అర్జున్‌ సింగ్‌ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బారక్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 2019లో ఎంపీగా గెలిచాడు.[2]

అర్జున్ సింగ్
అర్జున్ సింగ్

పశ్చిమ బెంగాల్ లోని బారక్‌పూర్ నియీజకవర్గ లోక్‌సభ సభ్యుడు, అర్జున్ సింగ్


పదవీ కాలం
23 మే 2019 – ప్రస్తుతం
ముందు దినేష్ త్రివేది
నియోజకవర్గం బార‌క్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2001 – 2019
ముందు బిద్యుత్ గంగూలీ
తరువాత పవన్ సింగ్
నియోజకవర్గం భట్పారా

భట్పారా మున్సిపాలిటీ
పదవీ కాలం
2010 – 2019 (రాజీనామా)

వ్యక్తిగత వివరాలు

జననం (1962-04-02) 1962 ఏప్రిల్ 2 (వయసు 62)
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీ తృణ‌మూల్‌ కాంగ్రెస్ (1998–2019), (2022–ప్రస్తుతం)[1]
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
(2019–2022)
కాంగ్రెస్ పార్టీ ( 1997 వరకు)
సంతానం పవన్ సింగ్
నివాసం జాగ్తడల్, కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్
వృత్తి
  • రాజకీయ నాయకుడు
  • సామాజిక సేవకుడు
సంతకం అర్జున్ సింగ్'s signature

రాజకీయ జీవితం

మార్చు

అర్జున్ సింగ్ 1995లో భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కాంగ్రెస్ నుండి భట్పరా మునిసిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్‌గా గెలిచాడు. ఆయన ఆ తరువాత 2001లో తృణ‌మూల్‌ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో భట్పరా శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప సీపీఐ(ఎం) అభ్యర్థి రాంప్రసాద్ కుందును ఓడించి తొలిసారి రాష్ట్ర అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు.[3]

అర్జున్ సింగ్ 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బారక్‌పూర్ నియోజకవర్గం నుండి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అభ్యర్థి తారిత్ బరన్ తోప్దార్ చేతిలో ఓడిపోయాడు. అర్జున్ సింగ్ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా 2001, 2006, 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు. భట్పరా అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

అర్జున్ సింగ్ తృణమూల్ కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రల "స్టేట్ ఇంచార్జి" గా పని చేసి, 2019లో బీజేపీ పార్టీలో చేరి[4][5], 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బారక్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.[6] ఆయన మే 2022లో బరాక్‌పూర్‌లోని జూట్-మిల్లుల మూసివేత సమస్యను కేంద్ర జౌళి శాఖ మంత్రి పియూష్ గోయల్‌ తో చర్చించగా ఆయన నుండి సానుకూల స్పందన లేకపోవడంతో అర్జున్ సింగ్ 2022 మే 22న తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరాడు.[7] [8]

మూలాలు

మార్చు
  1. The Hindu (22 May 2022). "BJP Barrackpore MP Arjun Singh returns to Trinamool Congress" (in Indian English). Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.
  2. Sakshi (22 May 2022). "బీజేపీకి బిగ్‌ షాక్‌". Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.
  3. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  4. PTI (14 March 2019). "Arjun Singh MLA: TMC leader and four-time MLA Arjun Singh joins BJP | India News - Times of India". The Times of India. Archived from the original on 4 December 2019. Retrieved 27 February 2020.
  5. Loiwal, Manogya (14 March 2019). "Bengal: TMC MLA Arjun Singh to join BJP, why it is a setback for TMC". India Today. Archived from the original on 8 May 2019. Retrieved 27 February 2020.
  6. "Barrackpur Lok Sabha election results 2019 West Bengal: BJP's Arjun Singh wins against 'mentor' TMC's Dinesh Trivedi". DNA India. 24 May 2019. Retrieved 30 January 2022.
  7. "BJP MP Arjun Singh returns to Trinamool Congress; huge loss, says saffron party". The Indian Express. 22 May 2022. Retrieved 22 May 2022.
  8. Mondal, Rittick; Kundu, Indrajit (22 May 2022). "Arjun Singh's ghar wapsi: BJP MP returns to Trinamool after 3 years". India Today (in ఇంగ్లీష్). Retrieved 22 May 2022.