దయానంద్ రెడ్డి
దయానంద్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. 2013లో వచ్చిన అలియాస్ జానకి చిత్రానికి దర్శకత్వం వహించి తెలుగు సినీరంగంలోకి దర్శకుడిగా అడుగుపెట్టాడు. 2013 సంవత్సరానికి గానూ ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నాడు.[1][2] అంతేకాకుండా అనేక సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించాడు.ఆయన 2016లో సిద్దార్థ సినిమాకు దర్శకత్వం వహించాడు.
దయానంద్ రెడ్డి | |
---|---|
జననం | ఫిబ్రవరి 4, 1975 అంబర్ పేట, తెలంగాణ, భారతదేశం |
ఇతర పేర్లు | కె.వి. దయానంద్ రెడ్డి |
ప్రసిద్ధి | తెలుగు సినిమా దర్శకుడు, నటుడు |
మతం | హిందూమతం |
భార్య / భర్త | భాగ్యలత |
పిల్లలు | హృదయ్ వికాస్, ప్రశంస |
జననం - విద్యాభ్యాసం
మార్చుదయానంద్ 1975, ఫిబ్రవరి 4న డా. అంజిరెడ్డి, భారతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని అంబర్ పేటలో జన్మించాడు. తండ్రి రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి. దయానంద్, హైదరాబాదులోని మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందాడు.[3] డిగ్రీ చదివిన తర్వాత మధు ఫిల్మ్ ఇన్సిట్యూట్ లో డిప్లొమా ఇన్ యాక్టింగ్ (1995-1996) చేశాడు. హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో ఎం.ఏ. (రంగస్థల కళలు 1998-2000) చదివాడు.
వివాహం
మార్చు2004, మే 13న భాగ్యలతతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (హృదయ్ వికాస్), ఒక కూతురు (ప్రశంస).
సినీరంగ ప్రస్థానం
మార్చుడిగ్రీ పూర్తికాగానే నటుడిగా రాణించాలని సినీ పరిశ్రమకు వచ్చాడు. పాఠశాల స్థాయినుంచే నాటకాలు వేస్తుండేవాడు. మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో 95-96 బ్యాచ్‌లో చేరి శిక్షణ పొందాడు. అనంతరం తెలుగు విశ్వవిద్యాలయం లో ఎం.ఎ. చదివాడు.[4]
పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌లో 10 సంవత్సరాలపైగా పనిచేశాడు. ఖుషి సినిమాకి అప్రెంటీస్‌గా చేరి, పవన్ నటించిన జానీ, గుడుంబా శంకర్, అన్నవరం, పంజా సినిమాలలో నటించాడు. సినిమాకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లపై అవగాహనకోసం దర్శకత్వం శాఖ పనిచేశాడు. గుడుంబా శంకర్ సినిమా తర్వాత స్టోరి, స్క్రీన్ ప్లే రాసుకొని డిజిటల్ ఫార్మాట్ లో ఎక్స్ పరిమెంటల్‌గా ఓ థ్రిల్లర్ సినిమా చేశాడు.[4]
పవన్ కల్యాణ్ స్వీయ దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం నిర్మాతగా, ఏ.ఆర్.రెహమాన్ సంగీతంలో ప్రారంభమైన సత్యాగ్రహి అనే సినిమాకు కథా చర్చలలో పాల్గొన్నాడు. అనంతరం అన్నవరం, జల్సా, కొమురం పులి సినిమాలకు పనిచేశాడు. గాయం-2 సినిమాకు కోడైరెక్టర్‌గా పనిచేశాడు. బసంతి, రౌడీ ఫెలో, ముకుంద, బంగారు పాదం, దరువు మొదలైన సినిమాలలో నటించాడు.[4]
దర్శకుడిగా తొలిచిత్ర అవకాశం
మార్చుపంజా సినిమా తరువాత మరో ప్రపంచం అనే షార్ట్ ఫిలింలో నటించాడు. ఆ షార్ట్ ఫిలిం బాగా పాపులర్ అయ్యి, దయానంద్ కు మంచి గుర్తింపు వచ్చింది. అటుతర్వాత పంజా నిర్మాత నీలిమ తిడుమలశెట్టి ప్రోత్సాహంతో అలియాస్ జానకి కి దర్శతక్వం చేసే అవకాశం లభించింది. 2012, డిసెంబర్ 12 (12-12-12 ) రోజున అధికారికంగా డైరెక్టర్ అయ్యాడు. 2013 జనవరి 1న రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. 2013 ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందించింది.[4]
దర్శకత్వం వహించిన సినిమాలు
మార్చుపురస్కారాలు
మార్చు- నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఉత్తమ దర్శకుడు (అలియాస్ జానకి)[6][7][8][9]
నటించిన సినిమాలు
మార్చు- వీక్షణం (2024)
- నరుడి బ్రతుకు నటన (2024)
- హైడ్ న్ సిక్ (2024)
- మ్యూజిక్ షాప్ మూర్తి (2024)
- మూడో కన్ను (2024)
- మామా మశ్చీంద్ర (2023)
- వినరో భాగ్యము విష్ణుకథ (2023)
- మట్టి కథ (2023)
- నెగిటివ్ (2021)
- పుష్ప (2021)
- ఏకమ్ (2021)
- అలాంటి సిత్రాలు (2021)
- వైల్డ్ డాగ్ (2021)
- ఎ1 ఎక్స్‌ప్రెస్ (2021)
- జోహార్ (2020)
- జార్జిరెడ్డి (2019)
- డియర్ కామ్రేడ్ (2019)
- నినువీడని నీడనునేనే (2019)
- జెర్సీ (2019)
- యాత్ర (2018)
- భైరవ గీత (2018)
- ఆర్ ఎక్స్ 100 (2018)
- లై (2017)
- బసంతి (2014)
- ముకుంద (2014)
- రౌడీ ఫెలో (2014)
- దరువు (2012)
- పంజా (2011)
- గాయం-2 (2010)
- అన్నవరం (2006)
- గుడుంబా శంకర్ (2004)
- జాని (2003)
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి. "'ఈగ'కు నందీ వందనం". Retrieved 4 March 2017.[permanent dead link]
- ↑ తెలుగు సంచార్. "మొదటి సినిమాకే నంది అవార్డు తీసుకున్న డైరెక్టర్ ఎవరో తెలుసా?". Retrieved 4 March 2017.[permanent dead link]
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "పవన్ కల్యాణ్ నన్ను దర్శకుడిగా చూడాలనుకొన్నారు.. ఆమెకు రుణపడి ఉంటా..." telugu.filmibeat.com. Retrieved 4 March 2017.
- ↑ 4.0 4.1 4.2 4.3 తెలుగు ఫిల్మీబీట్. "పవన్ కల్యాణ్ నన్ను దర్శకుడిగా చూడాలనుకొన్నాడు.. ఆమెకు డుణపడి ఉంటా..." telugu.filmibeat.com. Retrieved 4 March 2017.
- ↑ iQlikmovies (31 August 2016). "New Director With Pawan Kalyan's Blessings". iQlikmovies. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/. 2017-03-01. Retrieved 25 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.