అమెరికాలోని ఆమిష్ ప్రజల జీవన విధానం

ఆమిష్ ప్రజల జీవన విధానం

అమెరికా అంటే నవ నాగరికతకు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి మారు పేరు. అలాంటి నవ నాగరిక జనాల మద్యన అలాంటి నవ నాగరికథ, నిత్య నూతన సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా, నూతన సాంకేతిక ఆవిష్కరణలకు దూరంగా అవంటే గిట్టని వారు ఉన్నారు. వారే ఆమిష్ ప్రజలు. అమెరికా లోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఆమిష్ అనే గ్రామములో నివసించే ప్రజలే వారు.[1]

ఆమిష్ ప్రాంతం

ఎవరీ ఆమిష్ ప్రజలు?

మార్చు

ఐరోపాలో 16వ శాతాబ్దంలో ఏర్పడిన ప్రొటెస్టెంట్ ఉద్యమం వల్ల మత సంబందమైన తెగలు చాల ఏర్పడ్డాయి. చిన్నప్పుడే బాప్టిజం తీసుకోవడాన్ని వ్వతికేరించిన వర్గీయులు అనబాప్టిస్టులుగా వేరు పడ్డారు. వీరు బాప్టిస్టులుగా పుట్టినప్పటికి వయస్సులో కొంత ఎదిగాక ఇష్ట పూర్వకంగా మాత్రమే బాప్టిజాన్ని స్వీకరించాలనేది వీరి సిద్ధాంతము. వీరు అడల్ట్ బాప్టిజాన్ని మాతమే నమ్ముతారు. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లోని అల్సాన్, ప్రాంతాలకు చెందిన అనబాప్టిస్టుల వర్గానికి జాకాబ్ అమ్యాన్ నేతృత్వము వహించేవారు. ఆవిధంగా వారంతా ఆమిష్ వర్గంగా పేరు బడ్డారు. అక్కడి ప్రభుత్వాలు ఈ వర్గ ప్రజలను చిన్నచూపు చూడడము, ప్రభుత్వ పాలనలోను, రక్షకదళములోను వీరిని పలు నిషేధాలకు గురి చేయడము వలన ఆమిష్ ప్రజలు 18వ శతాబ్దంలో ఇతర దేశాలకు వలస బాట పట్టారు. అలా వీరు అమెరికాకు కెనాడాకు వచ్చి స్థిరపడ్డారు. ఈ ఇరు దేశాలలో వీరి జనాభా సుమారు మూడు లక్షలు. ఆ విధంగా వీరు శతాబ్ధాల నాటి తమ జీవన విధానాన్ని నాగరికథను కాపాడుకుంటూ, తమ చుట్టూ వున్న ప్రజలు నవ నాగరికథతో, నూతనసాంకేతిక పరిజ్ఞాన పరికరాలతో అభివృద్ధి చెందుచున్నా.... అవేమి పట్టించుకోకుండా తమ చుట్టూ ఒక పరిధిని నిర్మించుకొనొ అందులోనే నివసిస్తూ ఇతరులతో కలవకుండా, ఆనాటి తమజీవన విధాన్ని పరిరక్షించు కుంటున్నారు. వీరు అమెరికాలోని పెన్సిల్వేనియా, ఓహియో, ఇండియానా, ఇల్లినాయిస, మిస్సోరి రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నారు.

ఆధునిక పరికరాలు నిషిద్ధం

మార్చు

ఆమిష్ ప్రజల జీవన విధానము ఎంతో వైవిధ్యమైనది. వీరు బాహ్య ప్రపంచముతో అనవసర సంబంధాలను కొనసాగించరు. నిత్య నూతన సాంకేతిక పరిజ్ఞానావిష్కరాలైన గ్యాస్ స్టవ్ లూ, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ పోన్లు, టెలిఫోన్లు, కార్లూ, బైకులు, ట్రాక్టర్లు వంటివన్ని వీరి జీవన విధానములో నిషిద్దం. ఎటువంటి ఆడంబరాలు లేకుండా పరిమితమైన సౌకర్యాలతో ప్రశాంతంగా వీరు జీవనము గడిపేస్తుంటారు.

