అమ్రా రామ్
అమ్రా రామ్ (జననం 5 ఆగస్టు 1955) రాజస్థాన్‌కు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సికర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
అమ్రా రామ్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | స్వామి సుమేదానంద సరస్వతి | ||
---|---|---|---|
నియోజకవర్గం | సికర్ | ||
అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 2013 – 2017 | |||
ముందు | ఎస్. రామచంద్రన్ పిళ్లై | ||
తరువాత | అశోక్ ధావలే | ||
పదవీ కాలం 1993 – 2008 | |||
ముందు | రామ్‌దేవ్ సింగ్ | ||
తరువాత | పేమా రామ్ | ||
నియోజకవర్గం | ధోడ్ | ||
పదవీ కాలం 2008 – 2013 | |||
ముందు | నారాయణ్ సింగ్ | ||
తరువాత | నారాయణ్ సింగ్ | ||
నియోజకవర్గం | దంతా రామ్‌గఢ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ముండ్వారా, సికర్, రాజస్థాన్, భారతదేశం | 1955 ఆగస్టు 5||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | సీపీఎం | ||
తల్లిదండ్రులు | దల్లా రామ్, రామి దేవి | ||
జీవిత భాగస్వామి | సోహాని దేవి | ||
పూర్వ విద్యార్థి | శ్రీ కళ్యాణ్ ప్రభుత్వ కళాశాల, రాజస్థాన్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు & రైతు నాయకుడు | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చుఅమ్రారామ్ 1979లో సికార్‌లోని ప్రభుత్వ శ్రీ కళ్యాణ్ కళాశాల నుండి విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత 1983 నుండి 1993 వరకు రెండుసార్లు ముండ్వారా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పని చేసి 1993, 1998, 2003లో శాసనసభ ఎన్నికలలో ధోడ్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ధోడ్ నియోజకవర్గం రిజర్వ్ అయినందున ఆయన 2008లో దంతా రామ్‌గఢ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి నాలుగోసారి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో దంతా రామ్‌గఢ్ నియోజకవర్గం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అమ్రారామ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సికర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ The Times of India (5 June 2024). "Rajasthan Lok Sabha Election Results 2024: Full and final list of winners including Om Birla, Gajendra Singh Shekhawat, Rajkumar Roat and more". Archived from the original on 12 September 2024. Retrieved 12 September 2024.
- ↑ The Indian Express (4 June 2024). "Lok Sabha Elections 2024 Results: Full List of winners on all 543 seats" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ TimelineDaily (5 June 2024). "Firebrand Farmers' Leader Amra Ram: CPI(M)'s Lone Winner From North" (in ఇంగ్లీష్).
- ↑ India Today (13 July 2024). "Farmer leaders | A harvest of ambitions" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.