హేమంత్ సోరెన్
హేమంత్ సోరెన్ (జననం: 1975 ఆగస్టు 10) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు[1], ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దీనికి ముందు 2013 నుండి 2014 వరకు మొదటిసారి జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఇతను జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధ్యక్షుడు.[2][3][4]
హేమంత్ సోరెన్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 జులై 4 | |||
గవర్నరు | సీ.పీ. రాధాకృష్ణన్ | ||
---|---|---|---|
ముందు | చంపై సోరెన్ | ||
పదవీ కాలం 2019 డిసెంబరు 29 – 2024 ఫిబ్రవరి 2 | |||
ముందు | ద్రౌపది ముర్ము | ||
తరువాత | చంపై సోరెన్ | ||
పదవీ కాలం 2013 జులై 13 – 2014 డిసెంబరు 28 | |||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | రఘుబర్ దాస్ | ||
జార్ఖండ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు
| |||
పదవీ కాలం 2015 జనవరి 7 – 2019 డిసెంబరు 28 | |||
గవర్నరు | సయ్యద్ అహ్మద్ ద్రౌపది ముర్ము | ||
ముందు | అర్జున్ ముండా | ||
తరువాత | అమర్ కుమార్ బౌరి | ||
జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 2010 సెప్టెంబరు 11 – 18 జనవరి 2013 | |||
గవర్నరు | ఎం.ఓ.హెచ్. ఫరూక్ సయ్యద్ అహ్మద్ | ||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
జార్ఖండ్ శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 డిసెంబరు 23 | |||
ముందు | హేమలాల్ ముర్ము | ||
నియోజకవర్గం | బర్హైత్ | ||
పదవీ కాలం 2019 డిసెంబరు 23 – 2020 జనవరి 6 | |||
ముందు | లూయిస్ మరాండి | ||
తరువాత | బసంత్ సోరెన్ | ||
నియోజకవర్గం | దుమ్కా | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | స్టీఫెన్ మరాండి | ||
తరువాత | లూయిస్ మరాండి | ||
నియోజకవర్గం | దుమ్కా | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2009 జూన్ 24 – 2010 జులై 7 | |||
Constituency | జార్ఖండ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నెమారా, బీహార్, భారతదేశం (ప్రస్తుత జార్ఖండ్ ) | 1975 ఆగస్టు 10||
జాతీయత | రాజకీయ నాయకుడు | ||
రాజకీయ పార్టీ | జార్ఖండ్ ముక్తి మోర్చా | ||
తల్లిదండ్రులు | శిబు సోరెన్, రూపి సోరెన్ | ||
జీవిత భాగస్వామి | |||
సంతానం | 2 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
హేమంత్ సోరెన్‌ను జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి 2013 జులై 13 నుండి 2014 డిసెంబరు 28 వరకు పనిచేసారు. రెండవసారి ముఖ్యమంత్రిగా 2019 డిసెంబరు 29 నుండి పనిచేసే కాలంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు [5][6][7][8] అరెస్టు చేసిన తర్వాత 2024 జనవరి 31న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. తిరిగి హేమంత్ సోరెన్ 2024 జూన్ 28న బెయిలుపై బయటికి వచ్చి తిరిగి 2024 జులై 4న మూడవసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించి ప్రస్తుతం అధికారంలో కొనసాగుచున్నారు.[9]
తొలినాళ్ళ జీవితం
సోరెన్ బీహార్ రంగర్హ్ జిల్లాలోని నెమారా గ్రామంలో రూపీ, శిబు సోరెన్ ఆదివాసీ దంపతులకు[ఆధారం చూపాలి] జన్మించాడు. ఇతని తండ్రి శిబు సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇతనికి ఇద్దరు సోదరులు దుర్గా సోరెన్, బసంత్ సోరెన్ ఒక సోదరి అంజలి సోరెన్ ఉన్నారు. సోరెన్బీ హార్లోని పాట్నా హై స్కూల్ నుండి ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేసాడు. ఎన్నికలు కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం సోరెన్ మెకానికల్ ఇంజినీరింగ్ చదువు అసంపూర్ణంగా వదిలేసాడు.[10][11]
వృత్తి జీవితం
2009 జూన్ 4 నుండి 2010 జనవరి వరకు సోరెన్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. ఆ తరువాత 2013లో జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసాడు.[12]
ముఖ్యమంత్రి పదవి
రాజకీయ జీవితం
- 2009 - రాజ్యసభ సభ్యుడిగా హేమంత్ సోరెన్ తన రాజకీయ అరంగేట్రం చేసి 2009 జూన్ 24 నుండి 2010 జనవరి 4 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు.[14]
- 2010లో దుమ్కా నియోజకవర్గం నుంచి హేమంత్ సోరెన్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
- 2010 సెప్టెంబరు నుండి 2013 జనవరి వరకు జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
- 2013 జూలై 13 నుండి 2014 డిసెంబరు 28 వరకు జేఎంఎం - ఆర్జేడీ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
- 2014 ఎన్నికలలో రెండు స్థానాలు బర్హైత్, దుమ్కా నుండి పోటీ చేసి, బర్హైత్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, దుమ్కా లో ఓడిపోయాడు.
