రఘుబర్ దాస్
రఘుబర్ దాస్ (జననం 3 మే 1955) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను జార్ఖండ్ 6వ ముఖ్యమంత్రిగా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేసి, 2023 అక్టోబర్ 19 ఒడిశా రాష్ట్ర గవర్నర్‌గా అధికారంలో ఉన్నారు.[2] భారతీయ జనతా పార్టీకి చెందిన అతను రెండుసార్లు జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
రఘుబర్ దాస్ | |||
రఘుబర్ దాస్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2023 అక్టోబరు 19 | |||
ముందు | గణేశ లాల్ | ||
---|---|---|---|
6వ జార్ఖండ్ ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 2014 డిసెంబరు 28 – 2019 డిసెంబరు 29 | |||
గవర్నరు |
| ||
ముందు | హేమంత్ సోరెన్ | ||
తరువాత | హేమంత్ సోరెన్ | ||
ఉప ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 2009 డిసెంబరు 30 – 2010 మే 29 | |||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1995 – 2019 డిసెంబరు 23 | |||
ముందు | దీనానాథ్ పాండే | ||
తరువాత | సరయు రాయ్ | ||
నియోజకవర్గం | జంషెడ్‌పూర్ తూర్పు ] | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జంషెడ్‌పూర్, బీహార్, భారతదేశం (ప్రస్తుతం జార్ఖండ్, భారతదేశం) | 1955 మే 3||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | రుక్మిణి దేవి[1] | ||
సంతానం | 2 | ||
నివాసం | జంషెడ్‌పూర్ | ||
పూర్వ విద్యార్థి | జంషెడ్‌పూర్ కో-ఓపెరటివే కాలేజీ, జంషెడ్‌పూర్, రాంచి యూనివర్సిటీ |
అతను మొదట టాటా స్టీల్ ఉద్యోగి. ఐదుసార్లు శాసనసభ సభ్యునిగా పనిచేశాడు, 1995 నుండి 2019 వరకు జంషెడ్‌పూర్ ఈస్ట్‌కు ప్రాతినిధ్యం వహించాడు. బిజెపి నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేశాడు. అతని పదవీకాలంలో ఒకానొక సమయంలో జైలుకెళ్లారు. రాష్ట్రానికి పూర్తి కాలం పనిచేసిన మొదటి ముఖ్యమంత్రి.[3][4]
జననం, విద్యాభాస్యం
మార్చురఘుబర్ దాస్ 1955 మే 3న బీహార్‌లోని జంషెడ్‌పూర్‌లో జన్మించాడు. అతను భలుబాస హరిజన్ హైస్కూల్ నుండి మెట్రిక్యులేషన్, జంషెడ్‌పూర్ కోఆపరేటివ్ కాలేజీ నుండి బీఎస్సీ చేసిన తరువాత అదే కళాశాలలో న్యాయశాస్త్రం, ఎల్‌ఎల్‌బీ డిగ్రీని పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చురఘుబర్ దాస్ తన కళాశాల రోజుల్లో జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని ఉద్యమంలో చురుకుగా పాల్గొన్ని ఉద్యమ సమయంలో అరెస్టులు, జైలు శిక్షలు అనుభవించి, ఆ తర్వాత 1977లో జనతా పార్టీలో చేరాడు. దాస్ 1980లో ముంబైలో జరిగిన బీజేపీ జాతీయ కమిటీ ప్రారంభ సమావేశంలో పాల్గొన్న అతని అంకితభావం జంషెడ్‌పూర్‌లోని సీతారాందేరా యూనిట్‌కి చీఫ్‌గా నియమించబడటానికి దారితీసింది. ఆ తరువాత ఆర్ఎస్ఎస్ క్రియాశీల వాలంటీర్ చేరి ఆ తరువాత బీజేపీలో చేరి నగర ప్రధాన కార్యదర్శిగా, జంషెడ్‌పూర్ ఉపాధ్యక్షుడిగా, బిజెపి కార్యదర్శిగా, బిజెపి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.
రఘుబర్ దాస్ 1995లో జంషెడ్‌పూర్ తూర్పు నుండి బీహార్ శాసనసభ సభ్యునిగా ఎన్నికై , ఆ తరువాత అదే నియోజకవర్గం నుండి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2004లో జార్ఖండ్‌లో బీజేపీ చీఫ్‌గా నియమితులయ్యాడు. 2005లో ముఖ్యమంత్రి అర్జున్ ముండా నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.
రఘుబర్ దాస్ శిబు సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009 డిసెంబర్ 30 నుండి 2010 మే 29 వరకు జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేశాడు. దాస్ 2014 ఆగస్టు 16న బీజేపీ జాతీయ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యాడు. 2014లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించడంతో 2014 డిసెంబర్ 28న జార్ఖండ్ ఆరవ ముఖ్యమంత్రిగా, మొదటి గిరిజనేతర ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించాడు. అతను 2014 డిసెంబరు 28 నుంచి 2019 డిసెంబరు 28 వరకు పూర్తి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
రఘుబర్ దాస్ 2023 అక్టోబర్ 18న ఒడిషా రాష్ట్ర గవర్నర్‌గా నియమితుడై, ప్రస్తుతం అధికారంలో ఉన్నారు.[5][6]
మూలాలు
మార్చు- ↑ Majumdar, Pinaki (3 December 2014). "Das hopes to be lucky again". The Telegraph. Retrieved 21 October 2018.
- ↑ The Hindu (18 October 2023). "Raghubar Das appointed Governor of Odisha, Indrasena Reddy Nallu of Tripura". Archived from the original on 18 October 2023. Retrieved 18 October 2023.
- ↑ "Raghubar Das Becomes the First Jharkhand CM to Complete Term in Office Since Formation of State". News18. 1 November 2019. Retrieved 24 December 2019.
- ↑ "Raghubar Das(Bharatiya Janata Party(BJP)):Constituency- JAMSHEDPUR EAST(EAST SINGHBHUM ) – Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2020-08-12.
- ↑ Sakshi (20 October 2023). "రఘుబర్ దాస్". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
- ↑ Eenadu (20 October 2023). "గవర్నరుగా రఘుబర్ దాస్". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.