అబ్దుల్ బారీ ఫిరంగీ మహలీ

ముస్లిం రచయిత

అబ్దుల్ బారీ ఫిరంగీ మహలీ (1878-1926) భారతీయ ముస్లిం పండితుడు, రచయిత. [1] అతడు లక్నోలోని ఫిరంగీ మహల్ రాజభవనానికి చెందినవాడు.

అబ్దుల్ బారీ ఫిరంగీ మహలీ

చరిత్రసవరించు

అబ్దుల్ బారీ పూర్వీకులు బారాబంకీ లోని సిహాలీనుండి 1692 లో ఫిరంగీ మహల్‌కు వెళ్ళింది. [1] 1915 లో అతను లక్నోలో నివసించేవాడు.

రాజకీయాలుసవరించు

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అతను టర్కీ సుల్తాన్‌ను, బ్రిటన్‌కు మద్దతు ఇవ్వాలనీ లేదంటే యుద్ధానికి దూరంగా ఉండాలనీ కోరాడు. [2]

ముస్లింల పట్ల బ్రిటిషు వారి వైఖరికి వ్యతిరేకంగా బారీ, 1919 జనవరి 26 న లక్నోలో ఒక నిరసన సమావేశానికి అధ్యక్షత వహించాడు. [3] [4]

అతను ఖిలాఫత్ ఉద్యమంలో అత్యంత చురుకుగా పనిచేసాడు. [1]

ప్రత్యేకించి ఖిలాఫత్ ఆందోళన సమయంలో అతను హిందూ -ముస్లిం ఐక్యతను బోధించాడు. మహాత్మా గాంధీకి సహచరుడు. ఇతర సందర్భాల్లో, హిందువుల విశ్వాసాలను గౌరవిస్తూ, గోవులను బలి ఇవ్వవద్దని ముస్లిములను కోరాడు. [5]

సంస్థలుసవరించు

 • పాశ్చాత్య విద్యను వ్యతిరేకిస్తూ, అతను లక్నోలో మదర్సా-ఇ-నిజామియాను స్థాపించాడు.
 • బ్రిటిషు వారు ముస్లిం పవిత్ర స్థలాలను అపవిత్రం చేయకుండా నిరోధించడానికి అతను అంజుమన్-ఇ-ఖుద్దం-ఇ-కబ్బా (1914) ను ఏర్పాటు చేశాడు.
 • అతను దారుల్ ముస్సాన్నేఫిన్ షిబ్లి అకాడమీ వ్యవస్థాపక సభ్యుడు, (1915-1916). [6]
 • జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపక (1920) సభ్యుడు. [7]

పుస్తకాలుసవరించు

అబ్దుల్ బారీ 111 పుస్తకాలను రచించాడు. [1]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 

 1. 1.0 1.1 1.2 1.3 "Cam Diary: Lucknow's Farangi Mahal". Daily Times (newspaper). Archived from the original on 22 April 2007. Retrieved 22 August 2019. ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "DT" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "DT" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "DT" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 2. Gandhi's Rise to Power: Indian Politics 1915–1922 By Judith M. Brown
 3. Jafariya News, 21 November 2004 Archived 6 ఏప్రిల్ 2010 at the Wayback Machine
 4. The historic perspective of Inhidaam-e-Jannatul Baqee & Jannatul Mualla Archived 12 ఏప్రిల్ 2010 at the Wayback Machine
 5. September 1923. Francis Robinson, Separatism Among Indian Muslims, Delhi, 1975, p. 339.
 6. Darul Musannefin Shibli Academy Retrieved 22 August 2019
 7. "Jamia Millia Islamia, A Historical Note". Archived from the original on 30 June 2007. Retrieved 22 August 2019.