కుటుంబ వ్వవస్థ

మార్చు

వీరి కుటుంబ వ్వవస్థ చాల పటిష్ఠమైనది. ప్రతి కుటుంబంలోను మూడు తరాల వారు కలిసి ఉంటారు. పిల్లల సంరక్షణ ప్రధానంగా తల్లిదే. వ్వవసాయ పనులు, బయటి పనులు, ఇళ్ళ నిర్మాణము, దుకాణాలు నిర్వహణ, వంటివి పురుషులు నిర్వహిస్తారు. పదహారు సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తమ జీవిత భాగస్వామిని తామేనిర్ణయించు కుంటారు. విడాకులకు అమిష్ ప్రజలు పూర్తిగా వ్వతిరేకము. పరిష్కారల కొరకు కోర్టులను ఆశ్రయించరు. ఎవరైనా తప్పుచేస్తే... వారితో మరెవరూ మాట్లాడారు. కాని వారు తమ తప్పు తెలుసుకొని క్షమాపణ కోరితే చేరదీస్తారు. కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు వంటివి అసలు వుండవు. వీరి ఇళ్లు కూడా కొంత వైవిధ్యంగా వుంటాయి. ఇళ్లు పెద్దవిగా వున్నా అందులో ఆడంబరమైన అలంకరణ ఏమాత్రము వుండదు. వీరి ఇళ్లన్నీ ఎక్కువగా తెలుపు, పచ్చ, నీలం, మట్టి రంగులో మాత్రమే వుంటాయి. పదహారేళ్ల వయస్సు వచ్చిన పిల్లలను స్వతంత్రంగా జీవించడానికి అనుమతినిస్తారు. అలాంటి వారు ఐదు సంవత్సరాలు పాటు గ్రామాన్ని వదిలి బయటి ప్రపంచంలోకి వెళ్లి జీవించ వచ్చు. అక్కడి జీవనము నచ్చితే అక్కడికే వెళ్ళి పోవచ్చు. కాని ఎవరూ ఆధునిక ప్రపంచంలో జీవించడానికి ఇష్టపడరు. దుస్తుల విషయములో వీరు చాల కచ్చితంగా వుంటారు. వస్త్ర ధారణ సాధారణంగా వుంటుంది. వీరు ఒకే రంగు బట్టలు వాడుతారు. అవి నలుపు, తెలుపు, ఆకుపచ్చ, ముదురు గోదుమరంగువై వుంటారు. ఎవరైనా వేరే రంగు దుస్తులు వాడితే వారిని నిర్మొహమాటంగా వెలి వెస్తారు. కుటుంబానికి కావలసిన బట్టలన్నీ ఇంటి ఇల్లాలే కుడుతుంది.

వ్వవసాయం

మార్చు

ఆమిష్ ప్రజల ప్రధాన వృత్తి వ్వవసాయమే. గోదుమ, బార్లీ, సోయా, మొక్కజొన్న, పొగాకు, పశుగ్రాసము మొదలగు నవి వీరి ప్రధాన పంటలు., వ్వవసాయానికి, ఇతర రవాణ కొరకు, గుర్రాలను, గుర్రపు బండ్లను మాత్రమే వాడుతారు. అంతే కాని ఆధునిక పరికరాలను, యంత్రాలను వాడరు. పైర్లకు రసాయిన ఎరువులను వాడరు. వ్వవసాయ పనిముట్లను ఒకరికొకరు ఉచితముగా ఇచ్చి పుచ్చుకుంటారు. అవసరమైన పనులలో ఒకరికొకరు సహాయము చేసుకోవడము పౌరులందరూ తమ బాధ్యతగా భావిస్తారు. పెళ్ళైన వారు ఇంటి పనులు, వ్వవసాయ పనులకు బాధ్యత వహిస్తారు. వయస్సు మళ్ళిన తల్లి తండ్రులకు పనులనుండి విశ్రాంతి నిస్తారు. తమతోనే కలిసి జీవించేలా చూస్తారు.

విద్య

మార్చు

ఆమిష్ ప్రజలకు విద్య అనేది అంత ప్రధానమైన విషయము కాదు. వీరిలో పెద్ద చదువు అంటే ఎనిమిదవ తరగతి వరకే. స్కూళ్లలో ఎక్కువగా పెళ్ళి కాని యువతులే టీచర్లుగా వుంటారు. పాఠశాలలో ప్రధానంగా జర్మిన్ భాషనే భోదిస్తారు. వ్యాపార లావాదేవీల కొరకు గణితము, కొద్దిపాటి ఇంగ్లీషు నేర్చుకుంటారు. దానితో పాటు చేతి వృత్తులైన ఇళ్ల నిర్మాణము, వడ్రంగము, వంటి పనులలో శిక్షణ ఇస్తారు. వాటితోబాటు, బుట్టలు, టోపీలు అల్లడము నేర్పిస్తారు. ఇతరులకు సహాయము చేయడము, ఆధ్యాత్మిక చింతన, వంటివే స్కూళ్లలోనే నేర్పిస్తారు. విద్యార్థులు, టీచర్లూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అభిమానముగా వుంటారు.

