అలెగ్జాండ్రియా
అలెగ్జాండ్రియా ఈజిప్టు దేశంలో రెండవ అతిపెద్ద నగరం. మధ్యధరా సముద్రతీర ప్రాంతంలో అతిపెద్ద నగరం. నైలు నది డెల్టా పశ్చిమ అంచుని ఆనుకుని ఉంది. సుమారు సా.శ.పూ 331 సంవత్సరంలో జగజ్జేత అలెగ్జాండర్ స్థాపించిన ఈ నగరం[1] త్వరగా అభివృద్ధి చెంది హెలెనిక్ నాగరికతకు (పురాతన గ్రీసు) కేంద్ర బిందువుగా మారింది. ప్రస్తుతం అలెగ్జాండ్రియా ఒక ప్రాచుర్యం పొందిన యాత్రా పట్టణమే కాక సూయజ్ లో ఉన్న సహజ వాయువు, చమురు నిక్షేపాల వలన ఒక వ్యాపార కేంద్రంగా కూడా పేరు గాంచింది.
ఈ నగరం ఈజిప్టు ఉత్తర తీరం వెంబడి దాదాపు 40 కిమీ విస్తరించి ఉన్న ఈ నగరం మధ్యధరా ప్రాంతంలో అతిపెద్ద నగరం. ఈజిప్ట్‌లో కైరో తర్వాత రెండవ అతిపెద్ద నగరం. అరబ్ ప్రపంచంలో నాల్గవ-అతిపెద్ద నగరం, ఆఫ్రికాలో తొమ్మిదవ అతిపెద్ద నగరం.
ప్రాచీన ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన లైట్‌హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా (ఫారోస్) ప్రసిద్ధి చెందింది, ప్రాచీన కాలంలో అతిపెద్ద గ్రంథాలయం, మధ్య యుగాలలోని ఏడు అద్భుతాలలో ఒకటైన కోమ్ ఎల్ షోకాఫా కాటాకాంబ్స్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. హెలెనిస్టిక్ యుగం, చివరి పురాతన కాలం వరకు ప్రాచీన మధ్యధరా ప్రాంతం యొక్క మేధో మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉంది. రోమ్ నగరం దీని స్థానాన్ని ఆక్రమించకమునుపు అప్పటి కాలానికి అలెగ్జాండ్రియా అతిపెద్ద నగరం.
మూలాలు
మార్చు- ↑ Justin Pollard; Howard Reid (30 October 2007). The Rise and Fall of Alexandria: Birthplace of the Modern World. Viking. p. 2-7. ISBN 978-0-14-311251-8.