అరవింద్ సావంత్

భారత రాజకీయ నాయకుడు

అరవింద్ గణపత్ సావంత్ (జననం 31 డిసెంబర్ 1951) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 30 మే 2019 నుండి 11 నవంబర్ 2019 వరకు కేంద్ర భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిగా పని చేశాడు. ఆయన 2019లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల తరువాత భారతీయ జనతా పార్టీ & శివసేన మధ్య విభేదాల కారణంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాడు.[2]

అరవింద్ సావంత్
అరవింద్ సావంత్


లోక్‌సభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2014
ముందు మిలింద్ దేవరా
నియోజకవర్గం దక్షిణ ముంబై

కేంద్ర భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రి
పదవీ కాలం
30 మే 2019 – 11 నవంబర్ 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు అనంత్ గీతే
తరువాత ప్రకాష్ జవదేకర్

ఎమ్మెల్సీ
పదవీ కాలం
2002 – 2010
నియోజకవర్గం బ్రిహనముంబై మునిసిపల్ కార్పొరేషన్
పదవీ కాలం
1996 – 2002
నియోజకవర్గం నామినేటెడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-12-31) 1951 డిసెంబరు 31 (వయసు 72)
బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ శివ సేన
జీవిత భాగస్వామి అనుయా సావంత్
నివాసం ముంబై
వెబ్‌సైటు Arvind Sawant

రాజకీయ జీవితం మార్చు

అరవింద్ సావంత్ 1968లో శివసేనతో రాజకీయ జీవితాన్ని 'గాట్ ప్రముఖ్'గా ప్రారంభించి పార్టీ నిర్వహించిన వివిధ నిరసనలలో పాల్గొన్నాడు. ఆయన 1996లో మహారాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. అరవింద్ 2010లో పార్టీ ఉపనేతగా, పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యాడు.

అరవింద్ సావంత్ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ ముంబై నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిలింద్ దేవరా పై 1,20,000 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత అంచనాల కమిటీ, పెట్రోలియం & సహజ వాయువుపై స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, కమ్యూనికేషన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ & అంచనాల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.

అరవింద్ సావంత్ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ ముంబై నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిలింద్ దేవరా పై రెండోసారి గెలిచి ఎంపీగా ఎన్నికై నరేంద్ర మోడీ రెండో మంత్తిరివర్గంలో కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 11 నవంబర్ 2019న శివసేన & భాజపా పార్టీల మధ్య విభేదాల కారణంగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు.[3]

మూలాలు మార్చు

  1. Lok Sabha (2022). "Arvind Sawant". Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
  2. "Shiv Sena MP Arvind Sawant to quit as Union minister" (in ఇంగ్లీష్). 11 November 2020. Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
  3. "Lone Sena minister Arvind Sawant quits Modi cabinet, blames BJP's betrayal". 11 November 2019. Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.