వివాహం

మార్చు

వీరి విహావ పద్ధతి కూడా భిన్నమే. ఆబ్బాయి ముందుగా చర్చి పెద్దలకు తన కోరికను తెలియజేస్తాడు. ఆ తర్వాత చర్చి పెద్దలు అమ్మాయి తల్లి దండ్రుల అనుమతి తీసుకొంటారు. పెళ్ళికి ఆహ్వాన పత్రికలు వంటివి వుండవు. అబ్బాయి స్వయంగా బందు మిత్రులను ఆహ్వానిస్తాడు. పెళ్ళి తంతు సాదా సీదాగా వుంటుంది. వధువు వివాహ సమయంలో తెల్లని యాప్రాన్, టోఫి ధరిస్తుంది. ఆ పెళ్ళి దుస్తులు వధువు తన జీవిత కాలములో ఎప్పుడూ ధరించదు. కాని ఆ దుస్తులు ఆమె మరణాంతరము ఆమె పార్థివ దేహంపై కప్పడానికి మాత్రమే వాడతారు. కొత్త దంపతులు హనీమూన్ కి వెళ్ళవచ్చు. కాని అది తమ ఆత్మీయ బందుమిత్రుల ఇళ్లకే పరిమితం. అక్కడ వారికి విందు భోజనాలు ఏర్పాట్లే కాక దంపతుల కుటుంబానికి కావలసిన వస్తు సామాగ్రిని బహుమతిగా ఇస్తారు.

ఆధ్యాత్మికం

మార్చు

ఆమిష్ ప్రజలకు ప్రత్యేకమైన ప్రార్థనా మందిరాలుండవు. తమ తమ ఇళ్లలోనే దైవ ప్రార్థన చేయడము వీరి ఆచారము. ఇంటిలోని దానికొరకు ఒక గదిని కేటాయిస్తారు. అలాంటి అవకాశము లేని వారు బయట గడ్డివాముల క్రిందనో, గోదాములలోనే ప్రార్థన చేసుకుంటారు. దైవ ప్రార్థన ఎక్కడైనా చేయవచ్చు ననేది వీరి నమ్మకము. అందు కొరకు డబ్బు వెచ్చించి పెద్ద భవనాలు నిర్మించడము అనవసరమని వీరి భావన. ప్రతి కుటుంబం నుండి ఒకరు ఒక ఏడాది పాటు బిషప్ గా వ్వహరిస్తారు. ఆ విధంగా ప్రతి కుటుంబానికి మత పెద్దగా వ్వవహరించే అవకాశము కల్పిస్తారు. ఆదివారం విడచి ఆదివారు వీరు దైవ ప్రార్థనలు చేస్తారు.

అంతిమ యాత్ర

మార్చు

ఆమిష్ ప్రజలు తమలో వివాహానికి ఎంత ప్రధాన్యత నిస్తారో తమలో ఎవరైనా చనిపోతే వారి అంత్య క్రియలకు కూడా అంతే ప్రధాన్యత ఇస్తారు. ఆడవాళ్లకు వాళ్ల పెళ్ళి దుస్తులనూ, మగవాళ్లకు తెల్లని దుస్తులనూ ధరింప జేస్తారు. చని పోయిన వారి ఇళ్లలోనే మూడు రోజులు సంతాప దినాలుగా ప్రార్థనలు జరిపి చివరన శవ పేటికలను శ్మశాన వాటికకు ప్రత్యేక గుర్రపు బండిలో తరలించి అంత్య క్రియలను నిర్వహిస్తారు. మిగతా బందుమిత్రులు సాధారణ గుర్రపు బళ్లలో వరుసగా ఒక క్రమ పద్ధతిలో వెళతారు. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలన్నదే వీరి ప్రగాడ విశ్వాసము.

అమెరికా వంటి అత్యాధునికమైన, నవ నాగరికథను కలిగిన దేశములో నివసిస్తూ కూడా తమదైన ఒక పురాతన నాగరికథను వీడకుండా దానిని అతి జాగ్రత్తగా కాపాడుకొంటూ జీవనాన్ని సాగిస్తున్న ఆమిష్ ప్రజల వైవిధ్యమైన జీవన విధానము ఎంతో ఆశ్చ్యర్యాన్ని కలిగిస్తుంది.

మూలాలు

మార్చు
  1. శ్రీమతి డి., చంద్ర (27 డిసెంబరు 2015). "ఈనాడు ఆదివారము". ఈనాడు ఆదివారము. 27 డిసెంబరు 2015: 25.