అభిమన్యు సింగ్ సింధు

అభిమన్యు సింగ్ సింధు హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో నార్నాండ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆర్థిక, రెవిన్యూ, ఎక్సైజ్, ప్రణాళిక, న్యాయ, సంస్థాగత ఆర్థిక & క్రెడిట్ నియంత్రణ, పునరావాస, పరిశ్రమల, కార్మిక, పర్యావరణ & అటవీ, పారిశ్రామిక శిక్షణ శాఖల మంత్రిగా పని చేశాడు.[1]

అభిమన్యు సింగ్ సింధు
అభిమన్యు సింగ్ సింధు

కెప్టెన్ అభిమన్యు


పదవీ కాలం
26 అక్టోబర్ 2014 – 27 అక్టోబర్ 2019

పదవీ కాలం
2014 – 2019
ముందు సరోజ్ మోర్
తరువాత రామ్ కుమార్ గౌతమ్
నియోజకవర్గం నార్నాండ్

వ్యక్తిగత వివరాలు

జననం (1967-12-18) 1967 డిసెంబరు 18 (వయసు 57)
ఖండా ఖేరి, హర్యానా, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ఏక్తా సింధు
సంతానం 3
నివాసం రోహ్తక్, హర్యానా, భారతదేశం
పూర్వ విద్యార్థి హార్వర్డ్ బిజినెస్ స్కూల్, మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం, గురు జంభేశ్వర్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
వృత్తి రాజకీయ నాయకుడు
వృత్తి
  • సైనికుడు
  • పాత్రికేయుడు
  • వ్యాపారవేత్త
  • సంఘ సంస్కర్త
పురస్కారాలు హర్యానా సాహిత్య అకాడమీ నుండి బాబు బాల్ ముకుంద్ గుప్త్ అవార్డు

రాజకీయ జీవితం

మార్చు

అభిమన్యు సింగ్ సింధు బీజేపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో రోహ్‌తక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న భూపీందర్ సింగ్ హుడా చేతిలో ఓడిపోయాడు. ఆయన ఆ తర్వాత 2005లో రోహ్‌తక్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో హుడా కుమారుడు దీపేందర్ సింగ్ హుడా చేతిలో ఓడిపోయి, అదే సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో నార్నాండ్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాడు.

అభిమన్యు సింగ్ సింధు రెండు పర్యాయాలు హర్యానా బీజేపీ యూనిట్ జనరల్ సెక్రటరీగా పని చేసి 2005లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యాడు. ఆయన 2009 శాసనసభ ఎన్నికలలో నార్నాండ్ నుండి, అదే సంవత్సరంలో రోహ్‌తక్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అభిమన్యు సింగ్ 2012లో బిజెపి పంజాబ్ కో-ఇన్‌చార్జ్‌గా నియమితుడై రాష్ట్రంలో పంజాబ్ శాసనసభ ఎన్నికలలో శిరోమణి అకాలీదళ్ - బిజెపి కూటమి విజయానికి నాయకత్వం వహించడంలో కీలకంగా పని చేసి, 2012లో ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల మీడియా నిర్వహణలో, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఎన్నికల నిర్వహణ బృందంలోసభ్యుడిగా పని చేశాడు.[2][3]

అభిమన్యు సింగ్ 2013లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా, ఉత్తరప్రదేశ్ కో-ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు. ఆయన 2014లో హర్యానా శాసనసభ ఎన్నికలలో నార్నాండ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[4] ఆయన 2017లో పంజాబ్ రాష్ట్రానికి భాజపా భాగస్వామ్య వ్యవహారాల ఇంచార్జ్‌గా,[5] 26 డిసెంబర్ 2018న పంజాబ్, చండీగఢ్‌లకు బీజేపీ ఇంచార్జ్‌గా నియమితుడయ్యాడు. ఆయన ఆ తరువాత 2019, 2024 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయాడు.[6]

మూలాలు

మార్చు
  1. "About | Captain Abhimanyu". Archived from the original on 21 August 2014. Retrieved 20 August 2014.
  2. Siwach, Sukhbir (7 November 2013). "Captain Abhimanyu becomes co-in-charge of BJP in UP". The Times of India. Retrieved 4 December 2014.
  3. "Amit Shah: The man in new news". India Opines. Archived from the original on 22 October 2014. Retrieved 18 October 2014.
  4. "About | Captain Abhimanyu". Archived from the original on 21 August 2014. Retrieved 20 August 2014.
  5. BJP - given command to Haryana Finance Minister Captain Abhimanyu for Punjab, Dainik Bhaskar, 27 December 2018.
  6. Hindustantimes (8 October 2024). "BJP's Captain Abhimanyu loses to Congress's Jassi Petwar". Retrieved 3 November 2024.