అభినవ గుప్తుడు

భారతీయ తత్వవేత్త మరియు రచయిత

అభినవ గుప్తుడు (c. 950 – 1020 AD[1][2]) కాశ్మీర దేశానికి చెందిన ఒక ప్రాచీన భారతీయ తత్వవేత్త, మార్మికవాది, రసవాది. [3] ఆయన భారతీయ సంగీతాన్ని, కవిత్వాన్ని, నాటకరంగాన్నీ, వేదాంత శాస్త్రం, తార్కిక శాస్త్రాలను కూడా ప్రభావితం చేశాడు. [4][5] అంతే కాకుండా భారతీయ సంస్కృతి మీద తన ప్రభావం చూపిన బహుముఖ ప్రజ్ఞాశాలి.[6][7]

ఈయన కాశ్మీర్ లోని పండితుల కుటుంబంలో జన్మించాడు. [8]అన్ని రకాల తత్వాలను అధ్యయనం చేశాడు. ఆ కాలంలో ఉన్న అన్ని రకాల కళలను సుమారు 15 మంది గురువుల దగ్గర శిష్యరికం చేసి నేర్చుకున్నాడు. [9] ఆయన జీవిత కాలంలో సుమారు 35 రచనలు చేశాడు. వాటిల్లో అన్నింటికన్నా పెద్దది తంత్రాలోకం అనే గ్రంథం. ఇప్పుడు కాశ్మీర శైవం గా పిలువబడుతున్న త్రికం, కౌల అనే సాంప్రదాయాల పరిపూర్ణ విజ్ఞాన సర్వస్వం ఇది. ఆయన రచించిన ఇంకో ప్రముఖ గ్రంథం అభినవభారతి. ఇది భరతముని రాసిన నాట్యశాస్త్రానికి భాష్యం. [10]

జీవితం

మార్చు

అభినవ గుప్తుడు ఆయన అసలు పేరు కాదు. ఆయన సామర్థ్యం, సాధికారతలను చూసి ఆయన గురువుగారిచ్చిన బిరుదు. [11][12] ఆయన రచనల మీద అతి ముఖ్యమైన భాష్యాలు రాసిన జయరధుడు ప్రకారం అభినవ గుప్తుడు అనే పేరుకి ఎల్లప్పుడు జాగరూకత కలిగి ఉండే, అన్ని చోట్లా ఉండగలిగే, ప్రశంసలచే రక్షించబడే అనే అర్థాలు కూడా ఉన్నాయి. [13] తంత్రాలోకం గ్రంథాన్ని పూర్తిగా ఆంగ్లంలోకి అనువదించిన రెనీరో నోలి అనే సంస్కృత పండితుడు అభినవ గుప్తుడు అంటే నిత్య నూతనమైన భావాలు కలిగిన వాడు అని పేర్కొన్నాడు. [14]

మూలాలు

మార్చు
  1. Triadic Heart of Shiva, Paul E. Muller-Ortega, page 12
  2. Introduction to the Tantrāloka, Navjivan Rastogi, page 27
  3. "Abhinavagupta – the Philosopher". Archived from the original on 2017-07-20. Retrieved 2016-04-22.
  4. Re-accessing Abhinavagupta, Navjivan Rastogi, page 4
  5. Key to the Vedas, Nathalia Mikhailova, page 169
  6. The Pratyabhijñā Philosophy, Ganesh Vasudeo Tagare, page 12
  7. Companion to Tantra, S.C. Banerji, page 89
  8. Doctrine of Divine Recognition, K. C. Pandey, page V
  9. Introduction to the Tantrāloka, Navjivan Rastogi, page 35
  10. Luce dei Tantra, Tantrāloka, Abhinavagupta, Raniero Gnoli, page LXXVII
  11. Introduction to the Tantrāloka, Navjivan Rastogi, page 20
  12. The Krama Tantricism of Kashmir; Navjivan Rastogi, page 157
  13. The Kula Ritual, As Elaborated in Chapter 29 of the Tantrāloka, Abhinavagupta; John R. Dupuche, page 4
  14. Luce dei Tantra, Tantrāloka, Abhinavagupta, Raniero Gnoli, 1999, page 3