అప్పు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
అప్పు అంటే తిరిగి ఇచ్చే షరతుతో అడిగి తీసుకొనే ధనం, ధనేతరాలు.
అప్పు ఇవ్వడం తీసుకోవడం అనేది అభివృద్ధికి దోహదం చేస్తుంది.
అప్పు తీసుకొనేవారు అప్పు ఇచ్చిన వ్యక్తికి వ్రాసి ఇచ్చే నోటును ప్రామిసరి నోట్ అంటారు.
అప్పు ఇచ్చినందుకు వచ్చే ప్రతిఫలాన్ని వడ్డీ అంటారు.
అప్పు తీసుకున్న మొత్తంలో కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లించిన పక్షంలో దానిని జమ అంటారు.
కొంత సమయంలో తిరిగి చెల్లించే వడ్డీ లేని రుణాన్ని చేబదులు అంటారు.
అప్పును ఇంగ్లీషులో Debit అంటారు.
అప్పును ఋణం, బాకీ, అరువు, చేబదులు అని కూడా అంటారు.
సామెతలు సవరించు
- అప్పు అప్పుడే విరోధం
- అప్పుచేసి పప్పుకూడు
- అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు
ఇవి కూడా చూడండి సవరించు
బయటి లింకులు సవరించు
ఈ వ్యాసం సామాజిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |