మార్చి 5
తేదీ
మార్చి 5, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 64వ రోజు (లీపు సంవత్సరములో 65వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 301 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
మార్చు- 2010: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
- 1824: బర్మా పై బ్రిటన్ యుద్ధం ప్రకటన.
- 1931: రాజకీయ ఖైదీ ల విడుదల ఒపందంపై బ్రిటిష్ ప్రతినిధులు, మహాత్మా గాంధీ సంతకం.
జననాలు
మార్చు- 1901: ఈలపాట రఘురామయ్య, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (మ.1975)
- 1917: కాంచనమాల, అలనాటి అందాల నటి. (మ.1981)
- 1918: జేమ్స్ టోబిన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .
- 1920: మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో కవి. (మ. 1992)
- 1924: గణపతిరాజు అచ్యుతరామరాజు, వాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారుడు. (మ.2004)
- 1928 : ఆల్కే పదంసీ, పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్టైజ్మెంట్లకు సృష్టికర్త.
- 1937: నెమలికంటి తారకరామారావు, శ్రీకళానికేతన్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున 30 నాటక, నాటికలను హైదరాబాదులోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోనూ ప్రదర్శింపజేశారు.
- 1951: జి. సాయన్న, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ. 2023)
- 1956: శ్రీప్రియ , తెలుగు, తమిళ,కన్నడ ,మలయాళ ,సినీనటి
- 1958: నాజర్, దక్షిణాదికి చెందిన నటుడు.
- 1976: మల్లికార్జున్, గాయకుడు, సంగీత దర్శకుడు
- 1977: సెల్వ రాఘవన్ , తమిళ, తెలుగు చిత్రాల దర్శకుడు,రచయిత.
- 1984: ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (మ.2015)
- 1985: వరలక్ష్మి శరత్ కుమార్ , తమిళ,తెలుగు, మళయాళ చిత్ర నటి .
- 1996: మీనాక్షి చౌదరి , భారతదేశ చలన చిత్ర నటి, మోడల్.
మరణాలు
మార్చు- 1827: అలెస్సాండ్రో వోల్టా, బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. (జ.1745)
- 1827: పియర్ సైమన్ లాప్లేస్ ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు (జ.1749)
- 1945: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి, శతావధాని.
- 1953: స్టాలిన్ , రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత, అధ్యక్షుడు
- 1989: పృథ్వీసింగ్ ఆజాద్, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1892)
- 1996: పిఠాపురం నాగేశ్వరరావు, సినీ నేపథ్యగాయకుడు.(జ.1930)
- 2004: కొంగర జగ్గయ్య, తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1928)
- 2013: రాజసులోచన, తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (జ.1935)
- 2017: సి.వి.సుబ్బన్న శతావధాని (జ.1929)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం.
- ప్రపంచ బధిరుల దినం.
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-11-14 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 5
మార్చి 4 - మార్చి 6 - ఫిబ్రవరి 5 - ఏప్రిల్ 5 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |