అలియాస్ జానకి

అలియాస్ జానకి 2013లో విడుదలైన తెలుగు సినిమా. సంఘమిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై నీలిమ తిరుమలశెట్టి నిర్మించిన ఈ సినిమాకు దయానంద్ రెడ్డి దర్శకత్వం వహించాడు. వెంకట్ రాహుల్, శ్రీ రమ్య , నాగబాబు, అనీష అంబ్రోస్, శత్రు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 26 జులై 2013న విడుదలైంది.[1]

అలియాస్ జానకి
దర్శకత్వందయానంద్ రెడ్డి
రచనవెంకట్ రాహుల్
నిర్మాతనీలిమ తిరుమలశెట్టి
తారాగణంవెంకట్ రాహుల్, శ్రీ రమ్య , నాగబాబు, అనీష అంబ్రోస్
ఛాయాగ్రహణం
సుజీత్ సారంగ్
కూర్పు
శ్రీజీత్ సారంగ్
సంగీతంశ్రావణ్
నిర్మాణ
సంస్థ
సంఘమిత్ర ఆర్ట్స్
విడుదల తేదీ
26 జులై 2013
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

జానకి రామ్ అలియాస్ జానకి (వెంకట్ రాహుల్) ఒక నిజాయితీ గల టీచర్ అయిన నాగబాబు కొడుకు.తండ్రి అడుగుజాడల్లోనే జానకి నీతి నిజాయితీగా పెరుగుతాడు. జానకి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగంలో చేరతాడు. ఒక కేసు విషయంలో పరిచయమయిన చైత్ర (అనీష అంబ్రోస్) తో జానకి ప్రేమలో పడతాడు. సిటీలోని పెద్ద రౌడీ వాసుదేవ్ మైసా (శత్రు) కి వ్యతిరేకంగా న్యాయబద్ధంగా లాల్ నగర్ స్థలం పేద ప్రజలకి చెందాలని జానకి పోరాటం మొదలు పెడతాడు, అక్కడనుండి జానకి అడ్డు తొలగించి ఆ స్థలం కబ్జా చెయ్యాలని మైసా , మైసా నుండి ఆ స్థలాన్ని కాపాడి పేదలకే అప్పగించాలని జానకి, వీరి మధ్యలో పియదర్శిని (శ్రీ రమ్య) అనే అమ్మాయి ఎలా వచ్చింది. అసలు ప్రియదర్శిని ఎవరు? స్థలం విషయంలో చివరికి ఎవరు గెలిచారు ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులుసవరించు

  • వెంకట్ రాహుల్ - జానకిరామ్
  • శ్రీ రమ్య - ప్రియదర్శిని
  • అనీష అంబ్రోస్ - చైత్ర
  • నాగబాబు - జానకిరామ్ తండ్రి
  • తనికెళ్ళ భరణి -ముకుందం
  • శత్రు -మైసా
  • శివన్నారాయణ - కాశి
  • సంధ్య జనక్ - కాశి భార్య

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: సంఘమిత్ర ఆర్ట్స్
  • నిర్మాత: నీలిమ తిరుమలశెట్టి
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దయానంద్ రెడ్డి
  • కథ: వెంకట్ రాహుల్
  • సంగీతం: శ్రావణ్ [3]
  • సినిమాటోగ్రఫీ: సుజీత్ సారంగ్
  • పాటలు: స్వేచ్ఛ , సురేంద్రకృష్ణ ,కె.కృష్ణకాంత్‌ , కార్తీక్ కొడకండ్ల, అశ్విన్
  • ఎడిటింగ్: శ్రీజీత్ సారంగ్

మూలాలుసవరించు

  1. Sakshi (19 July 2013). "ఆన్‌లైన్‌లోనూ రిలీజ్ కానున్న అలియాస్ జానకి". Archived from the original on 29 జూలై 2021. Retrieved 29 July 2021.
  2. The Times of India (26 July 2013). "Alias Janaki Movie Review {2.5/5}: Critic Review of Alias Janaki by Times of India". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
  3. The Times of India (19 July 2013). "Alias Janaki" (in ఇంగ్లీష్). Archived from the original on 29 జూలై 2021. Retrieved 29 July 2021.