అపూర్వ అస్రానీ
అపూర్వ అస్రానీ భారతీయ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్. అలీఘర్ (2016), క్రిమినల్ జస్టిస్: బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ (2020), షాహిద్ (2013) సినిమాలకు సహ-రచయితగా, ఎడిటర్ గా పనిచేశాడు. 1998లో వచ్చిన సత్య (1998), మేడ్ ఇన్ హెవెన్ (2019) లకు ఎడిటింగ్ చేశాడు.
అపూర్వ అస్రానీ | |
---|---|
జననం | అపూర్వ ఎం అస్రానీ 1978 మార్చి 21 |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1995–ప్రస్తుతం |
సోనీ మ్యూజిక్ ఇండియా కోసం తేరా మేరా ప్యార్ (2005) మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం వహించాడు.
2021లో డిస్నీ హాట్‌స్టార్ షో వచ్చిన క్రిమినల్ జస్టిస్: బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ తో తన వెబ్‌సిరీస్ రచనను ప్రారంభించాడు. పంకజ్ త్రిపాఠి, కీర్తి కుల్హారి, అనుప్రియ గోయెంకా, దీప్తి నావల్ నటించిన ఈ వెబ్‌సిరీస్ మంచి సమీక్షలను అందుకుంది. డిస్నీ హాట్‌స్టార్ కోసం రికార్డ్ వీక్షకుల సంఖ్యను పొందింది.
2021 ఆగస్టులో సింగపూర్‌లో జరిగిన కంటెంట్ ఆసియా అవార్డ్స్‌లో దక్షిణాసియాలో క్రిమినల్ జస్టిస్: బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ 'బెస్ట్ డ్రామా సిరీస్' గెలుచుకున్న మొదటి భారతీయ సిరీస్‌గా నిలిచింది. అపూర్వ 'ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే' విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు, 'ఉత్తమ రచన' విభాగంలో ఫిల్మ్ క్రిటిక్స్ గిల్డ్ ద్వారా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుకు నామినేట్ చేయబడింది.
అవార్డులు
మార్చు1999లో జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో సత్య సినిమా ఎడిటింగ్‌కు భానోదయతో కలిసి ఉత్తమ ఎడిటింగ్‌కి ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు.[1][2]
2001లో స్నిప్ సినిమాకి ఉత్తమ ఎడిటర్ గా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.
2001లో హన్సల్ మెహతా తీసిన ఛల్ సినిమా ఎడిటింగ్ విభాగంలో జీ సినీ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు.
2013లో షాహిద్ సినిమాకు ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో లైఫ్ ఓకే స్క్రీన్ అవార్డును గెలుచుకున్నాడు, దానిని దర్శకుడు హన్సల్ మెహతాతో కలిసి అందుకున్నాడు.
2017లో దక్షిణాఫ్రికా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (రాపిడ్‌లయన్ అవార్డ్స్) 'ఉత్తమ ఎడిటింగ్' & 'ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే' కోసం నామినేట్ చేయబడ్డాడు.[3]
2019లో ఫిల్మ్ క్రిటిక్స్ గిల్డ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో మేడ్ ఇన్ హెవెన్ సినిమాకు 'బెస్ట్ ఎడిటింగ్' విభాగంలో నామినేట్ చేయబడ్డాడు.
క్రిమినల్ జస్టిస్: బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ సినిమాకు, 2021లో ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు, 2022లో 'బెస్ట్ రైటింగ్' విభాగంలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
సినిమాలు
మార్చుసంవత్సరం | శీర్షిక | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1998 | సత్య | సినిమా ఎడిటర్ | ఉత్తమ ఎడిటింగ్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
2000 | స్నిప్! | సినిమా ఎడిటర్ | ఉత్తమ ఎడిటింగ్ జాతీయ చలనచిత్ర అవార్డు |
2001 | ఛల్ | సినిమా ఎడిటర్ | ఉత్తమ ఎడిటింగ్‌కి జీ సినీ అవార్డు (నం. ) |
2002 | ఓం జై జగదీష్ | సినిమా ఎడిటర్ | |
2003 | క్యోన్? (చిత్రం) | ఫిల్మ్ ఎడిటర్ & అదనపు స్క్రీన్ ప్లే | |
2003 | ఔటాఫ్ కంట్రోల్ | కో-డైరెక్టర్ | |
2008 | ముఖ్బీర్ | సినిమా ఎడిటర్ | |
2009 | 8 x 10 తస్వీర్ | పర్యవేక్షిస్తున్న సంపాదకుడు | |
2010 | ఆశయైన్ | సినిమా ఎడిటర్ | |
2012 | జల్పారి-ది డెసర్ట్ మెర్మైడ్ | సినిమా ఎడిటర్ | |
2012 | షాహిద్ | సినిమా ఎడిటర్ | ఉత్తమ స్క్రీన్ ప్లేకి లైఫ్ ఓకే స్క్రీన్ అవార్డు |
2014 | చిల్డ్రన్ ఆఫ్ వార్ | సినిమా ఎడిటర్ | |
2014 | సిటీ లైట్స్ | ఫిల్మ్ ఎడిటర్ & స్క్రిప్ట్ సలహాదారు | |
2015 | ధరమ్ సంకట్ మే | సినిమా ఎడిటర్ | |
2015 | వెయిటింగ్ | సినిమా ఎడిటర్ | |
2015 | అలీఘర్ | కథ/స్క్రీన్ ప్లే/డైలాగ్ & ఎడిటింగ్ | రాపిడ్ లయన్ అవార్డులు 'ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే' & "ఉత్తమ ఎడిటింగ్' (నామినేట్) |
2017 | సిమ్రాన్ | సహ రచయిత | |
2019 | మేడ్ ఇన్ హెవెన్ | సిరీస్ ఎడిటర్ | ఉత్తమ ఎడిటింగ్ కోసం క్రిటిక్స్ గిల్డ్ అవార్డు (నామినేట్) |
2020 | క్రిమినల్ జస్టిస్: బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ | అడాప్టెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ | ఉత్తమ స్క్రీన్ ప్లే కొరకు ఫిల్మ్ ఫేర్ అవార్డు (నామినేట్) |
మూలాలు
మార్చు- ↑ "Filmfare Awards 1999". IMDb.com. Retrieved 6 October 2013.
- ↑ "Cinema: The New Bollywood Brigade". India-today.com. 28 June 1999. Archived from the original on 24 September 2015. Retrieved 6 October 2013.
- ↑ "'Bajirao Mastani' dominates RapidLion Awards 2017 in S Africa". dnaindia.com. 2 March 2017.