అలోకానంద రాయ్

బెంగాలీ నాటకరంగ, సినిమా నటి.

అలోకానంద రాయ్, బెంగాలీ నాటకరంగ, సినిమా నటి. 1951లో ఏడేళ్ళ వయసులో నాటకరంగంలోకి వచ్చి, తర్వాత అనేక బెంగాలీ నాటకాల్లో నటించింది. 1962లో సత్యజిత్ రే రూపొందించిన కాంచన్‌జంఘా సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1] 1988లో బుద్ధదేబ్ దాస్‌గుప్తా తీసిన ఫేరా అనే బెంగాలీ సినిమాలో నటించిన అలోకానందకు బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ నుండి ఉత్తమ నటి అవార్డును అందుకుంది.[1] పరోమితార్ ఏక్ దిన్, ఉత్సబ్, ప్రోహోర్, నేతాజీ సుభాస్ చంద్రబోస్: ది ఫర్గాటెన్ హీరో వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న సినిమాలలో నటించింది.[2]

అలోకానంద రాయ్
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1951 – 1962
1978 – ప్రస్తుతం

సినిమారంగం

మార్చు

1962లో సత్యజిత్ రే దర్శకత్వంలో వ్చిన కంచెన్‌జంఘా సినిమాలో మనీషా పాత్రను షర్మిలా ఠాగూర్ తిరస్కరించినపుడు, ఆ పాత్రను పోషించడానికి అలోకానంద రాయ్‌ను తీసుకున్నాడు.[3] ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు.[3]

1978లో, శేఖర్ ఛటర్జీ దర్శకత్వం వహించిన ఆచార్య బెంగాలీ నాటకంతో మళ్ళీ నాటకరంగానికి తిరిగి వచ్చింది. సౌమిత్ర ఛటర్జీ దర్శకత్వం వహించిన హోమపాఖి బెంగాలీ నాటకంలో దాదాపు పదేళ్ళపాటు అతని పక్కన నటించింది.[4] రితుపర్ణో ఘోష్ తీసిన తహర్ నమతి రంజన అనే బెంగాలీ థ్రిల్లర్ టివి సిరీస్ లో రంగపిషిమాగా నటించింది.[5] ఘోష్ ఆకస్మికంగా మరణించిన తరువాత, మొదటి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత సిరీస్ ఎప్పుడూ కొనసాగించబడలేదు.[6]

అవార్డులు

మార్చు
అవార్డు సంవత్సరం వర్గం సినిమా ఫలితం
బి.ఎఫ్.జె.ఏ. అవార్డు 1989 ప్రధాన పాత్రలో ఉత్తమ నటి ఫెరా గెలుపు [7]
ఆనందలోక్ పురస్కారం 1998 సహాయ పాత్రలో ఉత్తమ నటి సెడిన్ చైత్రమాస్ గెలుపు [8]

నటించినవి

మార్చు

హిందీ సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2004 నేతాజీ సుభాష్ చంద్రబోస్: ది ఫర్ గాటెన్ హీరో ప్రభాబతి దేవి [2]

బెంగాలీ సినిమా

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
1962 కాంచన్‌జుంగా మనీషా సత్యజిత్ రే దర్శకత్వం వహించాడు [9]
1988 ఫెరా బుద్ధదేబ్ దాస్‌గుప్తా దర్శకత్వం వహించాడు
1997 సెడిన్ చైత్రమాస్
2000 పరోమితర్ ఏక్ దిన్ అపర్ణా సేన్ దర్శకత్వం వహించాడు
ఉత్సబ్ రీతుపర్ణో ఘోష్ దర్శకత్వం వహించాడు
2004 ప్రోహోర్
2006 క్రాంతి
2007 జర బ్రిస్టైట్ భిజేచ్చిలో
2015 కుటుంబ ఆల్బమ్
2016 బెంచే థాకర్ గాన్ [10]
2021 ఏకన్నోబోర్తి మైనక్ భౌమిక్ దర్శకత్వం వహించాడు

బెంగాలీ టీవీ కార్యక్రమాలు

మార్చు
సంవత్సరం పేరు ఛానల్ పాత్ర
1999 ఏక్ ఆకాశేర్ నిచే జీ బంగ్లా నందిని తల్లి
2008 ఖేలా జీ బంగ్లా తిస్టా తల్లి
2010 గనేర్ ఒపరే నక్షత్రం జల్షా సుచరిత సన్యాల్.
2013 బధుబరన్ నక్షత్రం జల్షా రంగమా.
2013 రాగే అనురాగే జీ బంగ్లా మల్లర్ తల్లి.
2016 మెంబౌ నక్షత్రం జల్షా గోరా అమ్మమ్మ.
2017 జమై రాజా జీ బంగ్లా నీలాషా నాన్నమ్మ
2019 గురియ జేఖానే గుడ్డు సేఖానే నక్షత్రం జల్షా
2019 శ్రీమోయీ నక్షత్రం జల్షా శ్రీమోయీ తల్లి.
2021 అమదర్ ఈ పోత్ జోడీ నా శేష్ హోయ్ జీ బంగ్లా రామ సర్కార్: సాత్యకి అమ్మమ్మ

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Sengupta, Debaleena (20 May 2012). "I knew who Monisha was: Alokananda Roy". Business Standard India. Retrieved 2022-02-24.{{cite news}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 "Bravely told heroic tale". www.telegraphindia.com. Retrieved 2022-02-24.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. 3.0 3.1 "Goopy Bagha on Ray birthday". www.telegraphindia.com. Retrieved 2022-02-24.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "‌দুই নাটকে জন্মদিন পালন সৌমিত্রর". www.aajkaal.in. Retrieved 2022-02-24.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  5. "Ranga Pishima to come alive through Tahar Namti Ranjana". The Times of India. Archived from the original on 26 October 2019. Retrieved 2022-02-24.
  6. "ঋতুপর্ণ ঘোষ". সববাংলায়. 30 August 2020. Archived from the original on 30 September 2020. Retrieved 2022-02-24.
  7. "BFJA Awards 1989: Complete list of Awards and Nominations". FilmiClub-US. Archived from the original on 15 April 2015. Retrieved 2022-02-24.
  8. "Anandalok Awards 1998: Complete list of Awards and Nominations". FilmiClub-US. Archived from the original on 20 April 2015. Retrieved 2022-02-24.
  9. "Ray Did: Actors relive moments spent with Ray". The Times of India. Retrieved 2022-02-24.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "Tollywood celebs glam up premiere of Benche Thakar Gaan". Indiablooms.com. Retrieved 2022-02-24.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

మార్చు