అయస్కాంత ప్రేరణ

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

సాంకేతిక పదాలు

మార్చు
  • magnetic induction = అయస్కాంత ప్రేరణ; చుంబక ప్రతిస్పందన;
  • magnetic flux = అయస్కాంత ప్రవాహం; అయస్కాంత అభివాహం;
  • magnetic suscceptibility =
  • permeability =
  • line of force =

ఉపోద్ఘాతం

మార్చు

ఒక ఇనుప కడ్డీని అయస్కాంత క్షేత్రంలో వుంచితే, అది అయస్కాంత ప్రేరణ వల్ల అయస్కాంత ధర్మాలను పొందుతుంది. కడ్డీలో అయస్కాంత బలరేఖలు ప్రవేశించే కొనవద్ద దక్షిణ ధ్రువము, అయస్కాంత బలరేఖలు బహిర్గతమయ్యే కొనవద్ద ఉత్తర ధ్రువము ఏర్పడతాయి. కడ్డీ అయస్కాంత ధర్మాలను పొందటంవల్ల, కడ్డీ బయట బలరేఖలు ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి, కడ్డీ లోపల బలరేఖలు దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువానికి ఏర్పడతాయి. కడ్డీ లోపల ఇట్లు ఏర్పడిన బలరేఖలను బిందురేఖలుగా సూచించినారు. ఇవి కాగా కడ్డీ ద్వారా బాహ్యాయస్కాంత క్షేత్ర బలరేఖలు కూడా పోతూవుంటాయి.

 
బల్పులో అయస్కాంత ఇండక్క్షన్

కనుక, కడ్డీ లోపల కడ్డీ అయస్కాంత తత్వము పొందటంవల్ల ఏర్పడిన బలరేఖలు, బాహ్య అయస్కాంత క్షేత్ర బలరేఖలు రెండూ కలసి ఒకే దిశలో వుంటాయి. కడ్డీలో ఏ బిందువు వద్దనైనా రెండు బలరేఖల వల్ల ఏర్పడిన ఫలితబలాన్ని ఆ బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ (magnetic induction) అంటారు. ఈ అయస్కాంత ప్రేరణ విలువ ఆ బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర దిశకు లంబ దిశలో నిర్మించిన ప్రమాన వైశాల్యం ద్వారా పోయే మొత్తం బలరేఖలకు సమానము. దీనిని బట్టి కడ్డీలో ఒక బిందువు వద్ద ఉన్న అయస్కాంత ప్రేరణకు, ప్రేరణ చేసిన అయస్కాంత బలతీవ్రతకు వున్న నిష్పత్తి కడ్డీయొక్క అయస్కాంత పర్మీయబిలిటీకి సమానమని చెప్పవచ్చు.[1]

B/H = μ

లేదా B = μH

C. G. S. పద్ధతిలో μ విలువ కాబట్టి B = H

M. K. S. పద్ధతిలో μ = μ0 μr కాబట్టి

B = μ0 μr H

అయస్కాంత ప్రేరణ ప్రమాణాలు

మార్చు

అయస్కాంత ప్రేరణ ప్రమాణాన్ని గౌస్ (gauss) అంటారు.వస్తువు లోపల ఒక బిందువు వద్ద క్షేత్రానికి లంబదిశలో నిర్మించిన ప్రమాన వైశాల్యం ద్వారా ప్రమాణబలరేఖ పోతే, ఆ బిందువు అయస్కాంత ప్రేరణ ఒక గౌస్ అవుతుంది.

 
కార్ల్ ఫ్రెడ్రిచ్ గౌస్ చిత్ర పటము.

M. K. S. పద్ధతిలో అయస్కాంత ప్రేరణ ప్రమాణము వెబర్/చదరపు మీటర్ (one weber per square metre). దీనిని టెస్ లా అంటారు.10 పవర్4 గౌస్ లకు సమానము.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. ఆయస్కాంత పర్మియబిలిటీ, పేజీ 168, స్థిర విద్యుత్ శాస్త్రము - ద్రవ్య అయస్కాంత ధర్మాలు, తెలుగు అకాడెమీ, 1972

అయస్కాంత ప్రేరణ, పేజి-168, తెలుగు అకాడమి 1972, స్ధిర విద్యుత్ శాస్త్రము ధ్రవ్య అయస్కాంత ధర్మాలు.