అలెస్సాండ్రో వోల్టా
అలెస్సాండ్రో గియుసేప్ప్ ఆంటోనియో అనస్టసియో వోల్టా (ఫిబ్రవరి 18, 1745 - మార్చి 5, 1827) ఒక ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త,[1][2] ఇతను 1800లలో బ్యాటరీ ఆవిష్కరణతో ప్రసిద్ధి చెందాడు.
అలెస్సాండ్రో వోల్టా | |
---|---|
జననం | ఫిబ్రవరి 18, 1745 కోమో, మిలన్ డచీ నేటి ఇటలీ |
మరణం | 1827 మార్చి 5 కోమో, లాంబార్డీ-వెనెటియా నేటి ఇటలీ | (వయసు 82)
జాతీయత | ఇటాలియన్ |
రంగములు | భౌతికశాస్త్రం , రసాయన శాస్త్రం |
ప్రసిద్ధి | విద్యుత్ ఘటం యొక్క ఆవిష్కరణ మీథేన్ ఆవిష్కారం వోల్ట్ వోల్టేజ్ వోల్ట్‌మీటర్ |
ముఖ్యమైన పురస్కారాలు | కోప్లీ మెడల్ (1794) |
ప్రారంభ జీవితం , పనులు
మార్చువోల్టా 1745 ఫిబ్రవరి 18 న నేటి ఉత్తర ఇటలీ లోని ఒక పట్టణమైన కోమో (స్విస్ సరిహద్దు సమీపంలో) లో జన్మించాడు. 1794లో వోల్టా కోమో లోనే ఉండే తెరెసా పెరిగ్రిని అనే ఒక గొప్పయింటి స్త్రీని వివాహం చేసుకున్నాడు, వీరు గియోవన్నీ, ఫ్లామినియో, జనినొ అనే ముగ్గురు కుమారులకు జన్మనిచ్చారు. ఇతని తండ్రి ఫిలిప్పో వోల్టా నోబుల్ సంతతికి చెందినవాడు. ఇతని తల్లి డోన్నా మాడలెనా ఇన్‌జాగీష్ కు చెందిన కుటుంబం నుండి వచ్చింది. 1774లో ఇతను కోమో లోని రాయల్ స్కూల్ లో భౌతికశాస్త్ర ప్రొఫెసర్ అయ్యాడు. ఒక సంవత్సరం తరువాత ఇతను అభివృద్ధి పరచిన విద్యుజ్జనకము ప్రాచుర్యంలోకి వచ్చింది, ఈ పరికరం స్టాటిక్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది.