అభిలాష (సినిమా)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ యొక్క అభిలాష నవల ఆదారంగా నిర్మింపబడిన చిత్రం. చిరంజీవి సినిమా పరిశ్రమలో హీరోగా ఎదుగుతున్న రోజులలో తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి అతని కెరీర్ మైలు రాళ్ళలో ఒకటిగా నిలిచింది. కె.యస్. రామారావు నిర్మించిన ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా ఇళయరాజా సంగీతం అందించాడు. ఐపీసీ 302 ని శిక్షాస్మృతి నుండి తొలగించడానికి ప్రయత్నిస్తూ కథానాయకుడు పడ్డ ప్రయత్నం ఈ సినిమా ప్రధాన కథాంశం. ఇదే సినిమా తమిళంలో కూడా పునర్నిర్మించారు.
అభిలాష (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కోదండరామరెడ్డి |
---|---|
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | క్రియేటివ్ కమర్షియల్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుకొణిదెల చిరంజీవి
రాధిక
రావు గోపాలరావు
గొల్లపూడి మారుతీరావు
రాజ్యలక్ష్మి
మాడా వెంకటేశ్వరరావు
రాళ్ళపల్లి
భీమరాజు
పి.జె.శర్మ
మల్లికార్జునరావు
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: ఎ.కోదండరామిరెడ్డి
సంగీతం: ఇళయరాజా
కధ: యండమూరి వీరేంద్రనాథ్
నిర్మాత: కె.ఎస్.రామారావు
నిర్మాణ సంస్థ: క్రియేటివ్ కమర్షియల్స్
సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి, ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం ,శిష్ట్లా జానకి
ఫోటోగ్రఫి: లోక్‌సింగ్
కూర్పు; కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల:11;03:1983.
కథ
మార్చులాయరుగా పెద్దగా ప్రాక్టీసులేని చిరంజీవి (చిరంజీవి) తమ రూమ్మేటుతో కలిసి ఓ గదిలో నివసిస్తూ ఉంటాడు. తని తండ్రికి జరిగిన అన్యాయం వేరొకరికి జరగకూడగని ఐపీసీ 302 ని భారతీయ శిక్షాస్మృతి నుండి తొలగించడానికి ప్రయత్నిస్తుంటాడు.
పాటలు
మార్చు- వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకీ , రచన: ఆచార్య ఆత్రేయ గానం.ఎస్ పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి,
- యురేకా ఛాకా మీకా
- ఉరకలై గోదారి , రచన: ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి
- బంతీ చామంతీ, రచన:వేటూరి సుందర రామమూర్తి గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- సందె పొద్దులకాడ, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- నవ్వింది మల్లె చూడు, రచన: వేటూరి సుందర రామమూర్తి,, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.