అరవింద్ త్రివేది

అరవింద్ త్రివేది భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన 1987లో రామానంద్ సాగర్ 'రామాయణం'లో రావణుడి పాత్ర పోషించి ప్రేక్షకాదరణ అందుకున్నాడు. ఆయన 1991లో భారతీయ జనతా పార్టీ నుండి గుజరాత్‌లోని సబర్కథ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. అరవింద్ త్రివేది 2002 లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యాక్టింగ్ ఛైర్మన్‌గా పని చేశాడు.[1]

అరవింద్ త్రివేది
లోక్‌సభ సభ్యుడు
In office
1991–1996
అంతకు ముందు వారుమగన్‌భాయి పటేల్
తరువాత వారునిషా చౌదరి
నియోజకవర్గంసబర్కథ, గుజరాత్
వ్యక్తిగత వివరాలు
జననం(1938-11-08)1938 నవంబరు 8
హల్డ్వాని, ఉత్తరాఖండ్, భారతదేశం
మరణం2021 అక్టోబరు 6(2021-10-06) (వయసు 82)
కాండీవాలి, ముంబై , మహారాష్ట్ర , భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామినళిని త్రివేది
బంధువులుఉపేంద్ర త్రివేది (సోదరుడు)
వృత్తినటుడు, రాజకీయ నాయకుడు

టెలివిజన్

మార్చు
సంవత్సరం సీరియల్ పాత్ర ఛానల్ ఇతర విషయాలు
1985 విక్రమ్ ఔర్ భేతాళ్ యోగి డీడీ నేషనల్
1987 రామాయణ్‌ రావణ, రిషి విశ్రావ
1995 విశ్వామిత్ర సత్యవ్రతా

అరవింద్ త్రివేది 6 అక్టోబర్ 2021న ముంబై, కాండివాలిలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. "Trivedi takes over as acting chairman of Censor Board". The Times of India (in ఇంగ్లీష్). 22 July 2002. Retrieved 7 February 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. TV9 Telugu (6 October 2021). "రావణుడు ఇక లేడు.. తుది శ్వాస విడిచిన అరవింద్ త్రివేది". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (6 October 2021). "ప్రముఖ నటుడు అరవింద్‌ త్రివేది కన్నుమూత". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.