అభినవ కాళిదాసు
ప్రద్ధభాగవత చంపువు రచించిన కవి
ఇతని ఇంటిపేరు వల్లాల వారనిమత్రము ఈ చంపువునకు టీక ఇచ్చిన మోక్షగుండం అక్కయ్యసూరి తెలిపియున్నాడు. అతనికి ఇతని అసలుపేరు తెలియలేదు. కాని ఇతనికి అభినవ కాళిదాసు బిరుదు ఉంది. ఈకవికూడా తన చంపువు తుదన అభినవకాళిదాసు అని వ్రాసుకున్నాడు. ఇతనికీ బిరుదు తెచ్చిన 6అశ్వాసముల ఈ చంపు ఆంధ్రదేశమున పఠనపాఠ్యవ్యవహారమ్ందెక్కువగా వ్యాపించియుండెడిది. ఈకవి సా.శ. 1100 ప్రాంతము వాడు. ఇతడు రచించిన అభినవభారతచంపువు, కలివిడంబనము, భగవత్పాదసప్తతి అనెడి రచనలు దేశమున ఖ్యాతి గాంచలేదు.
గోపాలశాస్త్రి
మరియొక భాగవతపుచంపువు రచించిన మరియొక అభినవకాళిదాసు గోపాలశాస్త్రి. ఇతని కాలముసరిగ తెలియదు. ఉదయార్పళయము జమీందారు ఆస్థానమునున్నవాడు. ఇతని ఈకృతి ఇపుడు దక్షిణదేశములో కూడా వాడుకలో నున్నట్లు తెలియదుకాని, ఇతడు స్వకాలమున నిరంకుసుడై సరసులు కాని స్వకాలరాజులను ధిక్కరించినవాడని మాత్రము ఈతని చాటువులు కొన్ని చెప్పు చున్నవి. అందలి ఇదొకటి. ఇందితని ఆదరించిన రంగరాజుస్తుతి కూడా గోచరించును.
" అజ్ఞానా మవనీభుజా మహరహ స్స్వర్ణాభిషేకా దపి జ్ఞాతు శ్శ్రీ యునరంగభూబలరిపోః శ్లాఘైన సమ్మాననా, సారాసార వివేకశూన్యతరుణీ సంభోగసాంరాజ్యతః సారజ్ఞందుముఖీనిలోకనసము త్కంతైవ యూనాం ముదే"
కవికుంజురుని గురువు
అసలుపేరు తెలియని మరియొక అభినవకాళిదాసు కవికుంజురుని గురువు. ఈ కవికుంజురుడు భోజప్రబంధమువంటి రాజశేఖరచరిత్ర అను కృతి నిర్మించెను. విద్యానగరపాలకుడైన ఈ రాజశేఖరుని సభలో చోళదేశమునుండి వచ్చిన ధుర్జయుడనువాడు ప్రధాన కవి యట. అతని ఇతని గురువైన నవీనకాళిదాసు ఓడించి అవమానించాడాట. ఈ కవికుంజర సంజ్ఞ కూడా బిరుదుగానే కనబడుతున్నది. ఈకృతిలోని విషయము పరదేశీ విద్వాంసులను రాజసభలో చేరనీయని చోళ దేశ విద్వాంసు అవమానించుట, రాజశేఖరుని సత్కారములను నవీన కాళిదాసాదులు పొందుట. ఈనవీన కాళిదాసు కృతులేవీ కనబడలేదు.
నృసింహకవి
మరియొక అభినవకాళిదాసు నృసింహకవి. ఇతని ఇంటిపేరు తెలియదు. ఇతడు శివరామకవిపుత్రుడు. ఆలూరు తిరుమలకవిమిత్రుడు. చంద్రకళాపరిణయమను సంస్కృత నాటాకమును, హాలాస్యమహత్యమను తెలుగు వచనకావ్యమును నిర్మించిన ఈ తిరుమలకవి అభినవభూతి బిరుదాంకితుడు. సమవయస్కులును, ఆంధ్రులు నైన వీరిద్దరును మైసూరు సంస్థానమును ఆశ్రయించి గౌరవము పొందినారని తెలుస్తున్నది. ఈ నృసింహకవి నంజయశోభూషణ మనెడి 7 అశ్వాసముల కృతి రచించెను. బరోడా సంస్థానము వారి దీనిని ప్రచురించిరి. ఈకృతి నాయకుడైన నంజరాజు మైసూరు సంస్థాన ప్రధాన సేనానాయకుడై సా.శ. 1750 ప్రాంతమున వన్నెకెక్కినాడు. కావున ఈ కవి కూడా ఇదే కాలమువాడవచ్చును.
శృంగారకోశబభాణమును రచించిన కవి
అసలుపేరు తెలియని మరియొక అభినవకాళిదాసు ఈ శృంగారకోశబభాణమును రచించిన కవి. విద్యారణ్యమాధవాచార్యులకంటె వేరైన మాధవడని సంక్షేపశంకర జయము రచించెను.
యక్షోల్లాసమును రచించిన ఆంధ్రదేశకవి శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి.
క్రీ, శ. 1790లో జన్మించిన ఈ విద్వత్కవి 1870 ప్రాంతమున స్వర్గస్తులయ్యిర్తి. కాకినాడకు దగ్గరగా నున్న్న గొల్లపాల్ము ఇతని జన్మస్థలము. ఆనాటి పిఠాపురరాజుల సత్కారము లొందిన ఇతడు వేదశాస్త్రపారీణుడు, సంగీతనిధి. ఇతనికి అభినవకాళిదాసు అని బిరుదు ఉంది.