సగం

(అర్ధము నుండి దారిమార్పు చెందింది)
½
prefixes hemi- (from Greek)

semi-/demi- (from Latin)

Binary 0.1 or 0.011111111111...
Decimal 0.5 or 0.499999999999...
Hexadecimal 0.8 or 0.7FFFFFFFFFFF...
Continued fraction [0; 1, 1] or [0; 2]
Single-precision

floating point

3F000000 (hex) =

00111111000000000000000000000000 (binary)

సగం లేదా అర్ధ (One Half) అనగా ఏదైనా ఒక సంఖ్యను రెండు చేత భాగించిన వచ్చునది. అనగా "1/2" అన్నమాట. ఏదైనా పదార్ధాన్ని రెండు సమాన భాగాలుగా విభజించిన వాటిని కూడా సగం అంటారు. డెసిమల్ పద్ధతిలో సగాన్ని 0.5 అని సూచిస్తారు.

1940ఐర్లండ్ లో అర పెన్నీ పోస్టలు స్టాంపు

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాషలో అర్ధ (ardhamu) అనగా సగం. ఉదా: అర్ధచంద్రుడు, అర్ధగోళము, అర్ధనారీశ్వరుడు. నడిరాత్రి (midnight) ని అర్ధరాత్రి అని కూడా అంటారు. ఏదైనా విషయంలో సందేహాస్పదంగా అంగీకరించడాన్ని అర్ధాంగీకారము అంటారు. యుద్ధంలో ఒక యోధుడు మరో యోధుని రథంలో యుద్ధంచేస్తే అతన్ని "అర్ధరథుడు" అంటారు. గణితంలో అర్ధవ్యాసం మొదలుగా ప్రయోగాలున్నాయి. "అర్ధోరుకము" అనగా వేశ్యలు సగము తొడల దాకా తొడుగుకొనే చల్లడం, లాగు. 64-పూసలు కలిగిన గొలుసును అర్ధహారం అంటారు.

అర్ధం (ఒత్తు ), అర్థం (ఒత్తు ) రెండు ఒకటి కాదు. అర్ధం గురించి ఇక్కడ తెలియజేయగా అర్థము అనగా ధనం గురించి సంబంధించిన పేజీలో చూడండి. దీనికి సంబంధించిన శాస్త్రం అర్థిక శాస్త్రం.

సాహిత్యంలో సగం

మార్చు

భార్యాభర్తలు చెరో సగంగా సాహిత్యకారులు పేర్కొంటారు.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సగం&oldid=3940303" నుండి వెలికితీశారు