అప్పర్ దీబాంగ్ వ్యాలీ జిల్లా
అరుణాచల ప్రదేశ్ రాష్ట్రం లోని 17 జిల్లాలలో దిబాంగ్ లోయ జిల్లా ఒకటి.[2] ఈ జిల్లాలో డిబాంగ్ నది ప్రవహిస్తున్న కారణంగ దీనికీ పేరు వచ్చింది.[3] మిష్మి ప్రజలు దీనిని టాలన్ అంటారు. 9,128 చ.కి.మీ వైశాల్యం ఉన్న దిబాంగ్ లోయ జిల్లా రాష్ట్రంలో వైశాల్యపరంగా ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ భారతదేశంలో అత్యల్ప జనసాంధ్రత ఉన్న జిల్లాలలో ఇది ప్రథమ స్థానంలో ఉంది.[1]
అప్పర్ దీబాంగ్ వ్యాలీ జిల్లా | |
---|---|
![]() అరుణాచల్ ప్రదేశ్ పటంలో అప్పర్ దీబాంగ్ వ్యాలీ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | అనిని |
విస్తీర్ణం | |
• మొత్తం | 9,129 km2 (3,525 sq mi) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 7,948[1] |
• విస్తీర్ణం | 27.55% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 64.8%[1] |
• లింగ నిష్పత్తి | 808[1] |
చరిత్రసవరించు
1980లో లోహిత్ జిల్లాలో కొంత భాగం వేరుచేది దీబాంగ్ లోయ జిల్లా రూపొందించబడింది.[4]2011 డిసెంబరు 16న దీబాంగ్ లోయ జిల్లా ఎగువ దీబాంగ్ లోయ జిల్లా, దిగువ దీబాంగ్ లోయ జిల్లాలుగా విభజించబడింది.[4]
భౌగోళికంసవరించు
రిపబ్లిక్ చైనాలో జన్మించిన డిబాంగ్ నది ఈ జిల్లాగిండా ప్రవహిస్తుంది కనుక ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ జిల్లాకు అనిని కేంద్రంగా ఉంది. ఇది భరదేశ ఉత్తర, ఈశాన్య జిల్లాలలో చివరిది.
విభాగాలుసవరించు
దిబాంగ్ లోయ జిల్లాలో అనిని ఒక్కటే అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది. ఇది అరుణాచల ప్రదేశ్ పార్లమెంటరీ నియోజకవర్గాంలో భాగంగా ఉంది. .[5]
2001 లో గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 7,948, [1] |
ఇది దాదాపు. | నౌరు దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 640వ స్థానంలో ఉంది..[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 9.3%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 808:1000, [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 64.8%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
ప్రజలుసవరించు
దిబాంగ్ లోయ జిల్లాలో మిష్మి (ఇడు) ప్రజలు అధికంగా ఉన్నాయి. మిష్మి ప్రజలలో వారి వలస గురించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఈ కథలో చీతూ- హులుని ప్రాంతం, మిష్మి ప్రజలు సంచరించిన 12 నదీ ప్రాంతాలు గురించిన వర్ణన ఉంది. వీరు మొదట అహూం రాజ్యంలో నివసించారని ఈ కథనాలు వివరిస్తున్నాయి. మిష్మి ప్రజలు సాధారణంగా దట్టమైన అటవీ ప్రాంతంలో నివసిస్తుంటారు.
మతాలుసవరించు
- మొత్తం జనసంఖ్య : 7,272 (2001)
- హిందువులు :3,639 (50.04%)
- అనిమిస్ట్ : 2,881 (39.62%)
- మతరహితం : 350 (4.81%)
- బౌద్ధుల్య్ : 160 (2.20%)
- ముస్లిములు : 126 (1.73%)
- క్రైస్తవులు : 97 (1.33%)
- సిక్కులు : 19 (0.26%)
భాషలుసవరించు
దిబాంగ్ లోయ జిల్లాలో మిష్మి, సిన్జొ-టిబెటన్ భాషలను దాదాపు 25,000 మంది ప్రజలు మాట్లాడుతున్నారు. దీనిని టిబెటన్, లాటిన్ లిపిలో వ్రాస్తుంటారు. [7]
వృక్షజాలం, జంతుజాలంసవరించు
దిబాంగ్ లోయ జిల్లా వన్యసంపదతో సుసంపన్నమై ఉంది. ఇక్కడ మిష్మి టాకిన్, గాంగ్షణ్ మౌంట్జాక్ వంటి అరుదైన క్షీరదాలున్నాయి. అలాగే స్కల్టర్ మోనల్ వంటి పక్షులు ఉన్నాయి. [8] సైన్సు ప్రపంచంలో సరికొత్తగా కనిపెట్టబడిన ఎగిరే ఉడుత కూడా ఈ జిల్లాలో కనిపిస్తుంది..[9]1991లో ఎగువ దిబాంగ్ లోయ జిల్లా, లో 4,149 చ.కి.మీ వైశాల్యంలో " దిబాంగ్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది.[10]
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 1.9 "Dibang Valley District Population Census 2011, Arunachal Pradesh literacy sex ratio and density". Census Organization of India. Archived from the original on 3 January 2013. Retrieved 25 May 2014.
- ↑ National Portal of India : Know India : Districts of India. India.gov.in.
- ↑ History : Lower Dibang Valley Archived 2011-05-26 at the Wayback Machine. Roing.nic.in (16 December 2001).
- ↑ 4.0 4.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- ↑ "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 August 2011. Retrieved 21 March 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Nauru 9,322 July 2011 est.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Mishmi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ Choudhury, Anwaruddin(2008) Survey of mammals and birds in Dihang-Dibang biosphere reserve, Arunachal Pradesh. Final report to Ministry of Environment & Forests, Government of India. The Rhino Foundation for nature in NE India, Guwahati, India. 70pp.
- ↑ Choudhury,Anwaruddin (2009).One more new flying squirrel of the genus Petaurista Link, 1795 from Arunachal Pradesh in north-east India. The Newsletter and Journal of the RhinoFoundation for nat. in NE India 8: 26–34, plates.
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Archived from the original on 23 August 2011. Retrieved 25 September 2011.