అమీన్ మంజిల్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సైదాబాద్ లో ఉన్న చారిత్రక భవనం.

అమీన్ మంజిల్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సికింద్రాబాద్ సమీపంలో ఉన్న చారిత్రక భవనం.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది. అయితే, ఈ భవనం విషయంలో ఇద్దరు సోదరుల మధ్య వివాదాలు రావడంతో 2018లో ఈ భవనం కూల్చివేయబడింది.[2]

అమీన్ మంజిల్
సాధారణ సమాచారం
రకంరాజభవనం
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ
Demolished2018

చరిత్ర

మార్చు

నిజాం కాలంలో హైదరాబాద్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేసిన నవాబ్ సర్ అహ్మద్ హుస్సేన్ అమిన్ జంగ్ బహదూర్ పేరును ఈ భవనానికి పెట్టారు. 1895లో మద్రాసు నుండి వచ్చిన అమీన్, మొదట్లో హైదరాబాద్‌ నిజాం ఆఫీసులో సహాయ కార్యదర్శిగా నియమించబడ్డాడు. కొంతకాలం తరువాత సైదాబాద్ నిజాం దగ్గర ప్రధాన కార్యదర్శిగా చేరాడు. పుస్తకాల పట్ల ప్రేమవున్న కారణంగా అమీన్, హైదరాబాద్‌లోని అధికారుల నుండి వేరు చేయబడ్డాడు. సైదాబాద్ వద్ద ఉన్న అమీన్ మంజిల్ భవనంలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశాడు. ఈ భవనం వరండాలపై భారతీయ, పాశ్చాత్య శైలులతో కూడిన ఆసక్తికరమైన వాల్ట్ రూఫ్‌లు ఉన్నాయి.

భారతీయ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి అనేక ముఖ్య వ్యక్తులు ఆ భవనానికి విచ్చేసి ఆతిథ్యం స్వీకరించారు. 1980లలో నిజాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనవళ్ళు ఈ భవనాన్ని వేరొకరికి విక్రయించారు. భవనంలోని విలువైన పుస్తకాలు హిమాయత్‌నగర్ ఉర్దూ లైబ్రరీకి అందించబడ్డాయి.

కూల్చివేత

మార్చు

ఒక ఐపిఎస్ అధికారికి ఈ భవనాన్ని ఆక్రమించాలనుకున్నాడు. చట్టపరమైన వివాదాల తరువాత అది అమీన్ జంగ్ వారసుల వద్దకు తిరిగి వచ్చింది. చాలా సంవత్సరాలు ఖాళీగా ఉన్న భవన మొత్తం నిర్మాణాన్ని కూల్చివేయడానికి దాదాపు ఒక నెల పట్టింది.[3]

మూలాలు

మార్చు
  1. Jun 30, TNN / Updated:; 2019; Ist, 11:28. "Hyderabad's heritage cover: An in-depth look | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-21. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. "Hyderabad: Another heritage building Ameen Manzil demolished". Deccan Chronicle. 22 August 2018. Retrieved 2021-08-21.
  3. parasa, Rajeswari (2018-08-22). "Hyderabad: Another heritage building Ameen Manzil demolished". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-08-21.

బయటి లింకులు

మార్చు