అలెక్సాండర్ డఫ్
ఆలెగ్జాండర్ డాఫ్ (ఏప్రిల్ 15, 1806 - ఫిబ్రవరి 12, 1878) ఒక స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. అతడు స్కాట్లండు చర్చికు మొట్టమొదట అంతర్జాతీయ మిషనిరీగా భారతదేశము వచ్చెను. 1980 జూలై 13 న డఫ్ ఈనాడు స్కాటిష్ చర్చ్ కాలేజీగా పిలువబడుతున్న జనరల్ శాసనసభ ఇన్సిట్ఞూషన్ ను స్థాపించెను. కలకత్తా విశ్వవిద్యాలయం స్థాపనలో పాత్ర వహించెను.
తొలి జీవితము
మార్చుఅలెగ్జాండర్ డఫ్ స్కాట్లెండ్లో జన్మించెను. యూనివర్శిటీ ఆఫ్ సెయింట్ అండ్రూస్ లో చదివెను. స్కాట్లెండ్ చర్చి విదేశీ వ్యవహారాల కమిటీ ద్వారా భారతదేశములో మొదటి మిషనరీ పదవిని పొంది, 1829 లో బాధ్యతలు స్వీకరించెను.
భారతదేశములో మిషనరీ
మార్చుPart of a series on Protestant missions to India | |
William Carey | |
Background | |
People | |
Works | |
Missionary agencies | |
Pivotal events | |
Indian Protestants |
రెండు సార్లు ఒడ విరిగిపోయినా సహసోపేతమైన ప్రయాణము తరువాత, డఫ్ 1830 మే 27న కలకత్తాలో అడుగు పెట్టాడు. దీర్ఘకాలిక ప్రభావము ఉండే ప్రభుత్వ విధానము ప్రవేశపెట్టాడు. అప్పటి వరకు భారతదేశములో క్రైస్తవ మిషనరీలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కొన్నినిమ్న కులముల వారినే క్రైస్తవ మతములోకి మారుస్తూ ఉండేవి. ఉన్నత కుల హిందువులను, ముస్లిములను ముట్టుకునేవి కావు. సాంప్రదాయక మతమార్పిడి విధానాలు ఉన్నత కులాల వారిని ఆకర్షించవు అని తెలివిగా తెలుసుకున్న డఫ్, పాశ్ఛాత్య విద్య ద్వారా ఉన్నత కులాలలో బాలురను ఆకర్షించి, వారికి విద్య నేర్పించి వారిని క్రైస్తవ మతము వైపుకు మల్లించవచ్చని గ్రహించాడు. విద్యాశాఖ ప్రభుత్వ విధానాన్ని మార్చాడు. ఆతని కృషి ఫలితముగా భారతదేశంలో విద్యా ప్రమాణాలు పెరగడమే కాకుండా ఉన్నత కుల హిందువులలో క్రైస్తవ మత సిద్దాంతాలు కూడా ప్రవేశించడము మొదలుపెట్టాయి.
ఇంగ్లీషులో విద్య
మార్చుడఫ్, బైబిలుతో పాటు మౌలిక విద్య నుండి విశ్వవిద్యాలయ స్థాయి దాకా, అనేక లౌకికాంశాలలో పాఠములు చెప్పు ఒక పాఠశాలను ప్రారంభించాడు. పాశ్చాత్య జ్ఞానాన్ని అర్ధం చేసుకోవటానికి ఆంగ్లము కీలకమని ఈ పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమములో బోధించుచుండేవారు. ఇదే విషయముపై డఫ్ "ఏ న్యూ ఎరా ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ ఇండియా" (భారతదేశములో ఆంగ్ల భాష, సాహిత్యము యొక్క నూతన శకము) అనే కరపత్రము ప్రకటించాడు. దీని ప్రభావముతో 1835, మార్చి 7న ప్రభుత్వము, ఉన్నత విద్యలో భారతదేశములోని బ్రిటీషు ప్రభుత్వము యొక్క లక్ష్యం భారతదేశ స్థానిక ప్రజలలో పాశ్చాత్య విజ్ఞానము, సాహిత్యము యొక్క అవగాహన పెంపొందించటమే అన్న విధానాన్ని అవలంబించింది. విద్యా సంబంధ విషయాలకు కేటాయించిన అన్ని నిధులను ఆంగ్ల విద్యకు వినియోగించుట మాత్రమే వాటి సదుపయోగమని కూడా భావించింది.
ఆ కాలపు భారతదేశ బ్రిటీషు సమాజములో, భారతదేశ సాంప్రదాయ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వాటికి మద్దతునిచ్చి పెంపొందిచాలని అభిలషించిన "ప్రాచ్యవేత్తలు" లేకపోలేదు. వారు సాంప్రాదాయ విద్యను తోసిరాజని, పాశ్చాత్య విద్య, సంస్కృతి, మతాన్ని పెంపొందించాలన్న డఫ్ విధానాన్ని వ్యతిరేకించారు. 1939లో, అప్పటి భారతదేశ గవర్నరు జనరలైన ఎర్ల్ ఆఫ్ ఆక్లాండ్, ప్రాచ్యవేత్తల వాదనకు లొంగి, రెండు ధృక్కోణాలకు మధ్య ఒక మధ్యేవాద విధానాన్ని అవలంబించాడు.