ఈశ్వరుడు ఆదిప్రవక్త. నందికేశ్వరుడు ఈశ్వరుని సన్నిధిలో నాట్యమును గ్రహించాడు. ఆతడే శివుని ఆజ్ఞపై బ్రహ్మకుపదేసించాడు. అటుపై బ్రహ్మ నాట్యమును ఉదయహరించాడు. భరతుడు దానిని గ్రహించి నాట్యశాస్త్రం రచించాడు. దానికే నాట్యవేదం అని పేరు. శాండిల్య వాత్సల్య కోహాదులు భరత శిష్యులు, వారు నాట్య విద్యను ప్రచారం చేసారు. లోక సంగ్రహాన్ని ఆపేక్షించిన మనువు సూర్యుడుని లోకసముద్ధరణోపాయమును చెప్పమని అడిగాడు. సూర్యుడు చెప్పిన ఉపాయములను బట్టి భరతుని దగ్గర మనువు నాట్యవిద్య తెలుసుకున్నాడు. దీనినే కొందరు వాగ్దేవీ సాంప్రదాయమని అంటారు.

నాట్య శాస్త్రములో ఉదహరింపబడిన భంగిమ

ప్రమాణము సవరించు

నాట్యవిద్యను అనుసరించి వెలువడిన అఖిల గ్రంథాలకూ ఇది ప్రమాణము. ఈమహాగ్రంథంలో నాట్యము ప్రధానంగా నిర్వచింపబడటంవలన నాట్యశాస్త్రమనే పేరు సార్థకమౌతున్నది.అయినప్పటికీ నాట్యాంగముగా ఉండే అనేకవిషయాలు నిరూపింపబడినవి. కావ్య విద్యాప్రమేయమిందులో కూర్పబడింది. చందోవిచిత తాళమృదంగవిధానాలు ఇందులో నిరూపితములయినవి. ఇంకా కామశాస్త్రం కూడా అవసరమైనంత వరకూ గోచరించపబడింది. నాయికానయిక స్వభావాలు, కామతంత్రమును అనుసరించినవారి ప్రవృత్తి భేదాలు చక్కగా తెలుపబడినవి. మనోవిజ్ఞానాకి కావలిసిన అనేక రహస్యాలు అక్కడక్కడా గోచరించబడినవి. కాని ఇన్నీ నాట్యానికి అంగములుగానే వర్ణింపబడివని. నాట్యశాస్త్ర పరిమితి 36 అధ్యాయాలు. అలంకార నిబంధకులంతా ప్రత్యభిజ్ఞా సంప్రదాయవాదులు. వీరినే సంప్రదాయ వాదులని, స్పందవాదులని అంటారు. వీరికి సంబంధించిన కొన్ని అంసములు ఈ శాస్త్రములో చెప్పబడినవి. అభినవ గుప్తడు ఈ గ్రంథానికి వ్యాఖ్యాత. ఈ గ్రంథంలో మొత్తంమ్మీద 5536 శ్లోకాలున్నాయి. ఇందులో సామాన్యంగా అన్నీ అనుష్టుప్ వృత్తాలు. అక్కడక్కడా భిన్న వృత్తాలున్నాయి. ఉదాహరణలు భిన్న వృత్తాలలోనే కూర్పబడినవి. ఈ శ్లోకాలు కాక అక్కడక్కడ కొంత గద్య పద్యం ములు కూడా ఉన్నాయి. మొదట్లో భరత గ్రంథం సూత్రాత్మక గద్య రూపంగా ఉండేదనీ, తరువాతికాలంలో ప్రకృత రూపం పొందినదని అంటారు.

గ్రంథంలో అక్కడక్కడ "ఆత్రైతే అనువంశ్యికాః శ్లోకా భవంతి" అన్ని కొన్ని శ్లోకాలను భరతుడు వ్రాసినాడు.అవి సంప్రదాయ గతములై ఉండవచ్చు. అంతకుపూర్వం ఏదైనా నాట్యనిబంధనం ఉండిఐనా తీరాలి.ఆయా సంప్రదాయాలకు సంబధించిన శ్లోకాలై ఉండవచ్చును. ఆ గ్రంథాలు ఇప్పుడు అలభ్యం. ఉండినచో ఎంత బాగుండేదో మరి!

వ్యాఖ్యాతలు సవరించు

భట్టలోల్లటుడు, శ్రీ శంకుకుడు, భట్టనాయకుడు ఈ నాట్యశాస్త్రానికి వ్యాఖ్యానాలు వ్రాసారుట. అవి ఎక్కడా కనబడలేడు. అభినవ గుప్తా చార్యుడు వ్రాసిన అభినవభారతి అనే నాట్యవివృతి మాత్రమే ఇప్పుడు లభించింది. అభినవ గుప్తుడు తన వ్యాఖ్యానంలో లోల్లటాదుల భావాలను అనువదించుచునాడు. తనకు సమ్మతం కానప్పుడు వానిని ఖంఢించాడు. అతని వచనాలవల్లనే లోల్లటాదుల వ్యాఖ్యాన్ం వ్రాసినట్లు తెలుస్తున్నది. నాట్యవేద భావమును తెలుసుకొనటానికి అభినవభారతినే చదవాలి.

గ్రంధవిషయము సవరించు

నాట్యశాస్త్రంలో విషయము చాలా ఉదాత్తంగా ఉంటుంది. మొదటి 7 ఆధ్యాయములు సర్వ సాధారణమైన లోక సంబధిత విషయములు, వీటిని బాగా అవగతం చేసుకుంటేగాని నాట్య పరమార్ధము తెలుసుకోవటానికి అవకాశం కలగదు. వీటిలో పలు విషయములు చర్చింపబడినవి, నాట్యము ఏవిధముగా ఉత్పన్నమైనది? అసలెందులకు కావలసి వచ్చినది? దాని సంప్రదాయం ఏమిటి? అభినయించేవాళ్ళ పరంపర ఎటువంటిది? ఎందుకొరకై నాట్య మవతరింపబడినది? నాట్యమేయే ఫలాలను సంపాదించును?ఏయే చిహ్నాలు ఏయే అమ్శాలను బోధిస్తాయి? నాట్య మంటపము ఏవిధంగా నిర్మించాలి? దాని విధానాం ఏమిటి? రంగ మంటపాలను ఎన్నివిధాల ఏర్పాటు చెయ్యొచ్చు? త్రివిధ నాట్య శాలల స్వరూపం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలకు సంబధించిన విషయములు చర్చిపబడినవి. ఇంకా తాండవము, తద్భేధాలు, స్వరూపము, అభినయించే విధానము, వాని రసభావవినియోగము, పూర్వరంగవిధి, సూత్రధారకర్తవ్యము, నటుల సముదాచారము, రసములు, లక్షణములు, స్వరూపస్వభావాలు, ఇంకా అనెక విషయములు మొదటి అధ్యాయ సప్తకంలో నిరూపించబడినవి. 8 నుండి 14 అధ్యాయములలో అభినయ విశేషాలు విపురంగా నిరూపించబడినవి. ఏభావాన్ని అభినయించడానికి ఏ అవయమును యేమేమి ఎట్లెట్లా చేయాలో ఈ అధ్యాయాలలో తెలుస్తున్నది. ఉపాంగ విధానాలు, హస్తాభినయము, శరీరాభినయము, చారీమందుల విధానాలు, గతిప్రచారము, ప్రవృత్తిధర్మాలు, ఈ ప్రకరణంలో చాలా స్పష్టంగా తెలుపును. ఈ విషయములు నటులు సామాన్యులు తెలుసుకొనినచో నాట్యమును చక్కగా ఆశ్వానించగలుగుదురు.

15, 16 అధ్యాయాలలో ఛందస్సు ఉంది. 17,18,20,21 అధ్యాయాలు కావ్యవిద్యకు సంబధించిన విషయప్రతిపాదనంతో నిండివున్నది. 19వ అధ్యాయంలో కాకుస్వరాలు నిరూపించబడినవి. రంగస్థలంలో మాట్లాడేటప్పుడు ఎవరేవిధంగా మాట్లాడాలి? వారి స్వరం ఏవిధంగా ఉండాలి? ఈ విషయాలన్నింటినీ ఈ అధ్యాయంలో బాగా చర్చింపబడింది. మాళ్ళా 22 నుండి 27 వ అధ్యాయములలో జగద్విలాసం అంతా కనబడుతుంది. భారత్యాదివృత్తులు, వాని అవాంతరప్రభేధాలు, అహార్యాభినయము, వాని రసభవానుకూల పరిస్థితులు, దివ్యమర్త్య భేదాల అనుసరించిన వేషధారణము, సామాన్యాభినయము, నాట్యాలంకారాలు, స్త్రీలకభినయంలో విధివిశేషాలు, బాహ్యోపచారము, వైశికవిధులు, చిత్రాభినయము, సిద్ధవ్యంజనములు, ఇటువంటి నానా విషయములు ఈ అధ్యాయములో చర్చింపబడినవి. ఈ అధ్యాయంలోనే ప్రసంగవశాన కామశాస్త్రం కొంత చర్చింపబడింది. స్త్రీల స్వభావాలు, పురుషుల ప్రవృత్తులు, విస్రంభణోపాయాలు, కామోపచారవైధగద్యవిధులు, చాలా విషయములు తెలుపబడినవి. 28 నుండి 33 అధ్యాయాలు వాద్యవిధులను చెప్పుచున్నవి. 30 వ అధ్యాయములో వంశీ వాదనం చెప్పబడింది.

34, 35,36 అధ్యాయాలను చూడకుండా తెలియకుండా విడువరాదు. ప్రకృతివిచారము, భూమికాపాత్రవికల్పము, నాట్యావతారము అన్నీ వీటిలో ఉన్నాయి.

ముఖ్య విషయము సవరించు

నాట్యానికి అనేక ప్రయోజనాలున్నవి. అవ్వంతరప్రయోజనాలెన్ని ఉన్నప్పటికీ మహారసమే నాట్యముఖ్యప్రయోజనం. మనోరసానికి అనుకూలమైన ప్రవనత ఎక్కడ సంపాదించగలిగితే అక్కడే ఆస్వాదం కలుగుతుంది. మనోవృత్తిలో విజృంభించితే స్పందశక్తులను నిరోధించి సమానావస్థను సంపాదించినతరువాతనే సాధకుడు ఆస్వాదభూమికను అందుకోగలుగుతాడు. నాట్యం వలన చక్షురాదీంద్రియాలు ఏయే విధంగా ఉన్నప్పటికీ భవనా చక్షువు, భవనా శ్రోత్రము, భవనేంద్రియము స్వస్వవ్యాపారంలో బగా మగ్నత పొంది ఉంటవి.అందువలన మనో భూమికూడా భావనకు మహాసాగరం అవుతుంది. దీని వలన ప్రపంచభేదం సులభము. దీని వలన ఆత్మ ప్రకాశము చెందును. ఈ మహాప్రకాశావస్థనే మహారసమంటారు. ఇటువంటి మహారస సంపత్తిని నాట్యం అందజేయగలుగుతుందని ఈ శాస్త్రము తెలుపుచున్నది. ఈమహారస సంపదే ఆత్మసంవేదనము. ఆత్మసంవేదనము నాట్యం చూచే ప్రతీవానికి కలుగదు. విశిష్టమైన అర్హత ఇక్కడకూడా అవసరము. అవాంతరంగా అర్హతాసంపత్తిని కూడా నాట్యమే సంపాదించుతుంది. ధార్మిక శిక్ష నివ్వటానికి మునులు నాట్యమును అవతరింపజేసారని ఆనందవర్ధనుడు చెప్పినాడు.

ఇతర నాట్యశాస్త్ర గ్రంధములు సవరించు

భరతుని మతమును తు, చ తప్పకుండా అనుసరించినవాడు దత్తిలుడు. దత్తిల గ్రంథమునకు ప్రయోగస్తబక మను వ్యాఖ్యానము ఉంది.కోహలుడు నాట్యశాస్త్రము లోని విషయములను పెంచి, ప్రస్తార తంత్రమును చెప్పినట్లుగా నాట్యశాస్త్రముననే ఉంది.ఇతడు రచించిన అభినయశాస్త్రములోని తాళాధ్యయమే నేడు లభించుచున్నది.కోహలుడు, దత్తిలునకు చెప్పినట్లున్న దత్తిల కోహలీయము, మతంగునకు చెప్పిన కోహల రహస్యము నేడుగూడా కలవని వినికిడి, కోహలుడు తన ప్రధానగ్రంధమును శార్దూలునకు చెప్పినట్లు కల్లినాధుని సంగీత రత్నాకరవ్యాఖ్యలలో కనిపించుచున్నది.

