అమ్మనా కోడలా

(అమ్మనాకోడలా నుండి దారిమార్పు చెందింది)

ఆమ్మ నా కోడలా తెలుగు చలన చిత్రం,1995 ఫిబ్రవరి 14 న విడుదల.సాగర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, సౌందర్య, వాణీశ్రీ మొదలగు వారు నటించారు.

అమ్మనా కోడలా
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం సాగర్
తారాగణం వినోద్,
సౌందర్య,
వాణిశ్రీ
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ సుజాత ఆర్ట్స్
భాష తెలుగు
సాగర్

నటీనటులు

మార్చు
  • వాణిశ్రీ
  • వినోద్ కుమార్
  • సౌందర్య
  • చంద్రమోహన్
  • గిరిబాబు
  • ఆలీ
  • గాయత్రి
  • చలపతిరావు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: సాగర్

నిర్మాతలు: ఎస్.చంద్రశేఖర్ , ఎం.వెంకటేశ్వరరావు

సాహిత్యం:సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సింధు, స్వర్ణలత, కె.జె.ఏసుదాస్ .

సంక్షిప్త సినిమా కథ

మార్చు

చక్రధర్ (కృష్ణ), తన చెల్లెలితో పాటు మరో ఇద్దర్ని హత్య చేసిన నేరమ్మీద జైలుకెల్లడంతొ కథ మొదలవుతుంది. శిక్ష పూర్తయి, విడుదలై వస్తుండగా సౌందర్య కలిసి అతనితో పాటు కోటిపల్లి వెళుతుంది. అక్కడ రఛ్ఛబండ దగ్గర తనను అన్యాయంగా జైలుకు పంపిన నలుగురు విలన్లనీ ఇప్పుడు హత్య చేసి తప్పించుకుంటానని చెబుతాడు కృష్ణ. అక్కడి ఇన్స్పెక్టర్ చరణ్ రాజ్ కృష్ణ మిత్రుడే కానీ కర్తవ్య బధ్ధుడు. ఒక విలన్ కూతురు కృష్ణ మరదలు, ఆమని. ఇక రెండు హత్యలు చేస్తాడు కృష్ణ. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి కథానాయిక సౌందర్య ఆశ్ఛర్య పరుస్తుంది. ఇక రెండో భాగంలో కృష్ణ గతం వివరించడంతో సౌందర్య నిజం తెలుసుకుంటుంది. తన అన్నను చంపింది కృష్ణ కాదని. గతం లోనూ ఆమనికి పోటీగా ఇంద్రజ ఉందని... చరణ్ రాజ్ నుండి కృష్ణని కాపాడడంలో ఇద్దరు కథానాయికలూ పోటీ పడతారు. కృష్ణ తన శపథం నిలబెట్టుకుంటాడు. పగ, ప్రతీకారం కథలో ముగ్గురమ్మాయిల మధ్య కృష్ణ దాగుడు మూతలు, చచ్చిపోయిన ముగ్గురు విలన్లూ దయ్యాలై చేసే హాస్యమూ సినిమాని రక్తి కట్టంచాయి...

పాటల జాబితా

మార్చు

1.ఊగుతున్నదే తూనీగలే నీ నడుము , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, సింధు

2ఓసి పిల్లదానా మల్లెతోట కాడ, రచన: సిరివెన్నెల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

3.కూ కుక్కు కుక్కు కూ కోకిలమ్మ పాడింది , రచన: సిరివెన్నెల, గానం.కె ఎస్ చిత్ర బృందం

4.గోరంత దీపం కొండంత వెలుగు , రచన: సిరివెన్నెల, గానం.స్వర్ణలత, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

5. ఝుo చకణక ఝుo ఝుo చకనక, రచన:సిరివెన్నెల, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం

6.ఏ న్యాయస్థానం తేల్చాలి ఏ ధర్మశాస్త్రం చెప్పాలి, రచన: సిరివెన్నెల, గానం.కె.జె.ఏసుదాస్ కోరస్ .


మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.