అర్ధరాత్రి స్వతంత్రం

అర్థరాత్రి స్వతంత్రం 1985 లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా దేశభక్తి సామాజిక వినోదాత్మక చిత్రం. ఇందులో టి. కృష్ణ, నారాయణ రావు, జానకి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆర్ నారాయణ మూర్తి నిర్వహించాడు. స్నేహచిత్ర పిక్చర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చెల్లపిళ్ళ సత్యం స్వరాలు సమకుర్చాడు.[1]

అర్ధరాత్రి స్వతంత్రం
(1985 తెలుగు సినిమా)
Artharathri Swatantram.jpg
దర్శకత్వం ఆర్.నారాయణమూర్తి
తారాగణం టి.కృష్ణ,
నారాయణరావు,
జానకి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ స్నేహచిత్ర పిక్చర్స్
భాష తెలుగు

ఈ చిత్రాన్ని రంపచోడవరంలో మొదలుపెట్టారు నారాయణమూర్తి. ఈ చిత్రానికి సంబంధించిన దర్శక, నిర్మాణ బాధ్యతలు తీసుకొన్నారు. 1984న ప్రారంభమయిన ఈ సినిమా సెన్సార్‌ బోర్డు ద్వారా ఆటంకాలను ఎదురుకోవాల్సి వచ్చింది. ఆ ఆటంకాలను దాటి 1986న ఈ సినిమా టి.కృష్ణ వర్ధంతి రోజున (నవంబరు 6) న రిలీజ్‌ అయింది. ఈ చిత్రంలో నక్సలైటు పాత్రను పోషించారు నారాయణ మూర్తి. ఈ మూవీ విజయవంతమైంది.[2]

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

శ్రీకాకుళంలో అమాయక గిరిజన ప్రజలు తమ బతుకులు బాగు చేసుకోవడానికి ఏవిధంగా పోరాటం చేశారో వివరిస్తూ, వంగపండు రాసిన ‘ఏం పిల్లడో ఎల్ద మొత్తవా’ పాట విశేష ప్రజాదరణ పొందింది. దానిని టి. కృష్ణ మీద ఆర్‌. నారాయణమూరి చిత్రీకరించాడు. సినిమాలో గీతాన్నీ వంగపండు పాడటం గమనార్హం.[3]

 • మీ అమ్మ సచ్చినా దమ్మిడొగ్గను
 • ఏం పిల్లడో ఎల్ద మొత్తవా
 • యెక్కడ పుట్టి...
 • గంగమ్మ తల్లి
 • నోమి మన్నాలో
 • మా పోరు..
 • ఓరి నాయనో..
 • గుండి పెట..

మూలాలుసవరించు

 1. "అర్ధరాత్రి స్వతంత్రం (1985) | అర్ధరాత్రి స్వతంత్రం Movie | అర్ధరాత్రి స్వతంత్రం Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Retrieved 2020-08-11.
 2. "ఎర్రెర్రని జెండా...ఆయన ఎజెండా". సితార. Archived from the original on 2021-01-01. Retrieved 2020-08-11.
 3. "ఆయనొక పాటల దండు!". www.andhrajyothy.com. Retrieved 2020-08-11.

బాహ్య లంకెలుసవరించు