మతంగుని బృహదేశ ఆరు అధ్యాయముల వరకే లభించుచున్నది.దీనిలో శ్రుతులు, స్వరములు మాత్రమే వివరించబడినవి.మూర్చనలో 12 స్వరములు భరతునిలో లేనివి ఇటగలవు.నందికేశ్వరుని మతము భరతునికన్నా భిన్నమైనట్లు అభినవుడు, కల్లినాధుడు ఎంచారు.

నాట్య, సంగీతశాస్త్ర ప్రవక్తులుగా మాధవ గణేశ, షణ్ముఖ, వాయు, దుర్గలు గలరని మతంగుడు పల్కినాడు.కామదేవుని నృత్యలక్షణము తాలలక్షణమున ఉంది.సింగభూపుని సంగీత రత్నాకర వ్యాఖ్యలో దక్ష ప్రజాపతి కారిక కనిపించుచున్నది.ప్రశాంత నాటకమున సాత్వతీ వృత్తి కలదని ద్రౌహిణుడు అనినాడు. ధేనుకుని తాళాధ్యాయము కుట్టినీ మతమున స్మరించబడింది.కంబళ, అశ్వతరులను నాగులు సరస్వతీ ప్రసాదవశమున నాథవిద్యను గ్రహించిరని దామోదరుని సంగీతదర్పణమున ఉంది. ఇంద్రధ్వజోత్సవమున ప్రదర్సించిన నాటకములో భాండవాద్యమునౌ స్వతి వాయించెనని భరతుడనినాడు. దీనిపై వ్యాఖ్యానించుచు స్వాతి కనుగొనిన పుష్కరవాద్యమును అభినవుడు వివరించెను.

సంగీతాచార్యులలో కశ్యపుడు కలడని అభినవుడు లేదా అభినవ గుప్తుడు అభినవ భారతిలో చెప్పుచు, రసభావ వినియోగములకు అనుగుణమైన రాగములను తెలుపు కశ్యపపంక్తులనిచ్చాడు.కావ్యాదర్శ వ్యాఖ్యయగు హృదయంగమములో కశ్యపుడు, వరరుచి లక్షణశాస్త్రములను చెప్పిరని ఉంది.

నారదీయశిక్ష అను నారదుని సంగీతశాస్త్ర మొకటి ఉంది. భరతుడు సామస్వరమున నారదుని భావముల ఉదహరించినాదు.అభినవుడు అనేకస్థలముల నారదుని గ్రంథమును ప్రస్తుతించెను. నారదశిక్షలో చెప్పబడిన గాంధారగ్రామము మానవస్వరమునకు అందనిదగుటచేత భరతుడు దీనిని వదెలెనట.రాగనిరూపణము అను గ్రంథమున నారదుడు క్ష్140 రాగములను నారదుడు వివరించాడు.పంచమసారస్ంహిత మరియుక నారద గ్రంథము.మూడు అధ్యాయములలో నున్న దత్తిల నారద సంవాదమున రాగములు, శ్రుతులు, స్వరములు వివరించబడినవి.నారదుని సంగీతమకరందమున నాలుగు అధ్యాయమునకు భాష్యము రచించెను.దీనినే భరతవార్తికము అని, సరస్వతీ హృదయభూషణమని, సరస్వతీ హృదయాలంకారము అని అంటారు.ఇది 17 అధ్యాయముల గ్రంథము.

శారంగదేవుడు సంగీతరత్నాకరము (సా.శ.1170) జగదేకమల్ల చాళుక్య చక్రవర్తి (1138-1150) రచించిన సంగీతచూడామని భూలోకమల్ల సోమేశ్వరుడు (1116-1127) మానసోల్లాసము మొదలైనవి సంగీత శాస్త్ర వివేచన పలు ఉపయోగకర గ్రంథములు.

మూలాలు సవరించు

  • భారతి సంచిక.