యవహరించాడు.[5][6][7] ఆయన డ్యుయిష్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యుడు కూడా. అతను గతంలో దాని కార్పొరేట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌కు అధిపతిగా ఉన్నాడు. డ్యుయిష్ బ్యాంక్ కార్పొరేట్ ఫైనాన్స్, సేల్స్, ట్రేడింగ్, లావాదేవీ బ్యాంకింగ్ వ్యాపారానికి ప్రపంచవ్యాప్తంగా బాధ్యత వహించాడు. అంతేకాకుండా జనవరి 2016 వరకు ఆ బ్యాంకుకు అన్షు జైన్ సలహాదారుగా ఉన్నాడు.
జీవిత చరిత్ర
మార్చుజైపూర్లో 1963 జనవరి 7న అన్షు జైన్ జన్మించాడు. అతని తండ్రి సివిల్ సర్వెంట్.[8] అన్షు జైన్ ఆరు సంవత్సరాల వయస్సులో తన తండ్రితో కలిసి న్యూఢిల్లీకి వెళ్లి, మథుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివాడు.[9] అలాగే ఆయన 1983లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించాడు.[10] ఆ తర్వాత అతను 19 సంవత్సరాల వయస్సులో అమెరికాకి వెళ్లాడు.[11][12] అక్కడ 1985లో ఐసెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఫైనాన్స్‌లో ఆయన ఎం.బి.ఎ పట్టా పొందాడు. ఫ్యూచర్స్, ఆప్షన్స్ డెరివేటివ్స్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులలో నిపుణుడైన థామస్ ష్నీవీస్‌తో కలిసి ఆయన చదువుకున్నాడు.[13][14]
జైన్ ట్రావెల్ రైటర్, పిల్లల పుస్తక రచయిత్రి అయిన గీతికను ఆయన వివాహం చేసుకున్నాడు. వీరు లండన్‌లో నివసించారు. అలాగే న్యూయార్క్ నగరంలో కూడా నివాసం కలిగి ఉన్నారు.
అవార్డులు
మార్చు- 2003లో జైన్ యూరోమనీ మ్యాగజైన్ క్యాపిటల్ మార్కెట్స్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నాడు.[15]
- 2006లో అతని దాతృత్వం, నాయకత్వానికి అమెరికన్ ఇండియా ఫౌండేషన్ అతనిని సత్కరించింది.[16]
- 2010లో అతను రిస్క్ మ్యాగజైన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును,[17][18] అలాగే నాస్కాం నుండి వార్షిక బిజినెస్ లీడర్ అవార్డును అందుకున్నాడు.[19]
- 2012లో ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్‌లో ది ఎకనామిక్ టైమ్స్ ద్వారా గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.[20]
- 2014లో అతను లండన్ బిజినెస్ స్కూల్ నుండి గౌరవ ఫెలోషిప్,[21] న్యూ ఢిల్లీలోని టి.ఇ.ఆర్.ఐ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.[22]
మరణం
మార్చు59 ఏళ్ళ ఆయన యూకేలో క్యాన్సర్‌తో బాధపడుతూ 2022 ఆగస్టు 12న మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. [23]
మూలాలు
మార్చు- ↑ "Anshu Jain: An Indian with a British passport who works for a German bank". Deccan Herald. Press Trust of India. 27 February 2014. Retrieved 10 August 2016.
- ↑ Comfort, Nicholas (29 April 2013). "No German Jain Brings Deutsche Bank to World as Client's Man". Bloomberg Markets. Retrieved 10 August 2016.
- ↑ Velsey, Kim (5 November 2012). "Deutsche Bank Boss Anshu Jain Invests In $7.2 M. Beacon Court Spread". The New York Observer. Retrieved 10 August 2016.
- ↑ Basak, Sonali (2 January 2017). "Jain Joins Cantor as President in Post-Deutsche Bank Restart". Bloomberg News. Retrieved 31 July 2020.
- ↑ "Anshu Jain takes charge as Deutsche Bank co-CEO". Business Today. 1 June 2012. Retrieved 15 October 2020.
- ↑ "Deutsche Bank backs its India born co-CEO Anshu Jain". Rediff.com. 21 February 2014. Retrieved 15 October 2020.
- ↑ Ewing, Jack (7 June 2015). "Deutsche Bank Co-Chief Executives Resign". The New York Times. Retrieved 31 July 2020.
- ↑ "Anshu Jain - Munzinger Biographie". www.munzinger.de. Munzinger-Archiv. 17 November 2015. Retrieved 13 August 2022.
- ↑ Karnik, Madhura (8 June 2015). "The India-born banker who transformed Deutsche Bank is on his way out". Quartz India. Retrieved 11 October 2020.
- ↑ Krishnamachari, S V (25 October 2016). "India Inc. speculates on who would succeed Cyrus Mistry after his ouster from Tata Sons". International Business Times. Retrieved 11 October 2020.
- ↑ Stevens, Laura (26 July 2011). "Deutsche Names Two as Co-CEOs". The Wall Street Journal. Retrieved 22 October 2020.
- ↑ Kirchfeld, Aaron; Simmons, Jacqueline (26 August 2010). "Anshu Jain: Deutsche Bank's Next CEO?". Bloomberg News. Retrieved 22 October 2020.
- ↑ Mohr, Christoph (11 September 2018). "Die Deutsche Bank setzt auf MBA". Karriere.de. Retrieved 25 October 2020.
- ↑ Buerkle, Tom (7 May 2006). "The Outsiders". Institutional Investor. Retrieved 11 October 2020.
- ↑ Lee, Peter (30 June 2003). "Anshu Jain: Capital markets achievement award 2003". Euromoney. Retrieved 13 March 2019.
- ↑ "AIF raises $2 million for development projects in India". The Financial Express. Press Trust of India. 20 May 2006. Retrieved 26 October 2020.
- ↑ "Lifetime achievement award – Anshu Jain". Risk. 7 January 2010. Retrieved 26 October 2020.
- ↑ "Lifetime achievement award: Anshu Jain" (PDF). Risk. 23 (1): 30–33. January 2010.
- ↑ "NASSCOM announces the Sixth Annual 'Global Leadership Awards'". VARIndia. 19 February 2010. Retrieved 26 October 2020.
- ↑ "ET Awards 2012: Anshu Jain bags the Global Indian of the Year title". The Economic Times. 23 October 2012. Retrieved 26 October 2020.
- ↑ "Excellence recognised as London Business School". London Business School. 14 July 2014. Retrieved 27 October 2020.
- ↑ "Teri University Confers Honorary Degrees on Eminent Luminaries". Newswire. 6 February 2014. Retrieved 27 October 2020.
- ↑ "ప్రముఖ బ్యాంకర్ అన్షు జైన్ మృతి". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-08-14. Retrieved 2022-08-14.