అరేబియా సముద్రం
అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రములోని భాగము. దీనికి తూర్పున భారత దేశము, ఉత్తరాన బలూచిస్తాన్, దక్షిణ ఇరాన్ ప్రాంతము, పశ్చిమాన అరేబియన్ దీపకల్పము, దక్షిణాన సొమాలీలాండ్ యొక్క ఈశాన్యమున ఉన్న కేప్ గౌర్దఫూయి నుండి భారతదేశము లోని కేప్ కొమొరిన్‌ను కలుపుతూ ఉన్న ఒక ఊహారేఖ దీని ఎల్లలుగా ఉన్నాయి. వేదకాలములో ఈ సముద్రమును భారతీయులు సింధూ సాగరము అని పిలిచేవారు.

అరేబియా సముద్ర తీరమున ఉన్న దేశాలు : భారత దేశము, ఇరాన్, ఒమన్, పాకిస్తాన్, యెమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సొమాలియా, మాల్దీవులు.
ఈ సముద్రము యొక్క తీరమున ఉన్న ప్రధాన నగరములు ముంబై, (భారత దేశము), కరాచీ, (పాకిస్తాన్).
వివరాలు మార్చు
వాణిజ్య మార్గాలు మార్చు
ద్వీపాలు మార్చు
మూలాలు మార్చు
బయటి లంకెలు మార్చు
Wikimedia Commons has media related to Arabian Sea.