ఈ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ యొక్క అభిలాష నవల ఆదారంగా నిర్మింపబడిన చిత్రం. చిరంజీవి సినిమా పరిశ్రమలో హీరోగా ఎదుగుతున్న రోజులలో తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి అతని కెరీర్ మైలు రాళ్ళలో ఒకటిగా నిలిచింది. కె.యస్. రామారావు నిర్మించిన ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా ఇళయరాజా సంగీతం అందించాడు. ఐపీసీ 302 ని శిక్షాస్మృతి నుండి తొలగించడానికి ప్రయత్నిస్తూ కథానాయకుడు పడ్డ ప్రయత్నం ఈ సినిమా ప్రధాన కథాంశం. ఇదే సినిమా తమిళంలో కూడా పునర్నిర్మించారు.

అభిలాష
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామరెడ్డి
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్
భాష తెలుగు

లాయరుగా పెద్దగా ప్రాక్టీసులేని చిరంజీవి (చిరంజీవి) తమ రూమ్మేటుతో కలిసి ఓ గదిలో నివసిస్తూ ఉంటాడు. తని తండ్రికి జరిగిన అన్యాయం వేరొకరికి జరగకూడగని ఐపీసీ 302 ని భారతీయ శిక్షాస్మృతి నుండి తొలగించడానికి ప్రయత్నిస్తుంటాడు.

పాటలు

మార్చు
  • వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకీ , రచన: ఆచార్య ఆత్రేయ గానం.ఎస్ పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి,
  • యురేకా ఛాకా మీకా
  • ఉరకలై గోదారి , రచన: ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి
  • బంతీ చామంతీ, రచన:వేటూరి సుందర రామమూర్తి గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • సందె పొద్దులకాడ, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • నవ్వింది మల్లె చూడు, రచన: వేటూరి సుందర రామమూర్తి,, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి