అమ్మోనియం హైడ్రాక్సైడ్

అమ్మోనియం హైడ్రాక్సైడ్ లేదా అమ్మోనియా ద్రావణం ఒక రసాయనిక సమ్మేళన ద్రావణం. అమ్మోనియం హైడ్రాక్సైడ్ ను ఇంకా అమ్మోనియా వాటర్, అమ్మోనికల్ లిక్వర్, ఆక్వా అమ్మోనియా, అక్వియాస్ అమ్మోనియా అనికూడా వ్యవహరిస్తారు.

అమ్మోనియం హైడ్రాక్సైడ్
Ball-and-stick model of the ammonia molecule
Ball-and-stick model of the ammonia molecule
Ball-and-stick model of the water molecule
Ball-and-stick model of the water molecule
Ball-and-stick model of the ammonium cation
Ball-and-stick model of the ammonium cation
Ball-and-stick model of the hydroxide anion
Ball-and-stick model of the hydroxide anion
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [1336-21-6]
కెగ్ C01358
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:18219
SMILES [OH-].[NH4+]
ధర్మములు
NH5O
మోలార్ ద్రవ్యరాశి 35.04 g/mol
స్వరూపం Colourless liquid
వాసన "Fishy", highly pungent
సాంద్రత 0.91 g/cm3 (25 %)
0.88 g/cm3 (32 %)
ద్రవీభవన స్థానం −57.5 °C (−71.5 °F; 215.7 K) (25%)
−91.5 °C (32%)
బాష్పీభవన స్థానం 37.7 °C (99.9 °F; 310.8 K) (25%)
24.7 °C (32%)
Miscible
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−80 kJ·mol−1[2]
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
111 J·mol−1·K−1[2]
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R34, R50
S-పదబంధాలు (S1/2), S26, S36/37/39, S45, S61
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Tetramethylammonium hydroxide
సంబంధిత సమ్మేళనాలు
Ammonia
Hydroxylamine
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక గుణగణాలు

మార్చు

అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనునది నీటిలో కరిగిన అమ్మోనియా కలిగిన ద్రావణం. దీనిని రసాయనికంగా NH3 (aq). పదంతో సూచించడం జరుగుతుంది. అమ్మోనియం హైడ్రాక్సైడ్అనుపదం క్షార సమ్మేళన మని సూచించినప్పటికీ ద్రావణం నుండి NH4OH, అయానులు గుర్తించ స్థాయిలో కనిపించవు, అతి ఎక్కువ సజల ద్రావణంలో తప్ప. ఇది ఘాటైన వాసన కలిగి ఉంది. నీటిలో కలుస్తుంది. ద్రవీభవన స్థాన౦ −57.5 °C (−71.5 °F; 215.7 K) (25%).సాంద్రత 0.91 g/cm3 (25 %) లేదాం.88 g/cm3 (32 %).

నీటిలో అమ్మోనియా క్షారతత్వం

మార్చు

సజల ద్రావణంలో అమ్మోనియా నీటిని deprotonate చేయడంవలన కొద్ది ప్రమాణంలో ద్రావణంలో అమ్మోనియా, హైడ్రాక్సైడ్ అయానులను ఏర్పరచును.

NH3 + H2O NH4+ + OH−.

1M (M=మొలాలిటి) అమ్మోనియా సోల్యుసన్ లో 0.42% అమ్మోనియాగా పరివర్తించబడును.ఇది 11.63 pHద్రావణానికి తుల్యం. దీని యొక్క క్షార అయానికరణ స్థిరాంకం

Kb = [NH4+][OH−]/[NH3] = 1.8×10−5

అమ్మోనియం హైడ్రాక్సైడ్ సంతృప్త ద్రావణాలు

మార్చు

మిగతా వాయువుల వలె ద్రావణుల ఉష్ణోగ్రత పెరిగే కొలది అందులో వాయువుల ద్రావణియతశాతం తగ్గిన విధంగానే, ద్రావణుల ఉష్ణోగ్రత పెరిగే కొలదివాటిలో అమ్మోనియా హైడ్రోక్సైడ్ ద్రావనియత శాతం తగ్గుతూ వస్తుంది. అలాగే అమ్మోనియా గాఢత పెరిగే కొలది అమ్మోనియా ద్రావణిసాంద్రత తగ్గుతూ వస్తుంది. 15.6 °C (60.1 °F) వద్ద అమ్మోనియా అమ్మోనియా సాంద్రత 0.88 గ్రాములు/మీ.లీ ఉన్నప్పుడు, ఆ ద్రావణిలో కరిగి ఉన్న అమ్మోనియాశాతం 35%/భారంప్రకారం, (అనగా308 గ్రాములు అమ్మోనియా ఒక లీటరుద్రావణంలో), ద్రావణంయొక్క మోలారిటి 18 M/లీ−1ఉష్ణోగ్రత పెరిగే కొలది సంతృప్త అమ్మోనియా ద్రావణం మోలారిటి తగ్గుతుంది, సాంద్రత పెరుగుతుంది.

ఉపయోగాలు

మార్చు

అమ్మోనియా ద్రావణాన్ని గృహపరికారాలను శుభ్ర పరచు ద్రవాలలో కలిపివాడెదరు. లేదా నీటిలో కలిపినా అమ్మోనియం హైడ్రాక్సైడును నేరుగా శుద్ధికరణకారక ద్రవంగా అమ్మెదరు.పరిశ్రమలలో అల్కైల్అమైన్స్ (alkyl amines) తయారు చెయ్యుటకు అమ్మోనియా ద్రావణాన్ని పుర్వగామి (precursor ) గా ఉపయోగిస్తారు.

గృహోపకరణవస్తువుల తయారీలో టాన్నిక్ఆమ్లంకలిగినచెక్క /దారువుకుకు చిక్కనిముదురు రంగు వచ్చేలా చెయ్యుటకు అమ్మోనియం హైడ్రాక్సైడ్ను ఉపయోగిస్తారు. ఆహార పదార్థాల తయారీలో, వాటిని పులియ బెట్టు కారకంగా,, ఆమ్లత్వ నియంత్రకంగా అమ్మోనియం హైడ్రాక్సైడ్ఉపయోగిస్తారు.pH నియంత్రించు గుణం కలిగి ఉన్నకారణంగా దీనిని సూక్ష్మజీవనాశక, సూక్ష్మజీవ నిరోధకకారకంగా ఉపయోగిస్తారు.

అమ్మోనియం హైడ్రాక్సైడ్ను పొగాకు పరిశ్రమలో ఆకునకు ప్రత్యేక సువాసన ఇచ్చుటకై చేర్చెదరు.పశువుల దాణాగా వాడు ఎండుగడ్డికి అమ్మోనియా హైడ్రాక్సైడ్ ను చేర్చి ammoniated strawను తయారు చేసి పశువుల దాణాగా వాడుదురు.

ప్రయోగ/పరిశోధన శాలలలో

మార్చు

ప్రయోగ, పరిశోధన శాలలో సజల అమ్మోనియాను ఆకర్బన రసాయన పదార్థగుణాత్మక విశ్లేషణ (qualitative inorganic analysis) లలో ఉపయోగిస్తారు. ప్రయోగశాలలో దీనిని complexantగా, క్షారముగాఉపయోగిస్తారు. చాలా అమైన్సువలే కాపర్ (II) ద్రావనులతోముదురు/గాఢనీలి రంగును కలిగించును. సిల్వర్ ఆక్సైడ్ అవశేషాలను అమ్మోనియా ద్రావణం కరిగిస్తుంది. కాపర్+2 (Cu2+) వంటి లోహ అయాను సమక్షంలో, అమ్మోనియం హైడ్రాక్సైడ్ను హైడ్రోజన్ పెరాక్సైడ్ నకు కలిపినా వెంటనే, వేగంగా పెరాక్సైడ్ వియోగం చెందును.

మూలాలు

మార్చు
  1. Record of Ammonia solution in the GESTIS Substance Database of the Institute for Occupational Safety and Health
  2. 2.0 2.1 Zumdahl, Steven S. (2009). Chemical Principles 6th Ed. Houghton Mifflin Company. p. A22. ISBN 0-618-94690-X.
  3. Ammónium-hidroxid (ESIS) [dead link]