- ఆయన 2015 జనవరి 7 నుండి 2019 డిసెంబరు 28 వరకు జార్ఖండ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు.
- 2019 జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో రెండు స్థానాలు బర్హైత్, దుమ్కా నుండి పోటీ చేసి, రెండింటిలో గెలిచాడు.
- 2019 డిసెంబరు 29 నుండి 2024 ఫిబ్రవరి 2 వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
- భూ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతన్ని కస్టడీలోకి తీసుకునే ముందు హేమంత్ సోరెన్ 2024 ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు.
- 2024 జులై 4 నుండి మూడవసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[15]
- 2024 ఎన్నికలలో బర్హయిత్ నియోజకవర్గం నుండి 39,491 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గామ్లియెల్ హెంబ్రోమ్‌పై గెలిచాడు.[16]
భూ కుంభకోణం కేసు
హేమంత్ సోరెన్‌ను జార్ఖండ్‌లో భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు 2024 జనవరి 20న విచారించారు. ఈ క్రమంలోనే అతను తన ముఖ్యమంత్రి పదవికి 2024 జనవరి 31న రాజీనామా చేశాడు.[17] 2024 జూన్ 28న ఝార్ఖండ్ హై కోర్టు ఈ కేసులో అతనికి బెయిల్ మంజూరు చేసింది.[18][19]
మూలాలు
- ↑ Andhrajyothy (24 November 2024). "గిరిజన యోధుడు". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Hemant Soren becomes Jharkhand CM, heads 9th government in 13 years". The Times of India. 2013-07-13. ISSN 0971-8257. Retrieved 2024-09-21.
- ↑ Yadav, Anumeha (2013-07-13). "Hemant Soren becomes ninth Chief Minister of Jharkhand". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-06-18.
- ↑ 10TV (23 December 2019). "చిన్న వయస్సులోనే సీఎం…ఎవరీ హేమంత్ సోరెన్?". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Agencies, ENS (2024-07-03). "Champai Soren resigns as Jharkhand CM, Hemant stakes claim to form govt". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-07-03.
- ↑ "'Jharkhand Tiger' Champai Soren likely to take over as Chief Minister". indiatoday.in. 31 January 2024. Archived from the original on 31 January 2024. Retrieved 31 January 2024.
- ↑ "Champai Soren to be next Jharkhand CM as Hemant Soren faces arrest by ED". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-01-31. Archived from the original on 31 January 2024. Retrieved 2024-01-31.
- ↑ "Champai Soren Quits As Jharkhand Chief Minister, Paves Way For Hemant Soren". NDTV.com. Retrieved 2024-07-03.
- ↑ 9.0 9.1 Telugu, ntv (2024-08-18). "Champai Soren: జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీలోకి మాజీ సీఎం చంపై సోరెన్!". NTV Telugu. Retrieved 2024-09-21.
- ↑ "Wayback Machine". web.archive.org. 2014-02-22. Archived from the original on 2014-02-22. Retrieved 2021-06-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Meet Hemant Soren, the new Chief Minister of Jharkhand". Biharprabha News | Connecting Bihar with the entire World. Retrieved 2021-06-18.
- ↑ "Hemant Soren Biography - About family, political life, awards won, history". Elections in India. Archived from the original on 2021-05-11. Retrieved 2021-06-18.
- ↑ "Hemant Soren to be sworn in as Jharkhand CM on December 29". Jagran English. 2019-12-24. Retrieved 2021-06-18.
- ↑ "Who is Hemant Soren?". 2024. Archived from the original on 28 June 2024. Retrieved 28 June 2024.
- ↑ Sakshi (4 July 2024). "జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్". Archived from the original on 6 July 2024. Retrieved 6 July 2024.
- ↑ Election Commision of India (23 November 2024). "Jharkhand Assembly Election Results 2024 - Barhait". Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.
- ↑ A. B. P. Desam (31 January 2024). "హేమంత్ సోరెన్ రాజీనామా! ఝార్ఖండ్ సీఎంగా ఆ మంత్రికి లక్కీ ఛాన్స్". Archived from the original on 31 January 2024. Retrieved 31 January 2024.
- ↑ "Former Jharkhand Chief Minister Hemant Soren gets bail". The Hindu (in ఇంగ్లీష్). 2024-06-28. Retrieved 2024-06-28.
- ↑ NT News (28 June 2024). "జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ విడుదల". Archived from the original on 28 June 2024. Retrieved 28 June 2024.