అయస్కాంత పర్మియబిలిటీ
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఒక కడ్డీని అయస్కాంత క్షేత్రంలోఉంచితే, ఆ కడ్డీ అయస్కాంత ప్రేరణ వల్ల అయస్కాంత ధర్మాలను పొందుతుంది. క్షేత్రబలరేఖలు కడ్డీలో ప్రవశించే కొన దక్షిణధ్రువంగాను, బలరేఖలు కడ్డీనుంచి బహిర్గతమయ్యేకొన ఉత్తర ధ్రువం గాను ఏర్పడతాయి. కడ్డీలో ప్రవేశించే బలరేఖలు, కడ్డీ చేయడానికి ఉపయోగించిన పదార్థంపైన ఆధారపడి ఉంటాయి. అది ఎక్కువ అయస్కాంత ధర్మాలు ఉన్న పదార్ధమైతే ఎక్కువ బలరేఖలు, తక్కువ అయస్కాంత ధర్మాలు వున్న పదార్ధమైతే తక్కువ బల రేఖలు కడ్డీద్వారా పోతాయి.[1] ఈ ధర్మాన్నే అయస్కాంత పర్మియబిలిటీ అంటారు.
నిర్వచనము
మార్చుప్రమాణ వైశాల్యమున్న పదార్థంలో నుంచి పోయే బలరేఖలకు, పదార్ధానికి బదులు ప్రమాణవైశాల్యమున్న శూన్య ప్రదేశంలోనుంచి పోయే బలరేఖలకు ఉన్న నిష్పత్తిని అయస్కాంత పర్మియబిలిటీ అంటారు. దీనినే క్రింది రీతిలో నిర్వచించవచ్చు. శూన్యప్రదేశంలో కొంతదూరంలో ఉన్న రెండు ధ్రువాలమధ్య ఉండే అయస్కాంత బలంనకు, ఒక పదార్థంలో అదే దూరంలో ఉంచిన ఆ రెండు ధ్రువాలమధ్య వుండే అయస్కాంత బలానికివున్న నిష్పత్తిని ఆ పదార్థం అయస్కాంత పర్మియబిలిటీ అంటారు.
M . K . S . ప్రమాణపద్ధతిలో అయస్కాంత పర్మియబిలిటీ
- = శూన్యప్రదేశంలో అయస్కాంత పర్మియబిలిటీ
- = సాపేక్ష పర్మియబిలిటీ.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చు- [1][permanent dead link] THE THEORY OF THE DISPERSION OF MAGNETIC
PERMEABILITY IN FERROMAGNETIC BODIES]
మూలాలు
మార్చు- ↑ ద్రవ్య ఆయస్కాంత ధర్మాలు, పేజీ 168, తెలుగు అకాడెమీ స్థిర విద్యుత్ శాస్త్రము - ద్రవ్య అయస్కాంత ధర్మాలు