ప్రకాష్ జవదేకర్

భారత రాజకీయ నాయకుడు

ప్రకాష్ జవదేకర్ భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ జాతీయ నాయకుడు. ఇతను 1950 జనవరి 30న మహారాష్ట్రలోని పూణెలో జన్మించారు. 2008లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.ఆయన 30 మే 2019 నుండి 7 జులై 2021 వరకు కేంద్ర ఆరోగ్య మంత్రిగా పని చేశాడు.[1][2] ప్రకాశ్ జవదేకర్‌ను 2023 జులై 07న  భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించాడు.[3][4]

ప్రకాష్ జవదేకర్
ప్రకాష్ జవదేకర్
కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి
In office
30 మే 2019 – 7 జులై 2021
ప్రధాన మంత్రినరేంద్ర మోడీ
అంతకు ముందు వారుస్మృతి ఇరాని
నియోజకవర్గంరాజ్యసభ సభ్యుడు
వ్యక్తిగత వివరాలు
జననం (1950-01-30) 1950 జనవరి 30 (వయసు 74)
పూణె
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
సంతానంఇద్దరు కుమారులు
వెబ్‌సైట్http://www.prakashjavadekar.com

ప్రారంభ జీవనం

మార్చు

పూణెలో కేశవ్ కృష్ణ జవదేకర్, రంజని జవదేకర్ దంపతులకు జన్మించిన ప్రకాష్ జవదేకర్ స్థానికంగా అభ్యసించి పూణె విశ్వవిద్యాలయం నుంచి బీకాం పట్టా పొందినారు.[5] కళాశాల అభ్యసన దశలోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు వైపు ఆకర్షితుడైనారు. అభ్యసన అనంతరం పదేళ్ళు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పనిచేశారు. తండ్రి కేశవ్ జవదేకర్ హిందూ మహాసభ సీనియర్ నాయకుడే కాకుండా పూణె శాఖ అధ్యక్షుడుగాఉండేవారు. తండ్రి వీర సావర్కార్కు సన్నిహితుడిగా ఉండేవారు.

రాజకీయ ప్రస్థానం

మార్చు

1975 నాటి అత్యవసర పరిస్థితి కాలం నాటికి ప్రకాష్ జవదేకర్ ఏబివిపిలో చురుకైన కార్యకర్తగా ఉండేవారు. పూణెలో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా సత్యాగరహం చేసి అరెస్ట్ అయ్యారు. జైలులో ఉన్నప్పుడు ఆరోగ్యసమస్యలు వచ్చిననూ ఆపరేషన్ కొరకు కూడా బయటకు పంపలేరు. 1990, 1996లలో మహారాష్ట్రవిధానసభకు గ్రాడ్యుయేట్ కోటా నుంచి ఎన్నికయ్యారు. 1995లో మహారాష్ట్ర ప్రణాళిక బోర్డు కార్యనిర్వాహక అధ్యక్షుడైనారు.

రచనలు

మార్చు

ఆర్థిక విషయాలపై జవదేకర్ పలు గ్రంథాలు రచించారు. గ్రాంఈణాభివృద్ధి, బ్యాంకుల పాత్ర అంశంపై పరిశోధ పత్రానికిగాను పురుషోత్తందాస్ ఠాకూర్ స్మారక అవార్డు పొందినారు.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (7 July 2021). "కేంద్ర మంత్రులు రవి శంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జవదేకర్ రాజీనామా". Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021.
  2. Sakshi (7 July 2021). "మోదీ కేబినెట్‌లో భారీ ప్రక్షాళన". Sakshi. Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021.
  3. Sakshi (7 July 2023). "తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ప్రకాష్‌ జవదేకర్‌". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.
  4. Mana Telangana (7 July 2023). "బిజెపి తెలంగాణ ఎన్నికల ఇంఛార్జ్‌గా ప్రకాష్ జవదేకర్". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.
  5. http://www.archive.india.gov.in/govt/rajyasabhampbiodata.php?mpcode=2050