అలకనంద
'అలకనంద' నది హిమాలయాల లో పుట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రం గుండా ప్రవహించే ఒక నది. ఇది అనగా ఈ నది దేవప్రయాగ వద్ద భగీరథ నదితో కలిసి గంగానదిగా పిలువబడుతూంది. అలకనంద నది బదరీనాథ్‌కు ఉత్తరంగా సుమారు 40 కి.మీ. అవతల హిమాలయ కొండల మధ్య పుట్టి దేవప్రయాగ అనే వూరి వరకూ ‘అలకనంద’ అనే పేరుతోనే ప్రవహిస్తుంది. అయితే బద్రినాథ్‌కు చాలా దూరంలో గంగానది గంగోత్రి అనే చోట నేలమీదకు దిగి, అక్కడ నుంచి భాగీరథి అనే పేరుతో ముందుకు సాగివస్తుంది. అలాగే కేదార్‌నాథ్ దగ్గర భిలాంగన, మందాకిని అనే నదులు జన్మించాయి. అందులో భిలాంగన నది ముందుకు సాగివచ్చి తిహారి అనే టోట భాగీరథి నదిలో కలిసి పోతుంది. అక్కడినుంచి అది భాగీరథి అనే పేరుతో ముందుకు సాగిపోతుంది.
అలకనంద నది | |
River | |
అవక్షేపాలతో కూడిన అలకనంద నది ఉత్తరాఖండ్ లోని దేవప్రయాగ గుండా సాగుతున్న దృశ్యం.
| |
దేశం | India |
---|---|
రాష్ట్రం | ఉత్తరాఖండ్ |
Region | గర్హ్వాల్ విభాగము |
Districts | ఛమోలీ, రుద్రప్రయాగ, పౌరీ గర్హ్వాల్ జిల్లా |
ఉపనదులు | |
- ఎడమ | సరస్వతి, ధౌలిగంగ, నందకిని, పిండర్ |
- కుడి | మందాకిని |
Source | సతోపంత్, భగీరథ్ ఖరక్ హిమానీనదముల సంగమం. |
- ఎత్తు | 3,880 m (12,730 ft) |
Source confluence | భగీరధి నది |
Mouth | గంగా నది |
- location | దేవప్రయాగ, ఉత్తరాఖండ్, భారతదేశం |
- ఎత్తు | 475 m (1,558 ft) |
పొడవు | 190 km (118 mi) |
పరివాహక ప్రాంతం | 10,882 km2 (4,202 sq mi) |
Discharge | |
- సరాసరి | 439.36 m3/s (15,516 cu ft/s) |
ఉత్తరాఖండ్ లోని గర్హ్వా ప్రాంతంలో గంగానది యొక్క హిమాలయానదుల ప్రధాన స్థానం. దేవప్రయాగ వద్ద అలకనంద నది , గంగానదికి ఎడమ ఉపనదిగా ఉన్నది.
|
ఈ నది భగీరథ నదిని కలువక ముందే మరికొన్ని నదులతొ కలుస్తుంది. ఈ నది కిన్నేరసాని నదితో కలుస్తుంది ఇది కిన్నేరసాని నదితొ రుద్రప్రయాగ వద్ద కలస్తుంది. అంతేకాదు పిండారి నదితో కర్న ప్రయాగ వద్ద కలుస్తుంది. విస్ణు గంగ నదితో విస్ణు ప్రయాగ వద్ద కలుస్తుంది.