అమర్ కుమార్ బౌరి

అమర్ కుమార్ బౌరి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు శాసనసభకు ఎన్నికై 16 అక్టోబర్ 2023 నుండి జార్ఖండ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు.[1]

అమర్ కుమార్ బౌరి
అమర్ కుమార్ బౌరి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 అక్టోబర్ 2023
ముందు హేమంత్ సోరెన్

రెవిన్యూ & పర్యాటక శాఖ మంత్రి
పదవీ కాలం
19 ఫిబ్రవరి 2015 – 29 డిసెంబర్ 2019
తరువాత హేమంత్ సోరెన్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014
ముందు ఉమాకాంత్ రజాక్
నియోజకవర్గం చందంకియారి (ఎస్సీ)

వ్యక్తిగత వివరాలు

జననం 1978
చందంకియారి, బొకారో జిల్లా, బీహార్, భారతదేశం (ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది )
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్)

జననం, విద్యాభాస్యం

మార్చు

అమర్ కుమార్ బౌరి 1978లో జార్ఖండ్‌ రాష్ట్రం, బొకారో జిల్లా, చందంకియారిలో జన్మించాడు. ఆయన 1994లో ఆర్‌డి టాటా హైస్కూల్ జంషెడ్‌పూర్ నుండి మెట్రిక్యులేషన్, 1997లో కో-ఆపరేటివ్ కాలేజ్ జంషెడ్‌పూర్ నుండి ఇంటర్‌, జంషెడ్‌పూర్ కోఆపరేటివ్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2005లో రాంచీ యూనివర్శిటీ నుండి హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, 2008లో హజారీబాగ్ వినోభా భావే యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

అమర్ కుమార్ బౌరి 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో చందంకియారి శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) పార్టీలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ అభ్యర్థి ఉమాకాంత్ రజక్ చేతిలో 3517 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

అమర్ కుమార్ బౌరి 2014 అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి పోటీ చేసి జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ అభ్యర్థి ఉమాకాంత్ రజక్ పై 34,164 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అయితే వెంటనే ఆయన మరో ఐదుగురు జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరి 19 ఫిబ్రవరి 2015న రఘుబర్ దాస్ మంత్రివర్గంలో రెవిన్యూ & పర్యాటక శాఖ మంత్రిగా పని చేశాడు.

అమర్ కుమార్ బౌరి 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి 16 అక్టోబర్ 2023న జార్ఖండ్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా నియమితులయ్యాడు.[2]

మూలాలు

మార్చు
  1. ThePrint (16 October 2023). "Amar Bauri appointed leader of BJP Legislative Party in Jharkhand". Archived from the original on 19 May 2024. Retrieved 19 May 2024.
  2. Outlook India (16 October 2023). "Amar Kumar Bauri Appointed As Leader Of BJP Legislative Party In Jharkhand" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2024. Retrieved 19 May 2024.