అరటిదూట, అరటిబొందు, అరటియూచ, లేదా అరటిదవ్వ, అనునది అరటిచెట్టు యొక్క మిథ్యాకాండం లోపలి భాగం నుండి వెలికిదీయబడిన ఆహారపదార్థం. ఫిలిప్పీన్స్, మలేషియా, ఇండో-చైనా, శ్రీలంక, మయన్మార్ మొదలైన దక్షిణ భారతదేశ వంటకాలలో విరివిగా దీనిని వివిధ వంటకాలలో ఉపయోగిస్తారు.[1][2]

అరటిచెట్టు దూట

తెలుగురాష్ట్రాలలో, ప్రత్యేకించి గోదావరీ పరివాహక ప్రాంతాలలో, దీనిని ఆవపెట్టిన కూరగానూ, పచ్చడిగానూ, పెరుగుపచ్చడిగానూ, కొన్ని కుటుంబాలలో పప్పుకూరగా కూడా తింటారు. దక్షిణభారత రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, అలాగే కేరళలోనూ అరటిదూట ప్రత్యేక ఆహార పదార్థముగా అభిమానింపబడుతుంది.

సూచనలు మార్చు

  1. Khoo, Hedy (2 November 2017). "Stir-fry banana stems for a delightful crunch". The Straits Times. Retrieved 8 February 2021.
  2. Robert, Claudia Saw Lwin; Pe, Win; Hutton, Wendy (2014-02-04). The Food of Myanmar: Authentic Recipes from the Land of the Golden Pagodas (in ఇంగ్లీష్). Tuttle Publishing. ISBN 978-1-4629-1368-8.
"https://te.wikipedia.org/w/index.php?title=అరటిదూట&oldid=4196352" నుండి వెలికితీశారు