అభిరామ్ నందా
అభిరామ్ నందా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన భారతీయ ఫ్లూటిస్ట్. ఆయన శాస్త్రీయ, ఆధునిక సంగీతం రెండింటిలోనూ వేణువును వాయిస్తాడు. ఆయన హరిప్రసాద్ చౌరాషియా, మోహినీ మోహన్ పట్నాయక్ వంటి గురువుల వద్ద వేణువు వాయించడం నేర్చుకున్నాడు.[1]
అభిరామ్ నందా | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
జీవిత భాగస్వామి | సోనాలి మహపాత్ర |
తల్లిదండ్రులు | అశోక్ కుమార్ నందా కాంతిలత |
బంధువులు | పింటు నందా (సోదరుడు) (మ. 2023 మార్చి 1) |
ఆయన దేశంలోని వివిధ ప్రాంతాలలోనే కాక 53 విదేశాలలో కూడా వేణువును వాయించి పలువురి ప్రశంసలందుకున్నాడు. అతని వద్ద చాలా మంది స్థానిక విద్యార్థులే కాక విదేశీయులు కూడా వేణువు పాఠాలు నేర్చుకుంటారు. వేణువుల తయారీలో కూడా నైపుణ్యం కలిగిన ఆయన దగ్గర చాలా మంది విదేశీ ఫ్లూటిస్టులు వేణువులు కొంటారు.
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుఅభిరామ్ నంద జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని తేరాటాంగ్‌లో అశోక్ కుమార్ నంద, కాంతిలత దంపతులకు జన్మించాడు. తన తండ్రి వృత్తిరీత్యా ఇంజనీర్ అయినప్పటికీ, అతను ఫ్లూట్ వాయించడం, నటనను ఇష్టపడేవాడు. అతని సోదరుడు పింటు నంద ప్రముఖ సినీ నటుడు. కాలేయ సంబంధిత వ్యాధితో పింటు నంద 2023 మార్చి 1న మృతి చెందాడు.[2]
కెరీర్
మార్చుతొంభైల ప్రారంభంలో అభిరామ్ నంద ఫ్లూట్ ప్లేయర్‌గా కెరీర్ ప్రారంభించాడు. 1995లో గోవా యూత్ ఫెస్టివల్‌లో ఫ్లూట్ వాయించినందుకు జాతీయ యువజన అవార్డును గెలుచుకున్నాడు. హరిప్రసాద్ చౌరాసియా వద్ద వేణువు పాఠాలు నేర్చుకున్న తర్వాత, అతను అనేక స్టేజ్ ఈవెంట్లలో గురువుతో కలిసి వేణువును వాయించే అవకాశం వచ్చింది. ఆ తరువాత విదేశాల్లో ఫ్లూట్ వాయించే అవకాశం వచ్చింది. అతను వైర్‌లెస్ ఆర్టిస్ట్ కూడా. ఒడిస్సీ సంగీతం, ఒడిస్సీ నృత్యంలో వేణువు ఒక ముఖ్యమైన వాయిద్యం కూడా. ఆయన చాలా మంది ఒడిస్సీ నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శనలు ఇస్తున్నాడు.
పురస్కారాలు
మార్చు- సుర్ సింఘా పార్లమెంట్ (ముంబై)[3]
మూలాలు
మార్చు- ↑ "Young flautist strikes the right note - Abhiram Nanda took lessons from Pandit Hariprasad Chaurasia". telegraphindia.com. telegraph. Archived from the original on 12 June 2020. Retrieved 12 June 2020.
- ↑ "Popular Odia Actor Pintu Nanda Passed Away At Hyderabad - Sakshi". web.archive.org. 2023-03-03. Archived from the original on 2023-03-03. Retrieved 2023-03-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Churning out melody". www.newindianexpress.com. The New Indian Express. Archived from the original on 12 June 2020. Retrieved 12 June 2020.