అరిషడ్వర్గాలు అనగా ఆరు అంతర్గత శత్రువులు అని అర్థం. భారతీయ శాస్త్రాలప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించేక్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శతృవులను జయించాలి. కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు.[1] ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. ఇవి మనిషి పతనానికి, ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి. వీటిని ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం, సంకుచిత భావాలతో నిండి ఉంటుంది. మనిషి దుఃఖానికి ఇవి మొదటి కారణాలు. మనిషికి నిజమైన శత్రువులు వారిలో ఉండే అరిషడ్వర్గాలు. ఇవి సామాన్యులను పతనం దిశగా పయనింపజేస్తాయి. మద్యములను అధములుగా మారుస్తాయి. అరిషడ్వర్గాలను జయిస్తే భగవంతుని తత్వం బోధపడుతుంది. ఇవే మహాత్ములలో ఉంటే లోక కల్యాణానికి కారణమవుతాయి.[2]

అరిషడ్వర్గాలలో ఒకటైన క్రోథంతో శకుంతలను శపిస్తున్న దుర్వాస మహర్షి

అర్థాలు

మార్చు
  1. కామం (మితిమీరిన ఏదైన కోరిక)
  2. క్రోధం (కోపం)
  3. లోభం (పిసినారితనం లేదా స్వార్ధం)
  4. మోహం (ఆకర్షణ వలన కలిగే వలపు)
  5. మదం (అహంకారం)
  6. మాత్సర్యం (ఈర్ష్య, అసూయ, మత్సరము, పగ, )

వివరణ

మార్చు
అరిషడ్వర్గం దాని అర్థ్తము దీని వల్ల నష్టం కలిగే ఉదాహరణ
కామము మిక్కలిగా సంపాదించవలెనని యావ చిత్తవృత్తి నరకాసురుడు, జరాసంధుడు అనేక స్త్రీలను, రాజులను చెఱపట్టి నశించుట.
క్రోధము తన పనికి విఘ్నము కలిగించిన వాని శిక్షించవలెననెడి చిత్తవృత్తి. శిశుపాలుడు తాను వివాహమాడదలచిన రుక్మిణిని కృష్ణుడు వివాహమాడెనని కృష్ణునిపై క్రోధించి నశించుట.
లోభము తనకు లభించిన దానిని ఇతరులకు ఇవ్వలేని చిత్తవృత్తి. దుర్యోధనుడు లోభము వలన నశించుట.
మోహము పుత్ర, కళత్ర, ధనాదుల ఎడ మిక్కుటమైన తగులము కల చిత్తవృత్తి. దశరథుడు కైక మీది మోహముచేత నశించుట.
మదము జన్మ, విద్య, ధన, వైభవాదుల కలిమి వలన గర్వాంథము కల చిత్తవృత్తి. కార్తవీర్యుని పుత్రుల మదము వలన నశించుట.
మాత్సర్యము తన కంటే ఎక్కుడు భోగములు కల ఇతరులందు ఓర్వలేకపోవు చిత్తవృత్తి. శిశుపాలుడు కృష్ణుని వైభవము చూసి ఓర్వలేక వదరి నశించుట.

మూలాలు

మార్చు
  1. బుడ్డిగ సుబ్బరాయన్ (1990). బాలల విజ్ఞాన సర్వస్వము - సంస్కృతి విభాగము (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. "అరిషడ్వర్గాలు: మనిషిలో ఉంటే పతనం.. మహాత్ముల్లో ఉంటే లోకకల్యాణం". Samayam Telugu. Retrieved 2020-06-25.