అరుణ్ కుమార్ మిశ్రా

అరుణ్‌ కుమార్ మిశ్రా జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేశాడు.[1][2]

మాజీ న్యాయమూర్తి
అరుణ్‌ కుమార్ మిశ్రా
జాతీయ మానవహక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌
Assumed office
2 జూన్ 2021 - ప్రస్తుతం
Appointed byరామ్‌నాథ్‌ కోవింద్‌
సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి
In office
7 జులై 2014 – 2 సెప్టెంబర్ 2020
Nominated byరాజేంద్ర మాల్ లోధా
Appointed byప్రణబ్ ముఖర్జీ
చీఫ్ జ‌స్టిస్‌ కోల్‌క‌తా హై కోర్ట్
In office
14 డిసెంబర్ 2012 – 6 జులై 2014
Nominated byఅల్తామస్ కబీర్
Appointed byప్రణబ్ ముఖర్జీ
చీఫ్ జ‌స్టిస్‌ రాజస్థాన్ హై కోర్ట్
In office
26 నవంబర్ 2010 – 13 డిసెంబర్ 2012
Nominated byఎస్.హెచ్. కపాడియా
Appointed byప్రతిభా పాటిల్
మధ్యప్రదేశ్ హై కోర్ట్ న్యాయమూర్తి
In office
25 అక్టోబర్ 1999 – 12 సెప్టెంబర్ 2010
Nominated byఆదర్శ్ సెన్ ఆనంద్
Appointed byకోచెరిల్ రామన్ నారాయణన్
వ్యక్తిగత వివరాలు
జననం (1955-09-03) 1955 సెప్టెంబరు 3 (వయసు 69)
జాతీయత భారతదేశం

జననం, విద్యాభాస్యం

మార్చు

అరుణ్ మిశ్రా 1955 సెప్టెంబరు 3లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించాడు. ఆయన తండ్రి హ‌ర్‌గోవింద్ మిశ్రా మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు జ‌డ్జిగా పనిచేశాడు. ఆయన లా పూర్తి చేశాక 1978 నుండి 1999 అక్టోబరు వరకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టులో రాజంగ్య, సివిల్, ఇండస్ట్రియల్, క్రిమినల్ కేసులు వాదించేవాడు.

సభ్యత్వాలు

మార్చు
  • మ‌ధ్య‌ప్ర‌దేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడు (1989 - 1995)
  • మ‌ధ్య‌ప్ర‌దేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు (1992 - 1995)
  • మ‌ధ్య‌ప్ర‌దేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ అడ్వొకేట్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ (1996 -1999)
  • బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా -వైస్ చైర్మన్ (1997-1998)
  • బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా - చైర్మన్ (15.05.1998 - 24.10.1999)

హైకోర్టు జ‌డ్జి

మార్చు

జ‌స్టిస్ అరుణ్ మిశ్రా మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టుకు 1999 అక్టోబరు 25 అడిషనల్ జ‌డ్జిగా, జ‌డ్జిగా 2001 అక్టోబరు 24న నియమితుడయ్యాడు. ఆయన రాజ‌స్థాన్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యి 2010 నవంబరు 26న బాధ్యతలు స్వీకరించాడు. అరుణ్ మిశ్రా కోల్‌క‌తా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యి 2012 డిసెంబరు 14 నుండి 2014 వరకు బాధ్యతలు నిర్వహించాడు. జస్టిస్ అరుణ్ మిశ్రా సుప్రీంకోర్టు జ‌డ్జిగా 2014లో బాధ్యతలు చేపట్టి, 2020 సెప్టెంబరు 2న రిటైర్ అయ్యాడు.

జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ చైర్మ‌న్‌

మార్చు

జ‌స్టిస్ అరుణ్ మిశ్రా జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ చైర్మ‌న్‌గా 2021 జూన్ 2న బాధ్య‌త‌లు స్వీక‌రించాడు.[3]

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (2 June 2021). "ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్‌గా అరుణ్‌ మిశ్రా". Namasthe Telangana. Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 June 2021.
  2. Namasthe Telangana (2 June 2021). "ఎన్‌హెచ్ఆర్‌సీ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన మాజీ జ‌స్టిస్ అరుణ్ మిశ్రా". Namasthe Telangana. Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 June 2021.
  3. "Justice Arun Mishra takes charge as NHRC chief, Mallikarjun Kharge questions why no SC-ST". The Indian Express (in ఇంగ్లీష్). 2021-06-02. Archived from the original on 2021-06-02. Retrieved 2021-06-02.